లూప్ నుంచి తప్పుకున్న ఎయిర్‌టెల్ | Bharti Airtel calls off Rs 700 cr deal to buy Loop Mobile | Sakshi
Sakshi News home page

లూప్ నుంచి తప్పుకున్న ఎయిర్‌టెల్

Published Thu, Nov 6 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

లూప్ నుంచి తప్పుకున్న ఎయిర్‌టెల్

లూప్ నుంచి తప్పుకున్న ఎయిర్‌టెల్

న్యూఢిల్లీ: టెలికం సేవల దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ముంబైకి చెందిన లూప్ మొబైల్‌ను కొనుగోలు చేసే ప్రణాళికలనుంచి తప్పుకుంది. లూప్‌ను కొనుగోలు చేసేందుకు రూ. 700 కోట్లతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఫిబ్రవరిలో కుదిరిన ఈ ఒప్పందానికి టెలికం శాఖ(డాట్) నుంచి అనుమతి లభించాల్సి ఉంది. దీంతో 17 లక్షలమంది వినియోగదారులు కలిగిన లూప్... ఎయిర్‌టెల్‌తో విలీనమయ్యే అవకాశాన్ని పోగొట్టుకుంది.

ఈ అంశాన్ని బీఎస్‌ఈకి వెల్లడిస్తూ ఎయిర్‌టెల్ ఇప్పటివరకూ డాట్ అనుమతులు లభించకపోగా, ఈ నెలతో లూప్ లెసైన్స్ గడువు ముగిసిపోతున్నదని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత కొనుగోలు ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలిపింది. 2012 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు రద్దు చేసిన 122 టెలికం లెసైన్స్‌లలో లూప్ టెలికం కూడా ఉండటంతో ఖైతాన్ గ్రూప్ కంపెనీ అయిన లూప్ మొబైల్‌కు దెబ్బ త గిలిన సంగతి తెలిసిందే.

 కాగా, మిగిలిన ముంబై సర్కిల్ లెసైన్స్ గడువు సైతం ఈ నెల 29తో ముగియనుంది. నిజానికి ముంబై కార్యకలాపాలను కొనసాగించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్వహించిన వేలంలో స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే లూప్ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయకపోవడం గమనార్హం. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్ షేరు దాదాపు 3% క్షీణించి రూ. 385 వద్ద ముగిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement