జేమ్స్ బాండ్ సినిమాలో డానియెల్ క్రెయిగ్
జేమ్స్ బాండ్ సినిమాలు అంటేనే భారీ ఎత్తున తెరకెక్కుతున్నాయి. కళ్లు చెదిరే బడ్జెట్‌తో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో ఒకింత రియలిస్టిక్‌గా తెరకెక్కే ఈ సినిమా షూటింగ్‌లలో అపశ్రుతులు దొర్లడం పరిపాటే. తాజాగా తెరకెక్కుతున్న జేమ్స్ బాండ్ 25వ సినిమా షూటింగ్‌లోనూ అపశ్రుతి చోటుచేసుకుంది.
లండన్ శివార్లలోని పైన్‌వుడ్ స్టూడియోలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ సెట్‌లో పేలుడు చోటుచేసుకుంది. సినిమా షూటింగ్‌లో భాగంగా పేలుడును ప్లాన్ చేసినప్పటికీ.. అది శ్రుతి మించడంతో ఇక్కడ ఏర్పాటుచేసిన వేదిక ధ్వంసమైంది. ఒక వ్యక్తి గాయపడ్డారు. ఈ విషయాన్ని ట్విటర్‌లో తెలియజేసిన చిత్రయూనిట్ అదృష్టవశాత్తు తమ బృందంలోని ఎవరికీ గాయాలు కాలేదని, వేదిక బయట ఉన్న క్రూ మెంబర్‌కు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయని వెల్లడించింది.
ఈ అనూహ్య పేలుడు చిత్ర నిర్మాణ బృందానికి మరో ఎదురుదెబ్బేనని పరిశీలకులు భావిస్తున్నారు. జమైకాలో యాక్షన్ సీన్లు తెరకెక్కిస్తుండగా చిత్ర హీరో డానియెల్ క్రెయిగ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో రెండు వారాలపాటు క్రెయిగ్ విశ్రాంతి తీసుకొని.. షూటింగ్‌కు దూరంగా ఉన్నారు. చిత్ర దర్శకుడైన డ్యానీ బోయ్లే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో చిత్ర విడుదల దాదాపు ఆరు నెలలు వాయిదాపడి.. అక్టోబర్ 2019 నుంచి ఏప్రిల్ 2020కి మారింది.
Comments
Please login to add a commentAdd a comment