‘బాండ్ 25’ టైటిల్‌ ఫిక్స్‌! | James Bond 25 is Officially Titled No Time to Die | Sakshi
Sakshi News home page

‘బాండ్ 25’ టైటిల్‌ ఫిక్స్‌!

Published Wed, Aug 21 2019 11:07 AM | Last Updated on Wed, Aug 21 2019 11:08 AM

James Bond 25 is Officially Titled No Time to Die - Sakshi

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదారణ పొందిన యాక్షన్‌ మూవీ సీరిస్‌ జేమ్స్‌ బాండ్‌. ఇప్పటికే ఈ సిరీస్‌లో 24 సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా ఈ సిరీస్‌లో 25వ సినిమా తెరకెక్కుతోంది. డేనియల్‌ క్రెగ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘నో టైం టు డై’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు.

ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 ఏప్రిల్ 3న యూకేలో, 2020 ఏప్రిల్ 8న అమెరికాలో విడుదల కానుందని తెలిపారు. ముందుగా ఈ సినిమాకు ఏ రీజన్‌ టు డైగా నిర్ణయించినా చివరి నిమిషంలో నో టైం టు డైగా మార్చారు. కారీ జోజి ఫుకునాగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మోట్రో గోల్డెన్‌ మేయర్‌, ఇయోన్ ప్రొడక్షన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement