booziest
-
నెల్లూరు: తిట్టవద్దని వారించినందుకు వ్యక్తిపై దాడి..మృతి!
-
దారుణం: తిట్టవద్దని వారించినందుకు వ్యక్తిపై దాడి..మృతి!
నెల్లూరు: జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తాగి దారిన పోయేవారిని తిట్టవద్దన్నందుకు ఓ వ్యక్తి పై మూకుమ్మడిగా దాడి చేసి, హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు ఉమ్మారెడ్డి గుంట లో మే1వ తేదీన జరిగిన దాడి లో తీవ్రగాయాల పాలైన అన్నపు రెడ్డి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఈ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికంగా ఉండే జి.దిలీప్ తప్ప తాగి దారిన పోయే స్థానికులను దూషించేవాడు. స్థానికంగా ఉండే అన్నపు రెడ్డి వెంకటేశ్వర్లు అలా తిట్టకూడదని వారించడంతో, అతనిపై దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దిలీప్, చక్రి, ప్రభు, యాలయ్య, ఆశా మురళి, కార్తీక్, ప్రకాష్ తో మరికొంత మంది కలిసి కొండాయపాలెం గేట్ పక్కనే ఉన్న అన్నపు రెడ్డి వేంకటేశ్వర్లు పై కత్తులు, రాడ్లు, కర్రలతో ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఇంట్లో మహిళలు,చిన్నపిల్లలు ఉన్నారనే విచక్షణ లేకుండా దాడికి పాల్పడ్డారు. అన్నపు రెడ్డి వేంకటేశ్వర్లునీ కత్తులతో పొడిచి,రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. అతణ్ణి స్థానిక కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 4గంటలకు మరణించాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా సెక్రటరి మాదాల వేంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. చదవండి:పనివాడే నిందితుడు -
ఈ జేమ్స్‌బాండ్ పెద్ద తాగుబోతట..!
ఇటీవలే బాండ్‌గా అవతారం ఎత్తిన డానియల్ క్రెగ్ మరో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకు బాండ్ క్యారెక్టర్లలో నటించిన అందరి కంటే డానియల్ క్రెగ్ తాగుబోతు బాండ్‌గా రికార్డ్ సృష్టించాడు. తన ప్రతి సినిమాలో 20 యూనిట్ల ఆల్కాహాల్ తీసుకుంటున్న క్రెగ్ ఈ రికార్డ్ సాధించాడు. ఇయాన్ ఫ్లెమింగ్ రాసిన పాత్రకు తగ్గట్టుగా బాండ్ క్యారెక్టర్లో కనిపించిన నటులు ఆల్కహాల్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. గతంలో బాండ్ క్యారెక్టర్లలో కనిపించిన పియర్స్ బ్రోసన్ 12 యూనిట్లు, సీన్ కానరీ, రొగర్ మూర్లు 11 యూనిట్ల ఆల్కాహాల్‌ను సిప్ చేయగా ఒకే ఒక్క సినిమాలో బాండ్ గా కనిపించిన జార్జ్ తొమ్మిది యూనిట్ల ఆల్కాహాల్ మాత్రమే తీసుకున్నాడు. 2006లో కాసినోరాయల్ సినిమాతో తొలిసారిగా బాండ్ క్యారెక్టర్లో కనిపించిన డానియల్ క్రెగ్ తరువాత క్వాంటమ్ ఆఫ్ సోలేస్, స్కైఫాల్ సినిమాలలో కూడా 20యూనిట్లకు పైగా ఆల్కహాల్ తీసుకున్నాడు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న స్పెక్టర్ సినిమాలో కూడా ఇదే తరహాలో దర్శనమిస్తున్నాడు డానియల్ క్రెగ్.