'నన్ను బాండ్ లేడీ అనే పిలవండి' | Monica Bellucci prefers to be called a 'Bond lady' | Sakshi
Sakshi News home page

'నన్ను బాండ్ లేడీ అనే పిలవండి'

Published Tue, Feb 24 2015 9:07 AM | Last Updated on Fri, Nov 9 2018 6:16 PM

Monica Bellucci prefers to be called a 'Bond lady'

తనను బాండ్ లేడీ అని పిలిస్తేనే ఇష్టంగా ఉంటుందని హాలీవుడ్ నటి మోనికా బెల్లుస్సీ(50) అంటున్నారు.  ఆమె జేమ్స్ బాండ్ చిత్రం 'స్పెక్ట్రం'లో  హీరోయిన్గా నటించనున్నారు. ఈ చిత్రంలో డానియెల్ క్రేగ్ (46) హీరోగా నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో బాండ్ గర్ల్ అనే పేరు తనకు సరిగ్గా సరిపోదని, అలా ఎవరైనా పిలవడం కూడా ఇష్టం ఉండదని అంటున్నారామె.

ఈ చిత్ర దర్శకుడు శ్యామ్ మెండీస్ బాండ్ గర్ల్ అని పిలిచినప్పటి నుంచి యాబై ఏళ్ల ప్రాయంలో తాను గర్ల్ ఏమిటి అనే ప్రశ్న తన బుర్రను తొలుస్తుందని మోనికా చెప్తున్నారు. గతంలో బాండ్ చిత్రాల్లో నటించిన హీరోయిన్లందరికన్నా తాను పెద్దదానినని, బాండ్ లేడీ అని పిలవడమే కరెక్ట్ అని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement