ఆస్కార్‌ హీరో... బాండ్‌కి విలన్‌! | Rami Malek 'amid contenders to play Bond villain opposite Daniel Craig' | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ హీరో... బాండ్‌కి విలన్‌!

Published Fri, Mar 1 2019 1:00 AM | Last Updated on Fri, Mar 1 2019 1:00 AM

Rami Malek 'amid contenders to play Bond villain opposite Daniel Craig' - Sakshi

రమీ మాలిక్‌

జేమ్స్‌ బాండ్‌ చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పటివరకూ వచ్చిన బాండ్‌ చిత్రాల వసూళ్లే అందుకు నిదర్శనం. తాజాగా ఈ జేమ్స్‌బాండ్‌ ఫ్రాంచైజీలో 25వ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘షట్టర్‌ హ్యాండ్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నారట. డేనియల్‌ క్రెగ్‌ హీరోగా నటిస్తారు. ఈ ఏడాది  ఆస్కార్‌ ఉత్తమ నటుడిగా నిలిచిన రమీ మాలిక్‌ ఈ చిత్రంలో విలన్‌గా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు డానీ బోయిలే దర్శకత్వం వహించాల్సింది. క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వల్ల ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు కారీ జోజి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. బాండ్‌ సినిమాను డైరెక్టర్‌ చేయనున్న ఫస్ట్‌ అమెరికన్‌ ఇతనేనట. ఈ సినిమాను ఏప్రిల్‌ 2020లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement