ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన
కంజ్యూమర్ అఫైర్స్ సెక్రటరీ నిధి ఖరే
ఇప్పటికే ఆభరణాలకు హాల్‌మార్క్
న్యూఢిల్లీ: బంగారంతో చేసిన ఆభరణాలు, కళాకృతులకు ఇప్పటికే హాల్‌మార్క్ తప్పనిసరి. అయితే బంగారు కడ్డీలకూ ఇకపై హాల్‌మార్క్ తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని కంజ్యూమర్ అఫైర్స్ సెక్రటరీ నిధి ఖరే వెల్లడించారు. రత్నాలు, ఆభరణాల అంశంపై సీఐఐ నిర్వహించిన సదస్సులో శుక్రవారం ఆమె ప్రసంగించారు. ప్రజలు నాణ్యమైన, ఖచి్చతమైన ఉత్పత్తులను పొందేలా చూడటం ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
‘మార్కెట్‌లో వినియోగదారులకు ఎక్కు వ నమ్మకం, పారదర్శకతను హాల్‌మార్క్ నిర్ధారి స్తుంది. స్వర్ణకారులు వాస్తవానికి బంగారాన్ని దిగు మతి చేసుకుంటున్నప్పుడు చాలా సందర్భాల్లో వా రు పొందుతున్న, కొనుగోలు చేస్తున్న బంగారం నా ణ్యత గురించి వారికి ఖచి్చతంగా తెలియదు. కాబ ట్టి మొత్తం వ్యవస్థ ఖచి్చతత్వం కోసం, నిజా యితీ కోసం గుర్తింపు రావాలని నేను భావిస్తున్నాను’ అని వివరించారు. ప్రతిపాదన కార్యరూపంలోకి వస్తే బంగారు కడ్డీలు, బిస్కట్స్, కాయిన్స్‌కు హాల్‌మార్క్ తప్పనిసరి అవుతుంది.
రెండవ అతిపెద్ద ఎగుమతిదారు..
ప్రపంచంలో రెండవ అతిపెద్ద రత్నాభరణాల ఎగుమతిదారుగా భారత్ నిలిచింది. దేశం నుంచి జరుగుతున్న మొత్తం ఎగుమతుల్లో 3.5% వాటాను ఈ రంగం కలిగి ఉందని నిధి వివరించారు. ‘భారత ప్రభుత్వం ఈ పరిశ్రమ సామర్థ్యాన్ని గుర్తించింది. ఎగుమతులను ప్రోత్సహించడం కోసం దీనిని ప్రాధాన్య రంగాల్లో ఒకటిగా భావిస్తోంది. జెమ్స్, జువెల్లరీ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు కీలక మూలస్తంభం.
ఈ రంగం ఎగుమతులు, ఉపాధి రెండింటికీ చాలా గణనీయంగా దోహదపడుతోంది’ అని నిధి ఖరే వివరించారు. అంతర్జాతీయ మా ర్కెట్లలో భారతీయ ఆభరణాలు ప్రాచుర్యం పొందేందుకు కృషి చేయాలని పరిశ్రమకు ఈ సందర్భంగా ఉద్బోధించారు. ముడిసరుకు నాణ్యతను నిర్ధారించడానికి బంగారు కడ్డీలకు తప్పనిసరిగా హాల్ మార్క్ చేయాల్సిన అవసరం ఉందని జెమ్స్, జువెల్లరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సవ్యసాచి రే అన్నారు.
40 కోట్లకు పైగా ఆభరణాలు..
2021 జూన్ 23 నుండి ప్రారంభమైన బంగారు ఆభరణాలు, కళాఖండాల తప్పనిసరి హాల్‌మార్కింగ్ నిబంధన విజయవంతంగా అమలవుతోందని నిధి ఖరే అన్నారు. ‘40 కోట్లకు పైగా బంగారు ఆభరణాలు ప్రత్యేక హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్‌తో (హెచ్‌యుఐడీ) హాల్‌మార్క్ చేయబడ్డాయి. దేశవ్యాప్తంగా నమోదిత నగల వ్యాపారుల సంఖ్య దాదాపు 1.95 లక్షలకు చేరింది. అసేయింగ్, హాల్‌మార్కింగ్ కేంద్రాల (ఏహెచ్‌సీ) సంఖ్య 1,600కి పైగా ఉంది.
ల్యాబ్‌లో తయారైన వజ్రాలకు డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే ప్రయత్నాల్లో భాగంగా ల్యాబ్‌లో తయారైన వజ్రాల కోసం నిబంధనలను రూపొందిస్తున్నాం’ అని ఖరే చెప్పారు. భారత రత్నాలు, ఆభరణాల విపణి పరిమాణం 2023లో 44 బిలియన్ డాలర్లు ఉంది. ఇది 2030 నాటికి 134 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా అని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment