స్పెషల్‌ బాండ్‌.. స్పెషల్‌ డైరెక్టర్‌! | Taking on Danny Boyle as the new James Bond director is a risk. He’s a wild directorholl | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ బాండ్‌.. స్పెషల్‌ డైరెక్టర్‌!

Published Mon, Mar 19 2018 12:31 AM | Last Updated on Fri, Nov 9 2018 6:16 PM

Taking on Danny Boyle as the new James Bond director is a risk. He’s a wild directorholl - Sakshi

డేనీ బోయల్‌

బాండ్‌.. జేమ్స్‌బాండ్‌. 56 సంవత్సరాల బ్రాండ్‌ అది. 24 సినిమాల ఎంటర్‌టైన్‌మెంట్‌. ఎంతో మంది దర్శకులు మారిపోయారు. ఎంతో మంది నటులూ మారిపోయారు. ఆ బ్రాండ్‌ ఇప్పటికీ అలాగే ఉంది. బాండ్‌ సినిమా వస్తోందంటే యాక్షన్‌ సినిమా అభిమానులకు పండగే. ఇక ఈసారి వచ్చేది 25వ సినిమా కదా! కాబట్టి ఈ స్పెషల్‌ బాండ్‌ సెట్స్‌పైకి వెళ్లకముందు నుంచే రోజూ వార్తల్లో కనిపిస్తోంది. ఇంతకుముందు నేటితరం టాప్‌ డైరెక్టర్‌ క్రిస్టొఫర్‌ నోలన్‌ బాండ్‌ 25వ సినిమాకు డైరెక్టర్‌ అని వినిపించింది. ఆ తర్వాత వరుసగా టాప్‌ డైరెక్టర్స్‌ పేర్లన్నీ ఒక్కొక్కటిగా వినిపిస్తూ వచ్చాయి. ఇక ఎట్టకేలకు స్పెషల్‌ బాండ్‌ దర్శకుడు ఫిక్స్‌ అయిపోయాడు. ఆయనే మన డేనీ బోయల్‌.

‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’, ‘127 అవర్స్‌’ సినిమాలతో ఇండియన్‌ సినిమా అభిమానులకూ బాగా దగ్గరైన డేనీ, జేమ్స్‌బాండ్‌ కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నానని స్వయంగా ప్రకటించాడు. ఇప్పుడే అసలైన చర్చ మొదలైంది. డ్రామా, థ్రిల్లర్‌ జానర్‌కు పెట్టింది పేరైన డేనీ బోయల్, బాండ్‌ లాంటి ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడా అన్నది ఆసక్తికరం.ఇప్పటికే దర్శకులు మారినప్పుడల్లా బాండ్‌ సినిమా ప్లాట్, కోర్‌ ఎమోషన్, టోన్‌ మారిపోతూ వచ్చింది. ముఖ్యంగా స్కై ఫాల్, స్పెక్టర్‌ సినిమాలతో శామ్‌ మెండిస్‌ బాండ్‌ రూపు రేఖలనే మార్చేశాడు. దీంతో ఇప్పుడు కొత్తగా, అదీ స్పెషల్‌ సినిమాకు, ఈ స్పెషల్‌ డైరెక్టర్‌ డేని బోయల్‌ ఏ టోన్‌ పట్టుకొస్తాడో చూడాలి. గత నాలుగు జేమ్స్‌బాండ్‌ సినిమాలకు హీరో అయిన డేనియల్‌ క్రెయిగ్‌ ఈ సినిమాలోనూ నటిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement