
డేనియల్ క్రేగ్
‘జేమ్స్‌బాండ్’ సిరీస్ చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ఎప్పటికీ తగ్గకపోవడం వల్లే జేమ్స్ బాండ్ సిరీస్‌లో ఇప్పటివరకు 24 చిత్రాలు వచ్చాయి. తాజాగా బాండ్ సిరీస్‌లో వస్తోన్న 25వ చిత్రం ‘నో టైమ్ టు డై’. క్యారీ జోజీ ఫుకునాగ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో డేనియల్ క్రేగ్ హీరోగా నటిస్తున్నారు. ఆస్కార్ విజేత రమీ మాలిక్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. నోమి హ్యారిస్, లియా సేడౌస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకు ఒకటికి మూడు క్లైమాక్స్‌లను చిత్రీకరించాలనుకుంటున్నారట క్యారీ జోజీ. అలా చిత్రీకరణ జరిపేలా యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేస్తున్నారట. ఏ క్లైమాక్స్‌ను ఫైనల్‌గా ఫిక్స్ చేస్తారో హీరోకి కూడా చివరివరకు చెప్పరట. సాధారణంగా ఇలా మూడు క్లైమాక్స్‌లను చిత్రీకరించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారట క్యారీ. మరి. .‘నో టైమ్ టు డై’ సినిమాలో ఫైనల్‌గా ఏ క్లైమాక్స్ ఉండబోతుందో తెలిసేది వెండితెరపైనే అన్నమాట. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment