న్యూఢిల్లీ: స్పెక్ట్రం కొనుగోలు అంశంలో ట్రాయ్ సిఫార్సులకు టెలికం ప్యానెల్ మద్దతు తెలిపింది. ఈ మేరకు టెలికం కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారి ఒకరు శనివారం వెల్లడించారు. జరగబోయే వేలంలో 700 ఎంహెచ్‌జెడ్ ఎయిర్‌వేవ్ బ్యాండ్‌ను కూడా అమ్మకానికి ఉంచనున్నారు. ట్రాయ్ నిర్ణయించిన ప్రాథమిక ధరలకే ఈ వేలం జరగనుంది. ఈ వేలం ద్వారా మొత్తం రూ.5.60 లక్షల కోట్లు సమకూరుతాయని అంచనా.
ఢిల్లీ పరిధిలో ట్రాయ్ చేసిన సిఫార్సులు... 700 ఎంహెచ్‌జెడ్‌కు రూ. 1595 కోట్లు, 800 ఎంహెచ్‌జెడ్‌కు రూ. 848 కోట్లు, 900 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌కు రూ. 673 కోట్లుగా, 1800 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌కు రూ.399 కోట్లుగా, 2100 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌కు రూ.554 కోట్లు, 2300, 2500 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌లకు రూ. 143 కోట్లు స్పెక్ట్రం ధరలుగా నిర్ణయించింది. అత్యధిక ఫ్రీక్వెన్సీ గల స్పెక్ట్రంను సొంతం చేసుకున్న టెలికం కంపెనీలు ముందస్తుగా 50 శాతం, పదేళ్లలో మిగతా మొత్తాన్ని చెల్లించాలని సూచించింది.
ట్రాయ్ నిర్ణయానికి మద్దతు తెలిపిన టెలికం ప్యానెల్
Published Sun, May 1 2016 1:35 AM | Last Updated on Fri, Nov 9 2018 6:16 PM
Advertisement
Advertisement