
అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఓపన్‌హైమర్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఓపెన్‌హైమర్’. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఓపన్‌హైమర్ పాత్రను సిలియన్ మర్ఫీ పోషించారు. ఈ పాత్రను అర్థం చేసుకోవడానికి తాను భగవద్గీత చదివానని పేర్కొన్నారు సిలియన్. భగవద్గీతకి, ఈ పాత్రకి లింక్ ఏంటీ?
అంటే.. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు అణు బాంబు తయారు చేయడానికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ‘సృష్టించింది నేనే.. నాశనం చేసింది నేనే’ అనే శ్లోకం ప్రేరణగా నిలిచిందని ఓపెన్‌హైమర్ వెల్లడించారు. అందుకే ఆయన పాత్ర చేయడానికి భగవద్గీత చదివానని సిలియన్ మర్ఫీ అన్నారు. ఓపెన్‌హైమర్ జీవితంలో కీలకంగా నిలిచిన అణు బాంబు తయారీ ప్రధానాంశంగా రూపొందిన ‘ఓపెన్‌హైమర్’ యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా ఇంగ్లిష్‌లో ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 21న విడుదల కానుంది.