రోల్‌బ్యాక్ చంద్రబాబు హాల్‌మార్క్‌ | rollback in promises is chandrababu Hallmark : C.Ramachandraiah | Sakshi
Sakshi News home page

రోల్‌బ్యాక్ చంద్రబాబు హాల్‌మార్క్‌

Jun 23 2014 3:38 PM | Updated on Aug 18 2018 9:30 PM

సి.రామచంద్రయ్య - Sakshi

సి.రామచంద్రయ్య

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానాలు సుష్కవాగ్దానాలని ప్రజలకు తెలుసని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు.

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానాలు సుష్కవాగ్దానాలని ప్రజలకు తెలుసని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు. ఏపి శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ఆయన మాట్లాడారు.  రుణమాఫీ విషయంలో ఆర్‌బీఐ నియమాలు హామీ ఇచ్చే ముందు తెలియాదా? అని ఆయన ప్రశ్నించారు. 94-95లో టీడీపీ ఇచ్చిన వాగ్దానాలు అమలుకు నోచుకోని విషయం ప్రజలకు తెలుసన్నారు. వాగ్దానాల్లో రోల్‌బ్యాక్ చంద్రబాబు హాల్‌మార్క్‌గా ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రాయలసీమను దూరం చేస్తే మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాయలసీమ ప్రజలు ఉద్యమం చేస్తే ఆపడం ఎవరి తరం కాదని కూడా ఆయన అన్నారు.

రాష్ట్ర విభజనకు చంద్రబాబు లేఖ ఇచ్చారని టీడీపీ సభ్యులు మర్చిపోవద్దని సి.రామచంద్రయ్య అన్న సమయంలో ఏపీ శాసనస మండలిలో టీడీపీ, కాంగ్రెస్‌ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్ర విభజనపై ఇరు పార్టీ సభ్యుల మద్య వాడివేడి చర్చ జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement