James Bond film
-
బాండ్ ఈజ్ బ్యాక్, అమేజింగ్ ట్రైలర్
డేనియల్ క్రేగ్ హీరోగా నటిస్తున్న జేమ్స్ బాండ్ సినిమా ‘నో టైమ్ టు డై’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కారీ జోజి ఫుకునాగా (ట్రూ డిటెక్టివ్) దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం యూనిట్ రిలీజ్ చేసింది. జేమ్స్ బాండ్ సిరీస్‌లో 25వ సినిమాగా వస్తున్న ఈ మూవీలోని యాక్షన్ సీన్లు బాండ్ సినిమా ఫ్యాన్స్నుఒక రేంజ్లో అలరిస్తున్నాయి. అంతేకాదు గత సినిమాలతో పోలిస్తే..లేటెస్ట్ మూవీలో క్రేగ్ మరింత స్టయిలిష్‌గా, స్టన్నింగ్‌గా కనిపిస్తున్నాడు. కాగా ఇటీవల రిలీజైన 15 సెకన్ల టీజర్‌కూడా బాగానే ఆసక్తిని రేపింది. ఆస్కార్ విజేత రామీ మాలిక్ విలన్ పాత్ర పోషిస్తున్న ఈ మూవీని మొదట నవంబర్ 2019న విడుదల చేయాలనుకున్నప్పటికీ అది సాధ్యంకాలేదు. దీంతో 2020 ఫిబ్రవరికి వాయిదా పడింది. చివరకు ఇండియాలో వచ్చే ఏడాది ఏప్రిల్ 3న, ఏప్రిల్ 8న అమెరికాలో, ఏప్రిల్ 2న కెనడాలో విడుదల చేయనున్నారు. ఇక కథ విషయానికి వస్తే..జమైకాలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న బాండ్‌ను సీఐఏ మళ్లీ సహాయం కోరుతుంది. కిడ్నాప్ అయిన శాస్త్రవేత్తను రక్షించడమనే మిషన్‌ను అప్పగిస్తుంది. ఈ మిషన్ ఊహించినదానికంటే మరింత క్లిష్టంగా మారడం, విలన్ల చేతిలో అతి ప్రమాదకరమైన ఆయుధాలు, అత్యాధునిక టెక్నాలజీ, ఛేజింగ్‌లు ఈ కథలో ముఖ్యమైన అంశాలు. -
జేమ్స్ బాండ్ సినిమా షూటింగ్లో పేలుడు
జేమ్స్ బాండ్ సినిమాలు అంటేనే భారీ ఎత్తున తెరకెక్కుతున్నాయి. కళ్లు చెదిరే బడ్జెట్‌తో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో ఒకింత రియలిస్టిక్‌గా తెరకెక్కే ఈ సినిమా షూటింగ్లలో అపశ్రుతులు దొర్లడం పరిపాటే. తాజాగా తెరకెక్కుతున్న జేమ్స్ బాండ్ 25వ సినిమా షూటింగ్‌లోనూ అపశ్రుతి చోటుచేసుకుంది. లండన్ శివార్లలోని పైన్‌వుడ్ స్టూడియోలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ సెట్లో పేలుడు చోటుచేసుకుంది. సినిమా షూటింగ్లో భాగంగా పేలుడును ప్లాన్ చేసినప్పటికీ.. అది శ్రుతి మించడంతో ఇక్కడ ఏర్పాటుచేసిన వేదిక ధ్వంసమైంది. ఒక వ్యక్తి గాయపడ్డారు. ఈ విషయాన్ని ట్విటర్లో తెలియజేసిన చిత్రయూనిట్ అదృష్టవశాత్తు తమ బృందంలోని ఎవరికీ గాయాలు కాలేదని, వేదిక బయట ఉన్న క్రూ మెంబర్‌కు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయని వెల్లడించింది. ఈ అనూహ్య పేలుడు చిత్ర నిర్మాణ బృందానికి మరో ఎదురుదెబ్బేనని పరిశీలకులు భావిస్తున్నారు. జమైకాలో యాక్షన్ సీన్లు తెరకెక్కిస్తుండగా చిత్ర హీరో డానియెల్ క్రెయిగ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో రెండు వారాలపాటు క్రెయిగ్ విశ్రాంతి తీసుకొని.. షూటింగ్‌కు దూరంగా ఉన్నారు. చిత్ర దర్శకుడైన డ్యానీ బోయ్లే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో చిత్ర విడుదల దాదాపు ఆరు నెలలు వాయిదాపడి.. అక్టోబర్ 2019 నుంచి ఏప్రిల్ 2020కి మారింది. -
ఈత రాకున్నా పర్లేదు!
జేమ్స్‌బాండ్ సినిమాలోని హీరో క్యారెక్టర్ వినూత్న పరికరాలతో ప్రత్యర్థులను బురిడీ కొట్టిస్తాడు కదా! సరిగ్గా అలాంటి పరికరాన్నే ఒకదాన్ని కొందరు రూపొందించారు. కాకపోతే అది ప్రత్యర్థులను చిత్తు చేయడానికి కాదు.. క్లిష్ట సమయంలో ఎవరికి వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి. సరికొత్తగా ఆవిష్కృతమైన కింగ్లీ అనే రిస్ట్ బ్యాండ్ కేవలం అలంకరణ కోసమే కాకుండా మీ ప్రాణాలను సైతం నిలబెడుతుంది. అదెలాగంటే ప్రమాదవశాత్తు నీళ్లలో పడినప్పుడు మీకు ఈత రాకున్నప్పటికీ మిమ్మల్ని నీటిలో తేలేలా చేస్తుంది. నీటిలో మునిగినప్పుడు దీనికి గల మీట నొక్కితే చాలు దీనిలో అమర్చి ఉన్న బెలూన్ తెరుచుకుంటుంది. అంతేకాకుండా ప్రమాదంలో ఉన్న వారికి సంబంధించిన వ్యక్తులను సైతం ఇది అలర్ట్ చేస్తుంది. ప్రస్తుతం దీని మార్కెట్ ధర సుమారు రూ.7 వేల వరకూ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఏటా నీటిలో మునిగిపోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రిస్ట్ బ్యాండ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తయారీ దారులు చెబుతున్నారు. -
వేలంలో దుమ్మురేపిన బాండ్ వస్తువులు
అత్యంత భారీ బడ్జెత్ తో నిర్మించే జేమ్స్ బాండ్ చిత్రాలంటే ప్రపంచ వాప్తంగా ఎంతగానే క్రేజ్ ఉంది. జేమ్స్‌బాండ్.. ఈ పేరే ఒక బ్రాండ్. సుమారు అయిదు దశాబ్దాల క్రితం నాటి సినిమా నుంచి ఇప్పటి స్పెక్టర్ దాకా తన స్టయిల్‌తో బాండ్ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. జేమ్స్ బాండ్ 007 సిరీస్ నుంచి విడుదలైన 24వ చిత్రం 'స్పెక్టర్'. ఈ చిత్రంలో ఉపయోగించిన కారు, చేతి గడియారం, క్లాప్బోర్టు, బాండ్ ధరించిన మాస్క్...తదితర 24 వస్తువులను గురువారం లండన్‌లోని క్రిస్టీస్ ఆక్షన్ హౌస్‌లో వేలం వేశారు. దీని ద్వారా వచ్చిన డబ్బును సమాజ సేవ కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నారు. ఆస్టన్ మార్టిన్ కారు.. వేలంలో స్పెక్టర్ కథానాయకుడు డానియేల్ ఉపయోగించిన ఆస్టన్ మార్టిన్ డీబీ10 కారుకు అత్యధిక ధర పలికింది. వేలం నిర్వాహకులు ఈ కారు ధర 1.4 మిలియన్ డాలర్ల నుంచి 2.1 మిలియన్ డాలర్లు పలకవచ్చని అంచనా వేశారు. కాని వారి అంచనాలను మించి ఈ కారు ఏకంగా 3.5 మిలియన్ డాలర్లు(2,434,500 యూరోలు) పలికింది. చిత్రం కోసం ఆస్టన్ మార్టిన్ డీబీ10 మోడల్ కార్లు పదింటిని ప్రత్యేకంగా తయారుచేయించగా మిగిలినవాటిలో రెండు డిస్ప్లే కోసం ఉంచారు. మిగతావి షూటింగ్ సమయంలో పాడైపోయాయి. ఇక ఆఖరికి మిగిలిన ఓకే ఒక్క కారును ఇప్పుడు వేలం వేశారు. ఈ కారును రోడ్లపై నడిపేందుకు అనుమతి లేదు. అయినా సరే... బాండ్ కారుకి ఉన్న క్రేజ్ అంత మొత్తం వెచ్చించేలా చేసింది. జేమ్స్ బాండ్ సినిమాల్లో బాండ్ క్యారెక్టర్ ఉపయోగించే కార్లకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అత్యాధునిక ఆయుధాలతో, ఆటోమేటిక్ కంట్రోల్స్‌తో జేమ్స్ బాండ్ కోసం ఈ కార్లను ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. చిన్న బటన్ నొక్కితే బయటకు వచ్చి బుల్లెట్ల వర్షం కురిపించే మెషీన్ గన్లు, చిన్నపాటి మిసైళ్లు, పొగలు కక్కే స్మోక్ స్క్రీన్, బుల్లెట్ ప్రూఫ్ బాడీ, తొలగించేందుకు వీలుగా ఉండే రూఫ్, జిపిఎస్ నావిగేషన్, టెలిఫోన్ కనెక్షన్, సీక్రెట్ స్విచ్‌లు వంటి ఎన్నో వింతలు ఈ కారు సొంతం. మొట్టమొదటిసారిగా 1964లో జేమ్స్ బాండ్ గోల్డ్‌ఫింగర్ సినిమాలో ఇది కనిపించింది. ఇది అప్పట్లో అఫీషియల్ బాండ్ కారుగా చెలామణీలోకి వచ్చింది. అప్పట్నుంచి 11 బాండ్ సినిమాల్లో ఈ కార్లు దర్శనమిచ్చాయి. ఒమేగా వాచ్.. బాండ్ చేతికి ప్రారంభంలో రోలెక్స్ వాచీలు కనిపించేవి. అయితే, 1995 తర్వాత నుంచి ఆ స్థానాన్ని ఒమేగా బ్రాండ్ ఆక్రమించింది. కెసినో రాయల్ సినిమాలో ఇందుకు సంబంధించి సంభాషణ కూడా ఉంటుంది. లేటెస్ట్గా స్పెక్టర్ సినిమాలో బాండ్ వాడిన ఒమేగా వాచ్ వేలంలో 92,500 యూరోలు పలికింది. టామ్ ఫోర్డ్ సూటు.. క్వాంటమ్ ఆఫ్ సొలేస్ సినిమా నుంచి జేమ్స్ బాండ్ అధికారిక టైలర్‌గా బ్రియోనీ స్థానాన్ని టామ్ ఫోర్డ్ దక్కించుకుంది. అప్పట్నుంచీ టామ్ ఫోర్డ్ సూట్లకు బాండ్.. బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. వేలంలో ఈ సూటు కు 27,500 యూరోలు దక్కాయి. ఇంకా మిగిలి ఉన్న వాటిని ఆన్లైన్ లో ఈ నెల 23 వరకు వేలంలో ఉంచారు. మీరు కూడా ప్రయత్నించాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. బాండ్ వాడిన వస్తువులకు వేలంలో పలికిన ధరలు ఆస్టన్ మార్టిన్ డీబీ10- 2,434,500 యూరోలు ఒమేగా వాచ్ -92,500 యూరోలు టామ్ ఫోర్డ్ డిన్నర్ సూట్- 27,500 యూరోలు ఒబెర్హా యూజర్స్ స్పెక్టర్ రింగ్ - 32,500యూరోలు డెడ్ కాస్ట్యూమ్స్ -98,500 యూరోలు -
బాండ్.. జేమ్స్ బ్రాండ్
జేమ్స్ బాండ్ సినిమాల్లో బ్రాండ్స్ హవా * కార్ల నుంచి వాచీల దాకా అన్నీ బ్రాండెడ్ * ప్రొడ్యూసర్లకు, కంపెనీలకూ ప్రయోజనకరంగా డీల్స్ జేమ్స్‌బాండ్.. ఈ పేరే ఒక బ్రాండ్. సుమారు అయిదు దశాబ్దాల క్రితం నాటి సినిమా నుంచి ఇప్పటి స్పెక్టర్ దాకా బాండ్ ... తన స్టయిల్‌తో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు (కొన్ని సినిమాలు మినహాయిస్తే). మిగతా సినిమాలతో పోలిస్తే బాండ్ సినిమాల్లో బ్రాండ్ల హడావుడి కూడా ఎక్కువగానే ఉంటుంది. చేతికి పెట్టుకునే వాచీల దగ్గర్నుంచీ రయ్యిన దూసుకెళ్లే కార్ల దాకా అన్నీ బ్రాండెడే. జేమ్స్ బాండ్ సినిమాల తయారీ నుంచి వాటి మార్కెటింగ్ దాకా ఈ ఉత్పత్తుల సంస్థల ప్రమేయమూ బాగానే ఉంటుంది. ఇది ఆర్థికంగా అటు నిర్మాతలకూ, ప్రచారపరంగా ఇటు ఆయా సంస్థలకూ ప్రయోజనకరంగా ఉంటున్నాయి. ఉదాహరణకు.. బాండ్ సిరీస్‌లోనే అత్యంత ఖరీదైనదిగా చెబుతున్న స్పెక్టర్ (నిర్మాణ వ్యయం సుమారు 194 మిలియన్ పౌండ్లని అంచనా) పోస్టర్లో బాండ్ ధరించిన ఎన్ పీల్ సంస్థ దుస్తులు హాట్ కేకులుగా అమ్ముడైపోయాయి. ఇలాంటి ప్రయోజనాలు ఉన్నందుకే.. డై అనదర్ డే లాంటి సినిమాకి ప్రొడ్యూసర్లతో.. ఏకంగా 21 బ్రాండ్ పార్ట్నర్స్ చేతులు కలిపారు. స్పెక్టర్ సినిమాలో కనీసం 17 బ్రాండ్ల ఉత్పత్తులు కనిపిస్తాయి. అందుకే.. హైనెకెన్ వంటి బ్రాండ్లు బాండ్ సినిమాతో అనుబంధం పెంచుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి. స్కైఫాల్ సినిమా వ్యయంలో సుమారు మూడో వంతు (దాదాపు 28 మిలియన్ పౌండ్లు) ఇన్వెస్ట్ చేసిన హైనెకెన్ సంస్థ.. డేనియల్ క్రెగ్ తో కలిసి దాదాపు 100 మిలియన్ డాలర్ల ఖర్చుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జేమ్స్బాండ్లైఫ్స్టయిల్ పేరిట వెబ్సైటు కూడా ఉంది. జేమ్స్‌బాండ్ బ్రాండ్ విలువ దాదాపు 13 బిలియన్ పౌండ్లు ఉంటుందనేది లండన్ స్కూల్ ఆఫ్ మార్కెటింగ్ నిపుణుల అంచనా. తాజాగా స్పెక్టర్ మూవీ రిలీజైన నేపథ్యంలో.. అందరి దృష్టినీ ఆకర్షించిన బ్రాండ్స్‌లో ఇవి.. ఆస్టన్ మార్టిన్ కారు.. మొట్టమొదటిసారిగా 1964లో జేమ్స్ బాండ్ గోల్డ్‌ఫింగర్ సినిమాలో ఇది కనిపించింది. ఇది అప్పట్లో అఫీషియల్ బాండ్ కారుగా చెలామణీలోకి వచ్చింది. అప్పట్నుంచి 11 బాండ్ సినిమాల్లో ఈ కార్లు దర్శనమిచ్చాయి. తాజాగా బాండ్ సినిమాలో ఆస్టన్ మార్టిన్ డీబీ10, జాగ్వార్ సీ-ఎక్స్75 ఉన్నాయి. ఇవి సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండవు. డీబీ 10 ధర దాదాపు 5,00,000 డాలర్ల పైగానే ఉంటుంది. ఇక జాగ్వార్ కారు 12 లక్షల డాలర్లు ఖరీదు చేస్తుంది. ఒమేగా వాచ్.. బాండ్ చేతికి ప్రారంభంలో రోలెక్స్ వాచీలు కనిపించేవి. అయితే, 1995 తర్వాత నుంచి ఆ స్థానాన్ని ఒమేగా బ్రాండ్ ఆక్రమించింది. కెసినో రాయల్ సినిమాలో ఇందుకు సంబంధించి సంభాషణ కూడా ఉంటుంది. లేటెస్ట్గా స్పెక్టర్ సినిమాలో బాండ్ వాడిన ఒమేగా వాచ్ ఖరీదు 6,000 డాలర్ల పైమాటే! టామ్ ఫోర్డ్ సూటు.. క్వాంటమ్ ఆఫ్ సొలేస్ సినిమా నుంచి జేమ్స్ బాండ్ అధికారిక టైలర్‌గా బ్రియోనీ స్థానాన్ని టామ్ ఫోర్డ్ దక్కించుకుంది. అప్పట్నుంచీ టామ్ ఫోర్డ్ సూట్లకు బాండ్.. బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. మార్టిని వోడ్కా.. వోడ్కా మార్టిని.. బాండ్ ఫేవరెట్ డ్రింక్. డైమండ్స్ ఆర్ ఫరెవర్ (1971) సినిమా నుంచి వోడ్కా మార్టినితో బాండ్‌కు అనుబంధం ఉంది. ఈ వోడ్కాను తయారు చేసే బెల్వెదర్ సంస్థ .. స్పెక్టర్ సినిమా కోసం ప్రొడ్యూసర్లతో భారీ డీల్ కుదుర్చుకుంది. అటు బీర్ తయారీ సంస్థ హైనెకెన్ కూడా సినిమాలో తమ బ్రాండ్ కనిపించేలా చూసుకునేందుకు గణనీయంగానే చెల్లించింది.