దీపావళి అనగానే గుర్తొచ్చే ముఖ్యమైన వేడుక ధంతేరస్. ఐదు రోజుల దీపావళి పండుగకు నాంది ఈ ధనత్రయోదశి. కార్తీక మాసంలో కృష్ణ పక్షం పదమూడో రోజున జరుపుకునే ముఖ్యమైన పండుగ ధన త్రయోదశి(ధంతేరస్) ఈ ఏడాది అక్టోబర్ 29న వస్తోంది.
సాగర మథనం సమయంలో దుర్గాదేవి ,కుబేరుడు సముద్రం నుండి ఉద్భవించారని పురాణ కథ చెబుతోంది. అందుకే ఈ అందుకే త్రయోదశి నాడు ఇద్దరినీ పూజిస్తారు. అలాగే దేవతలు అసురులు "అమృతం"తో సముద్రంమీదుగా ప్రయాణిస్తున్నప్పుడు, ధన్వంతరి భగవానుడు ఉద్భవించాడట. అందుకే ఈ పండుగను ధనత్రయోదశి , ధన్వంతరి త్రయోదశి అని కూడా అంటారు.
అలాగే సంపద , శ్రేయస్సును సూచించే లక్ష్మీ దేవిని, కుబేరుడిని భక్తితో పూజిస్తారు. ఎంతో శుభప్రదమైన ఈ రోజున ఒక గ్రాము అయినా బంగారం లేదా విలువైన వస్తువలను, కొనుగోలు చేయడం అదృష్టంగా భావిస్తారు. అలాగే కొత్త పెట్టుబడులు లాభాలను ప్రసాదిస్తాయని నమ్మకం. స్టాక్‌మార్కెట్లో కూడా దీపావళి రోజు ముహూరత్ ట్రేడింగ్ పేరుతో ప్రత్యేక ట్రేడింగ్ కూడా ఉంటుంది.
సాధారణంగా బంగారం, వెండి నగలను కొనుగోలు చేయడంతోపాటు ఈ రోజు కొత ఇల్లు, కొత్త కారు, టీవీ తదితరఎలక్ట్రానిక్ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం శుభప్రదంగా భావిస్తున్నారు. ఈ క్రేజ్‌ను సొంతం చేసుకునేందుకు అనేక ఆఫర్లు, బంపర్ ఆఫర్లు అంటూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు ఇబ్బడిముబ్బడిగా ఉంటాయి. అసలే బంగార ధర కొండెక్కి కూర్చున్న నేపథ్యంలో బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు సమయంలో తీసుకోవల్సిన కనీసం జాగ్రత్తల గురించి తెలుసుకుందాం!
బంగారం స్వచ్ఛత
బంగారం స్వచ్ఛతను నిర్ధారించుకోవాలి. సాధారణంగా 18 క్యారట్లు, 22 క్యారట్లు, 24 క్యారట్ల బంగారం అందుబాటులో ఉంటుంది.
హాల్ మార్క్
నమ్మకమైన దుకాణదారుని వద్ద మాత్రమే బంగారు, డైమండ్ ఆభరణాలను కొనుగోలు చేయడం ఉత్తమం. బంగారు ఆభరణాలు కొనుగోలులో అతి కీలకమైంది హాల్ మార్క్. బంగారు నాణ్యతకు ప్రామాణికమైన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) హాల్‌మార్క్‌ను ప్రభుత్వం మాండేటరీ చేసినప్పటికీ, మన నగలపై హాల్ మార్క్ ఉందో లేదో కచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఆభరణాల లోపలి వైపు ఉండే బీఐఎస్ సర్టిఫికేషన్ మీదే నగల విలువ ఆధారపడి ఉంటుంది.( Dhanteras 2024 : వెండి, బంగారమేనా? ఇలా చేసినా ఐశ్వర్యమేనట!)
తూకానికి సంబంధించి బంగారం, గ్రాములు. మిల్లీ గ్రాములు లెక్కను సరిగ్గా చూసుకోవాలి. లేదంటే, ఆదమరిచి ఉంటే, మోసపోయే, డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. ఆ రోజు మార్కెట్లో ధరను పరిశీలించాలి. తరుగు, మజూరీ చార్జీలను కూడా కూడా ఒక కంట గమనించాలి. డైమండ్‌నగల విషయంలో అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment