
ముంబై: ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న హాల్ మార్కింగ్ విధానం రేపటి నుంచి అమల్లోకి రానుంది. 2021 జూన్ 15 నుంచి హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణాలనే విక్రయించాల్సి ఉంటుంది. హాల్‌మార్క్ లేని బంగారం విక్రయించడం చట్టపరంగా నేరం. దీంతో బంగారం నాణ్యత విషంయలో కష్టమర్లకు మరింత భరోసా లభించనుంది,
నాణ్యతకు భరోసా
బంగారు ఆభరణాల తయారీకి సంబంధించి చిన్న పట్టణాలు, గ్రామాల్లో హాల్ మార్కింగ్ ఉండటం లేదు. దీని వల్ల ఆ ఆభరణం ఎంత నాణ్యతపై సందేహాలు తలెత్తుతున్నాయి. చాలా సందర్భాల్లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన తర్వాత తాము నష్టపోయినట్టు వినియోగదారులు చెబుతున్నారు. దీంతో బంగారం కల్తీకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం హాల్‌మార్క్ విధానం అమల్లోకి తెచ్చింది.
హాల్‌మార్క్ ఇలా
22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్ల బంగారు ఆభరణాలపై తప్పనిసరిగా హాల్ మార్క్ ఉండాలి. BIS హాల్‌మార్కింగ్ స్కీంలో ఆభరణాలకు రిజిస్ట్రేషన్ మంజూరు, మదింపు, హాల్ మార్కింగ్(A&H)కు గుర్తింపు ఉంటుంది. ఆభరణాల హాల్ మార్కింగ్ ప్రక్రియలో BIS-A&H సెంటర్‌లో నాణ్యతను తనిఖీ చేస్తారు. ఇక్కడ పరీక్షించిన అనంతరం A&H సెంటర్‌లో హాల్ మార్కింగ్ ముద్రను వేస్తారు.
చదవండి : మూడో రోజు తగ్గిన బంగారం ధరలు
Comments
Please login to add a commentAdd a comment