స్పెక్ట్రమ్ వేలాన్ని జూన్ 25కు వాయిదా వేస్తున్నట్లు టెలికా విభాగం(డాట్) ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యుల్ ప్రకారం ఈ వేలం జూన్ 6(గురువారం)న నిర్వహించాల్సి ఉంది. వాయిదాకుగల కారణాలను మాత్రం డాట్ వెల్లడించలేదు.
మొబైల్ ఫోన్ సేవల కోసం ఎనిమిది స్పెక్ట్రమ్ బ్యాండ్‌లను రూ.96,317 కోట్ల కనీస ధరతో వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 800 - 900 - 1800 - 2100 - 2300 - 2500 - 3300 మెగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌ల స్పెక్ట్రమ్‌ను వేలంలో విక్రయించనుంది. అందులో ఎలాగైనా గరిష్ఠవాటాను సొంతం చేసుకోవాలని టాప్ కంపెనీలు ఈఎండీ చెల్లించి, అధిక పాయింట్లు పొందేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రక్రియ కోసం రిలయన్స్ జియో రూ.3,000 కోట్ల మొత్తాన్ని (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్-ఈఎండీ) డిపాజిట్ చేయడం ద్వారా అత్యధిక రేడియో తరంగాలకు బిడ్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధ చేసింది. భారతీ ఎయిర్‌టెల్ రూ.1,050 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.300 కోట్ల ఈఎండీని డిపాజిట్ చేశాయి.
ఇదీ చదవండి: జూన్ 14 తర్వాత ఆధార్ పనిచేయదా..? స్పష్టతనిచ్చిన యూఐడీఏఐ
స్పెక్ట్రమ్ అంటే?
సెల్‌ఫోన్లు, రేడియోలు వంటి వైర్‌లెస్ సాధనాలకు సిగ్నళ్లు కావాలి. వీటి మధ్య సమాచార మార్పిడికి విద్యుదయస్కాంత తరంగాలు అవసరం. వీటినే రేడియో తరంగాలు అని కూడా అంటారు. ఇలాంటి విద్యుదయస్కాంత తరంగాల శ్రేణినే స్పెక్టమ్ అంటారు. ఒక సాధనం నుంచి ఇంకో సాధనానికి సమాచారం చేరవేతకు నిర్దిష్ట పౌనఃపున్యాలు (ఫ్రీక్వెన్సీలు) ఉంటాయి. రేడియోకు వేరేగా.. సెల్‌ఫోన్లకు వేర్వేరు ఫ్రీక్వెన్సీలను కేటాయించారు. ఫ్రీక్వెన్సీని బట్టి స్పెక్ట్రమ్‌ను వివిధ బ్యాండ్‌లుగా వర్గీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment