బాండ్‌ ఈజ్‌ బ్యాక్‌ | Bond 25 First Footage With Daniel Craig, Cary Fukunaga | Sakshi
Sakshi News home page

బాండ్‌ ఈజ్‌ బ్యాక్‌

Published Sun, Jun 30 2019 2:36 AM | Last Updated on Sun, Jun 30 2019 2:36 AM

Bond 25 First Footage With Daniel Craig, Cary Fukunaga - Sakshi

డేనియల్‌ క్రెగ్‌

జమైకా లొకేషన్‌లోకి జేమ్స్‌ బాండ్‌ తిరిగొచ్చారు. డేనియల్‌ క్రెగ్‌ హీరోగా క్యారీ జోజీ ఫుకునాగ దర్శకత్వంలో బాండ్‌ సిరీస్‌లో 25వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జమైకాలో జరిగిన ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ఓ యాక్షన్‌ సీక్వెన్‌లో భాగంగా హీరో డేనియల్‌ కాలికి గాయమైన సంగతి గుర్తుండే ఉంటుంది. దాదాపు నెల రోజుల విరామం తీసుకున్న క్రెగ్‌ తిరిగి సెట్‌లోకి అడుగుపెట్టారు. జమైకా యాక్షన్‌ షూట్‌లో జాయిన్‌ అయ్యారు. ఆస్కార్‌ విన్నింగ్‌ యాక్టర్‌ రమీ మాలిక్‌ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. నోమి హ్యారిస్, లియా సేడౌస్‌ కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement