సర్కారుకు 18,267 కోట్ల స్పెక్ట్రం నిధులు
న్యూఢిల్లీ: గత నెలలో పూర్తయిన 2జీ స్పెక్ట్రం వేలం బిడ్డింగ్‌లో గెలుపొందిన టెలికం కంపెనీల నుంచి ప్రభుత్వానికి తొలివిడత(అప్‌ఫ్రంట్) చెల్లింపుల కింద రూ.18,267 కోట్లు లభించాయి. టెలికం శాఖ కార్యదర్శి ఎంఎఫ్ ఫారూఖీ ఈ విషయాన్ని చెప్పారు. మొత్తం ఏడు కంపెనీలు.. వొడాఫోన్, ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, ఐడియా, టెలీవింగ్స్(యూనినార్), ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ వేలంలో స్పెక్ట్రంను దక్కించుకున్నాయి.
కాగా, బిడ్డింగ్‌తో పోలిస్తే రూ.30 కోట్లు తగ్గాయని, కొన్ని సర్వీసు ఏరియాల్లో తగినంత స్పెక్ట్రం అందుబాటులో లేకపోవడమే కారణమని సమాచారం. 2జీ వేలంలో(1,800, 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌విడ్త్‌లు) ప్రభుత్వానికి రూ.62,162 కోట్ల విలువైన బిడ్‌లు లభించడం తెలిసిందే. కాగా తుది బిడ్డింగ్ రేటులో 1,800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రం విజేతలు 33%, 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో విజేతల నుంచి 25% అఫ్‌ఫ్రంట్ మొత్తం లభించింది. మిగతా మొత్తాన్ని రెండేళ్ల తర్వాత నుంచి వార్షిక వా యిదాల్లో(10% వడ్డీతో) టెల్కోలు చెల్లించనున్నాయి.