![RBI cancels licence of The Kapol Co operative Bank - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/26/RBI_penalty_0.jpg.webp?itok=rzA6Ydt2)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముంబైకి చెందిన బ్యాంకుకు భారీ షాకిచ్చింది. ది కపోల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను రద్దు చేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ ఒక ప్రకటన జారీ చేసింది. ఈ సహకార బ్యాంకుకు తగిన మూలధనం, ఆదాయ అవకాశాలు లేనందున లైసెన్స్‌ను రద్దు చేసినట్లు ఆర్‌బీఐ సోమవారం తెలిపింది.
ఇదీ చదవండి: బాలీవుడ్ స్టార్ బిల్డింగ్‌లో సూపర్‌మార్కెట్: నెలకు అద్దె ఎంతో తెలుసా?
అలాగే దీని 'బ్యాంకింగ్' వ్యాపారాన్ని కూడా బ్యాన్ చేసింది. డిపాజిట్ల స్వీకారం, డిపాజిట్ల మనీ తిరిగి చెల్లించడం లాంటి వాటిపై కూడా నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. సహకార మంత్రిత్వ శాఖలోని సహకార సంఘాల అదనపు కార్యదర్శి & సెంట్రల్ రిజిస్ట్రార్‌ను కూడా బ్యాంకును మూసివేసేందుకు ఒక ఉత్తర్వు జారీ చేయాలని , బ్యాంకుకు లిక్విడేటర్‌ను నియమించాలని అభ్యర్థించామని పేర్కొంది.
కాగా నిబంధనలు పాటించని బ్యాంకులపై కొరడా ఝళిపిస్తున్న ఆర్‌బీఐ ఎస్‌బీఐ సహా మూడుప్రభుత్వ రంగ బ్యాంకులకు భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే.
రరుణాలకు సంబంధించిన మార్గదర్శకాలు పాటించ లేదంటూ ఎస్‌బీఐకి రూ. 1.30 కోట్లు ద్రవ్య జరిమానా, ఇండియన్ బ్యాంకుకు రూ. 1.62 కోట్లు, అలాగే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుకు రూ. 1 కోటి జరిమానా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment