ఆ మాట టీడీపీ వాళ్లే అంటున్నారు: సీఆర్‌ | Ramachandraiah Slams Yellow Media Propaganda Against AP Government | Sakshi
Sakshi News home page

ఎల్లో మీడియా విషం కక్కుతోంది: రామచంద్రయ్య

Published Fri, Oct 18 2019 5:35 PM | Last Updated on Fri, Oct 18 2019 8:35 PM

Ramachandraiah Slams Yellow Media Propaganda Against AP Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుచరులు జర్నలిజం ముసుగు వేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ సీ రామచంద్రయ్య విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిపైనా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. నాలుగు నెలల ప్రభుత్వంపై ఎల్లో మీడియా విషం కక్కుతోందని సీ రామచంద్రయ్య నిప్పులు చెరిగారు.

రామచంద్రయ్య శుక్రవారమిక్కడ మీడియా మాట్లాడుతూ... ‘ జర్నలిజం ముసుగు వేసుకుని ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం 18మంది ఎర్ర చందనం కూలీలను చంపేస్తే ఆ సెక్షన్‌ మీడియా మాట్లాడిందా?. గోదావరి పుష్కరాల్లో తొక‍్కిసలాట జరిగి అంతమంది చనిపోతే దానికి కారణం చంద్రబాబు అని ఆ మీడియాకు కనపడలేదా?. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వార్తలు రాశారా?. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తప్పు ఎత్తి చూపారా?. రాష్ట్రం అప్పుల్లో ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ప్రయివేట్‌ విమానాల్లో తిరుగుతూ కోట్లు ఖర్చు పెట్టారు. కాల్‌ మనీ కేసుల్లో ప్రాణాలు పోతుంటే ఎల్లో మీడియా స్పందించిందా?. రాజధాని భూముల కొనుగోలులో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగింది అప్పుడు ఆ మీడియా రాసిందా?. వారు కోరుకునే వ్యక్తి సీఎం అవడం కోసం ఎల్లో మీడియా జర్నలిజం హక్కులు మరిచిపోయింది. చంద్రబాబు రాజ్యం కోసం ఎల్లో మీడియా కృషి చేసింది.

ఒ‍క పత్రికాధిపతి వల్లే తెలుగుదేశం పార్టీ నాశనం అయింది. ఆ మాట టీడీపీ వాళ్లే అంటున్నారు. చంద్రబాబు ఓ మాఫియాను సృష్టించుకున్నారు. ఆ మాఫియా క్రియేషన్‌ కోసం ఎల్లో మీడియా ఉపయోగపడింది. హుజూర్‌ నగర్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సభ రద్దు మీద చండాలమైన వార్తలు ఎల్లో మీడియా రాసింది. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కుటుంబ విలువలు తెలియదంటూ నీచంగా రాశారు. పేపరు ఉందికదా అని ఇష్టమొచ్చిన రాతలు రాస్తారు. చంద్రబాబు కోసం, చంద్రబాబు యొక్క, చంద్రబాబు కొరకు ఆ మీడియా ఉంది’  అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement