టెలినార్ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొన కూడదని ప్రముఖ టెలికాం సంస్థ టెలినార్ నిర్ణయించింది. త్వరలో జరగబోయే ఈ వేలంలో పాల్గొనడం లేదని ఒక ప్రకనటలో వెల్లడించింది. ప్రస్తుత ప్రతిపాదిత స్పెక్ట్రం ధరలు తమకు ఆమోదయోగ్య లేవని, వేలం కోసం ప్రతిపాదించిన కనీస ధరలు అధికంగా ఉండటమే ఇందుకు కారణమని టెలినార్ గ్రూప్ సీఈవో సిగ్వే బ్రెక్కి తెలిపారు. సంస్థ ఆర్థిక ఫలితాల వెల్లడించిన సందర్భంగా ఆయన ఈ వివరణ ఇచ్చారు. భారతదేశంలో ప్రస్తుతం ఏడు సెక్టార్స్లో 1800 ఎంహెచ్ జెడ్ బ్యాండ్ లో 4జీ ప్రసారాలు ఉన్నా, వాటిలో ఆరు రాష్ట్రాల్లో 2 జి సేవలను అందిస్తున్నామని తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ , బీహార్, గుజరాత్, మహారాష్ట్రలో2 జీ సేవలు అందిస్తుండగా అస్సాంలో ఇంకా ప్రారంభించలేకపోయామని అందుకే ఈ స్పెక్ట్రం వేలం పాల్గొనబోమని టెలినార్ స్పష్టం చేసింది.
దేశీయ వ్యాపారాలకు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నామని టెలినార్ తెలిపింది. దేశీయంగా ఇతర టెలికాం సంస్థలతో పోటీ పడుతూ, దీర్ఘకాలం కొనసాగాలంటే మరింత స్పెక్ట్రమ్ కావాలి. అయితే అయితే దేశీయ టెలికాం రంగం నుంచి ఇప్పుడే తప్పుకోవడం లేదని, తక్కువ నష్టంతో బయట పడేందుకు కొంతకాలం సేవలు కొనసాగిస్తామన్నారు. త్వరలో జరగబోయే స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నామని సంస్థ ప్రకటించింది. కాగా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టెలినార్ ఇండియా రూ.105 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.71.3 కోట్లు. ఆదాయం మాత్రం రూ.1,080 కోట్ల నుంచి రూ.1230 కోట్లకు పెరిగింది. మరోవైపు టెలినార్ తో విలీనం చర్చలను వోడా ఫోన్ మరింత వేగవంతం చేసింది.