హాలీవుడ్ హాట్ బ్యూటి మోనిక బెలూసి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసింది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న బాండ్ మూవీ స్పెక్టర్ లో బాండ్ గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తున్న ఈ సీనియర్ నటి, తను బాండ్ గర్ల్ ను కాదు, బాండ్ లేడిని అంటోంది. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి తరువాత నటిగా మారిన బెలూసి వయసు ప్రస్తుతం 50 సంవత్సరాలు, అందుకే తనను బాండ్గర్ల్ అనటం కన్నా బాండ్ఉమన్ అనటమే సమంజసం అంటుంది ఈ బ్యూటి.
డానియల్ క్రెగ్ బాండ్ పాత్రలోనటిస్తున్న స్పెక్టర్ సినిమాలో జేమ్స్ బాండ్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నటిస్తుంది ఈ ఓల్డేజ్ బ్యూటి. మ్యాట్రిక్స్ సీరిస్లో నటించిన బెలూసి బాండ్ సీరిస్ లోనే పెద్ద వయసు బాండ్గర్ల్గా రికార్డ్ సొంతం చేసుకుంది. సామ్ మెన్డీస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పెక్టర్ ప్రస్థుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
బాండ్గర్ల్ కాదు బాండ్లేడి
Published Sat, Sep 19 2015 10:55 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM
Advertisement
Advertisement