ఈ జేమ్స్బాండ్ పెద్ద తాగుబోతట..!
ఇటీవలే బాండ్గా అవతారం ఎత్తిన డానియల్ క్రెగ్ మరో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకు బాండ్ క్యారెక్టర్లలో నటించిన అందరి కంటే డానియల్ క్రెగ్ తాగుబోతు బాండ్గా రికార్డ్ సృష్టించాడు. తన ప్రతి సినిమాలో 20 యూనిట్ల ఆల్కాహాల్ తీసుకుంటున్న క్రెగ్ ఈ రికార్డ్ సాధించాడు. ఇయాన్ ఫ్లెమింగ్ రాసిన పాత్రకు తగ్గట్టుగా బాండ్ క్యారెక్టర్లో కనిపించిన నటులు ఆల్కహాల్ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు.
గతంలో బాండ్ క్యారెక్టర్లలో కనిపించిన పియర్స్ బ్రోసన్ 12 యూనిట్లు, సీన్ కానరీ, రొగర్ మూర్లు 11 యూనిట్ల ఆల్కాహాల్ను సిప్ చేయగా ఒకే ఒక్క సినిమాలో బాండ్ గా కనిపించిన జార్జ్ తొమ్మిది యూనిట్ల ఆల్కాహాల్ మాత్రమే తీసుకున్నాడు. 2006లో కాసినోరాయల్ సినిమాతో తొలిసారిగా బాండ్ క్యారెక్టర్లో కనిపించిన డానియల్ క్రెగ్ తరువాత క్వాంటమ్ ఆఫ్ సోలేస్, స్కైఫాల్ సినిమాలలో కూడా 20యూనిట్లకు పైగా ఆల్కహాల్ తీసుకున్నాడు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న స్పెక్టర్ సినిమాలో కూడా ఇదే తరహాలో దర్శనమిస్తున్నాడు డానియల్ క్రెగ్.