ఢిల్లీ : శానిటైజర్ విక్రయాలు, నిల్వలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సడలించింది. ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో శానిటైజర్ నిత్యావసర వస్తువుగా మారిన నేపథ్యంలో డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్ నిబంధనల నుంచి శానిటైజర్లకు మినహాయింపు కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో శానిటైజర్ వాడకం తప్పనిసరి కావడంతో అందరికీ అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
శానిటైజర్ అమ్మకాలకు డిమాండ్ పెరడగంతో కొందరు కేటుగాళ్లు దీనిని క్యాష్ చేసుకొని కల్తీ అమ్మకాలు జరుపుతున్నారు. దీన్ని అరికట్టే లక్ష్యంతో ఇకపై శానిటైజర అమ్మకాలు, నిల్వలపై అనుమతులు తప్పనిసరి చేస్తూ కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. (చీరలో మెరిసిపోతూ.. శానిటైజర్ అందిస్తోన్న రోబో)
శానిటైజర్ కొరత తలెత్తకుండా కొత్తగా మరో 600 సంస్థలకు తయారీ అనుమతులు ఇచ్చి ఉత్తర్వులు జారీ చేసింది. డిమాండ్ అవసరాలకు తగ్గట్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. శానిటైజర్ ధరలపై కూడా పరిమితులు విధిస్తూ నిర్ణయించింది. ఈ ప్రకటన తర్వాత శానిటైజర్ అమ్మకాలను లైసెన్సు నుంచి మినహాయింపులు కోరుతూ పలు విజ్ఞప్తులు కేంద్రానికి అందాయి. దీంతో ప్రజలకు శానిటైజర్ మరింత అందుబాటులో ఉండేందుకు వీలుగా డ్రగ్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ నిబంధనల నుంచి మినహాయింపు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. (శానిటైజర్ వాడుతున్నారా...)
Comments
Please login to add a commentAdd a comment