Hallmarking
-
మరిన్ని జిల్లాల్లో ‘తప్పనిసరి హాల్‌మార్కింగ్’
బంగారు ఉత్పత్తులకు అందించే హాల్‌మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీ)ను మరో 18 జిల్లాల్లో ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానంతో 40 కోట్లకు పైగా బంగారు ఆభరణాలు, వస్తువులు ఈ గుర్తింపు పొందాయి. ఇది మార్కెట్లో బంగారు ఉత్పత్తులకు సంబంధించి వినియోగదారుల విశ్వాసాన్ని, ఉత్పత్తుల పారదర్శకతను పెంపొందిస్తుందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.‘గోల్డ్ జువెల్లరీ అండ్ గోల్డ్ ఆర్ట్ఫ్యాక్ట్స్ ఎమెండమెంట్ ఆర్డర్-2024’ ప్రకారం బంగారు ఉత్పత్తులపై తప్పనిసరి హాల్‌మార్కింగ్ ఉండాలి. అందులో భాగంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఆధ్వర్యంలో నవంబర్ 5, 2024 నుంచి హెచ్యూఐటీ నాలుగో దశను ప్రారంభించింది. ఇందులో అదనంగా 18 జిల్లాలను చేర్చారు. అందుకోసం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా హాల్‌మార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొత్తగా చేరిన జిల్లాలతో కలిపి తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానం అమలులో ఉన్న జిల్లాల సంఖ్య 361కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్, బిహార్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని జిల్లాల్లో తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానం అమల్లోకి వచ్చినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.ఇదీ చదవండి: 17,000 మంది ఉద్యోగుల తొలగింపు!తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానం ప్రారంభమైన జూన్ 23, 2021 నుంచి నమోదిత నగల వ్యాపారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ విధానం అమలు ప్రారంభంలో వీరి సంఖ్య 34,647గా ఉండేది. ప్రస్తుతం అది దాదాపు ఐదురెట్లు పెరిగి 1,94,039కు చేరింది. హాల్‌మార్కింగ్ కేంద్రాల సంఖ్య 945 నుంచి 1,622కి పెరిగింది. -
తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొంటున్నారా? ఈ జిల్లాల్లో అమలులోకి కొత్త రూల్స్
బంగారు నగల హాల్‌మార్కింగ్‌కు సంబంధించిన మూడో దశను కేంద్ర ప్రభుత్వం తాజగా ప్రకటించింది. రెండేళ్ల క్రితం గోల్డ్ హాల్‌మార్కింగ్ (Gold Hallmarking) నిబంధనల్ని ప్రకటించిన కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా జిల్లాలవారీగా దశలవారీగా అమలు చేస్తూ వస్తోంది. ఇప్పటికి రెండు దశలను అమలు చేసిన ప్రభుత్వం తాజాగా మూడో దశలో 16 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 55 కొత్త జిల్లాల్లో హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం, బంగారు ఆభరణాల స్వచ్ఛత ధ్రువీకరణ ప్రమాణం. 2021 జూన్ 16 వరకు ఇది స్వచ్చందంగా ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వం దశలవారీగా గోల్డ్ హాల్‌మార్కింగ్‌ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోడల్ ఏజెన్సీగా బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (BIS) వ్యవహరిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 343 జిల్లాల్లో గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి. 2021 జూన్ 23న ప్రారంభించిన మొదటి దశలో 256 జిల్లాలు, 2022 ఏప్రిల్ 4 నుంచి రెండవ దశలో మరో 32 జిల్లాల్లో హాల్ మార్కింగ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక మూడో దశలో సెప్టెంబర్ 8వ తేదీ నుంచి కొత్తగా మరో 55 జిల్లాల్లో హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ న నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలు ఇవే.. కేంద్రప్రభుత్వం మూడో దశలో ప్రకటించిన హాల్‌మార్కింగ్ తప్పనిసరి జిల్లాల జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో 9 జిల్లాలు ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో అన్నమయ్య, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలు ఉండగా తెలంగాణలో మేడ్చల్ మల్కాజ్గిరి, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో బంగారు నగలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి. హాల్‌మార్క్ అంటే ఏమిటి? బంగారు నగల స్వచ్ఛతను తెలియజేసే ముద్రనే హాల్‌మార్క్ అంటారు. ఈ హాల్‌మార్కింగ్‌లో మొదట బిస్ లోగో, బంగారం స్వచ్ఛత, వ్యాపారి లోగో, అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్ వివరాలు ఉండేవి. కానీ 2023 ఏప్రిల్ 1 నుంచి కొత్త HUID హాల్‌మార్కింగ్ వచ్చింది. ఇందులో మూడు అంశాలు ఉంటాయి. అవి BIS లోగో, ఆభరణం స్వచ్ఛత, ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID. ఒక్కో ఆభరణానికి ఒక్కో రకమైన విశిష్ట సంఖ్య ఉంటుంది. -
జోస్ ఆలుక్కాస్.. హెచ్‌యూఐడీ ‘ఫెస్ట్’
హైదరాబాద్: దక్షిణ భారత్‌లో ప్రముఖ జ్యువెల్లరీ గ్రూప్‌ల్లో ఒకటైన జోస్ ఆలుక్కాస్, హెచ్‌యూఐడీ హాల్‌మార్కింగ్ అమలును వేగవంతం చేయడానికి తనవంతు సహకారాన్ని అందిస్తోంది. ఇందుకు హెచ్‌యూఐడీ ఎక్స్ఛేంజ్ ఫెస్ట్ సహా పలు కార్యక్రమాలను ప్రారంభించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇదీ చదవండి: Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్‌ఫ్రెండ్‌తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్ బీఐఎస్-916 హాల్‌మార్క్ కలిగిన ఆభరణాలను ప్రవేశపెట్టి, విక్రయించిన మొదటి జ్యువెల్లరీ గ్రూప్‌గా నిలిచిన సంస్థ, ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ (హెచ్‌యూఐడీ)తో తన బంగారు నిల్వల్లో మొత్తం 100 శాతాన్ని హాల్‌మార్క్ చేసినట్లు పేర్కొంది. (రిలయన్స్ షాక్: ఉద్యోగాలు ఫట్; రానున్న కాలంలో వేలాది కోతలు!) మరిన్ని వార్తలకోసం చదవండి: సాక్షి బిజినెస్ -
బంగారం కొనేవారికి అలర్ట్: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..
దేశంలో బంగారు ఆభరణాలు, నాణేల కొనుగోలుకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలు, ఇతర బంగారు వస్తువులపై ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్- హెచ్‌యూఐడీ (HUID)ని తప్పనిసరి చేసింది. దీని ప్రకారం.. ఈ హెచ్‌యూఐడీ ఉన్న బంగారు ఆభరణాలనే కొనాలి లేదా అమ్మాలి. (ఐఫోన్లకు కొత్త అప్డేట్.. నయా ఫీచర్స్ భలే ఉన్నాయి!) భారతదేశంలో బంగారు ఆభరణాలను అలంకరణ కోసమే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా కొనుగోలు చేస్తుంటారు. చాలా వరకు బంగారాన్ని ఆభరణాలు లేదా నాణేల రూపంలో కొనుగోలు చేస్తారు. వీటికి ఇప్పటి వరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) లోగో, బంగారం స్వచ్ఛత, వ్యాపారి లోగో, అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్ వివరాలతో కూడిన హాల్‌మార్కింగ్ ఉండేది. హాల్‌మార్కింగ్ గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధ్రువీకరిస్తూ ఇచ్చే గుర్తింపు. ఇది 2021 జూన్ 16 వరకు స్వచ్ఛందంగా ఉండేది. అంటే తప్పనిసరి కాదు. ఆ తర్వాత 2021 జూలై 1 నుంచి ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్- హెచ్‌యూఐడీ (HUID)ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాత హాల్‌మార్కింగ్‌లో నాలుగు అంశాలు ఉండేవి. అవి BIS లోగో, ఆభరణం స్వచ్ఛత, నగల వ్యాపారికి సంబంధించిన లోగో, అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్. HUID హాల్‌మార్కింగ్‌లో మూడు అంశాలు ఉంటాయి. అవి BIS లోగో, ఆభరణం స్వచ్ఛత, ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID. ఒక్కో ఆభరణానికి ఒక్కో రకమైన విశిష్ట సంఖ్య ఉంటుంది. (ఆ మందులు వాడే వారికి ఊరట.. దిగుమతి సుంకం మినహాయింపు) పాత బంగారంపై ఆందోళన వద్దు అయితే తమ వద్ద పాత బంగారు ఆభరణాల సంగతేంటని వినియోగదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వినియోగదారుల వద్ద ఇప్పటికే ఉన్న పాత హాల్‌మార్కింగ్ ఆభరణాలు కూడా చెల్లుబాటు అవుతాయని కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. స్వచ్ఛతలో తేడా ఉంటే రెండు రెట్ల పరిహారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రూల్స్ 2018లోని సెక్షన్ 49 ప్రకారం... వినియోగదారు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలపై ముద్రించిన హాల్‌మార్క్‌లో ఉన్న దానికంటే తక్కువ స్వచ్ఛత ఉన్నట్లు తేలితే కొనుగోలుదారు రెండు రెట్ల పరిహారం పొందవచ్చు. -
ఆ నిబంధన తొలగించండి: బంగారు వర్తకుల నిరసన
కొత్త నిబంధనతో తీరని కష్టం.. కొనుగోలు.. అమ్మకాలను పట్టించుకోరా? కనకం.. విక్రయాలకు హాల్‌మార్క్ శాపం.. బంగారు వ్యాపారం.. తీరని భారం.. అంటూ.. బంగారు వ్యాపారులు నినాదాలతో హోరెత్తించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హాల్‌మార్క్ నిబంధనను వ్యతిరేకిస్తూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: హాల్‌మార్క్ విధానంతో తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటాయని బంగారు వర్తకులు, దుకాణ యజమానులు వాపోయారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నగల దుకాణాలను మూసివేసి కేంద్ర తీరుపై నిరసన వ్యక్తం చేశారు. దుకాణాల ద్వారా అమ్మకాలు సాగించే బంగారు నగలపై వాటి నాణ్యతను నిర్ధారించే ‘హాల్‌మార్క్’ ముద్రను విధిగా వేయాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) తేల్చి చెప్పింది. ఈమేరకు కొత్తగా నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అయితే ఈ విధానాన్ని బంగారు నగల వర్తకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హాల్‌మార్క్ నిబంధన బంగారు నగల అమ్మకాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది, ధరలు పెరగడంతో పాటు.. నగల దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారని అంటున్నారు. అంతేగాక కొనుగోలుదారులు తమ వ్యక్తిగత వివరాలు తెలపాల్సి రావడం వల్ల భద్రతాపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయని వాదిస్తున్నారు. ఏ మేరకు, ఎంత ఖరీదైన నగలు కొంటున్నారో వివరాలు తెలపాల్సి రావడం ప్రజల వ్యక్తిగత సమాచార భద్రత హక్కును హరించడమే అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ హాల్‌మార్క్ విధానాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ చెన్నైలోని 7వేలు సహా.. రాష్ట్రవ్యాప్తంగా 35 వేల బంగారు నగల దుకాణాలను ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు మూసివేశారు. చెన్నై టీనగర్, పురసైవాక్కం, ప్యారిస్ కార్నర్, రాధాకృష్ణన్రోడ్డు తదితర ప్రాంతాల్లో బంగారు నగల వ్యాపారస్తులు ప్లకార్డులు చేతబూని మానవహారం చేపట్టారు. అలాగే తిరుచ్చిరాపల్లె, మధురై, తిరునెల్వేలి, సేలం, ఈరోడ్, కోయంబత్తూరు తదితర నగరాల్లో సైతం బంగారు నగల దుకాణాలు మూసివేసి కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని తమిళనాడు బంగారు నగల దుకాణాల యజమానుల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. చెన్నై బంగారు నగల వర్తకుల సంఘం అధ్యక్షుడు ఉదయ్ ఉమ్మడి మీడియాతో మాట్లాడుతూ, అరుదైన రకాలకు హాల్‌మార్క్ ముద్ర పొందడం మన దేశానికి సంబంధించి వినియోగదారుల అభీష్టంగా కొనసాగుతూ వస్తోందని అన్నారు. అయితే దీనిని ఇకపై అన్ని రాష్ట్రాల్లో విధిగా పాటించాలని బీఐఎస్ పేర్కొనడం సమంజసం కాదన్నారు. తమిళనాడులో హాల్‌మార్క్ ముద్రకు సంబంధించి సరైన వసతులు లేనందున 16 నుంచి 18 కోట్ల సంఖ్యలో బంగారు నగలు విక్రయానికి నోచుకోక మూలపడి ఉన్నాయని.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న హాల్‌మార్క్ సంస్థ రోజుకు రెండు లక్షల నగలకు మాత్రమే ముద్ర వేసే సామర్థ్యం కలిగి ఉందని వెల్లడించారు. దీనివల్ల సుమారు మూడేళ్లకు అవసరమైన బంగారు నగలు అమ్మకాలకు నోచుకోక నిలిచిపోయే పరిస్థితి దాపురిస్తుందని వాపోయారు. మూడు నాలునాగేళ్ల తరువాత హాల్‌మార్క్ ముద్రతో కూడిన బంగారు నగలు విఫణివీధిలోకి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే అనే క సమస్యలను ఎదుర్కొంటున్న బంగారు నగల వర్తకులపై హాల్‌మార్క్ విధానం ఒక పిడుగుపాటు లాంటిదని ఆయన అభివర్ణించారు. ఈ విధానం వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతింటారని ఆయన వాపోయారు. చదవండి: బంగాళాఖాతంలో భూకంపం..చెన్నైలో భూప్రకంపనలు -
ఆగస్టు 23న జువెలరీ వ్యాపారుల సమ్మె
కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం బంగారు నగలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్ "ఏకపక్షంగా అమలు" చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 23న దేశవ్యాప్తంగా ఉన్న జువెలరీ వ్యాపారులు 'సమ్మె'కు దిగనున్నట్లు ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యూయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజెసి) నేడు తెలిపింది. ఈ సమ్మెకు జేమ్స్ & జువెలరీ పరిశ్రమలోని నాలుగు జోన్లకు చెందిన 350 సంఘాలు మద్దతు ఇచ్చినట్లు జీజెసీ పేర్కొంది.(చదవండి: అదిరిపోయే టెక్నాలజీని ఆవిష్కరించిన ఫేస్బుక్!) జూన్ 16 నుంచి దశలవారీగా బంగారు నగలపై హాల్‌మార్క్ తప్పనిసరి చేస్తూ కేంద్రం వచ్చింది. ఫేజ్-1 కింద 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 256 జిల్లాలో హాల్‌మార్క్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం పేర్కొంది. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే ఒక లోగో. హాల్‌మార్కింగ్ ఇవ్వడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) కొన్ని ప్రమాణాలు పెట్టింది. ఈ ప్రమాణాలను ప్రతి వ్యాపారి పాటించాల్సి ఉంటుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారుడు మోసపోవద్దని కేంద్రం బంగారు నగలపై హాల్‌మార్క్ తప్పనిసరి చేసింది. -
24 జిల్లాలతో మొదటిస్థానంలో తమిళనాడు
న్యూఢిల్లీ: పసిడి ఆభరణాలు, కళాఖండాలకు తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ అమలు జరుగుతున్న దేశంలోని మొత్తం 256 జిల్లాల్లో 24 జిల్లాలతో తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. వరుసలో తరువాత గుజరాత్ (23 జిల్లాలు) మహారాష్ట్ర (22 జిల్లాలు) ఉన్నాయి. 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 256 జిల్లాలను హాల్ మార్కింగ్‌కు ఎంపిక జరిగింది. జూన్ 16 నుంచి తొలి దశ అమలు ప్రారంభమైంది. పసిడి స్వచ్ఛతకు సంబంధించి గోల్డ్ హాల్ మార్కింగ్ విధానం ఇప్పటి వరకూ స్వచ్చందంగా అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి వినియోగ మంత్రిత్వశాఖ ఈ మేరకు విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌ల్లో 19 జిల్లాల చొప్పున హాల్ మార్కింగ్ అమలవుతోంది. ► ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌లలో పన్నెండు చొప్పున మొత్తం 24 జిల్లాల్లో ఈ విధానం అమలు. ► కేరళ (13 జిల్లాల్లో), కర్ణాటక (14 జిల్లాల్లో), హర్యానా (15 జిల్లాల్లో) అమల్లోకి వచ్చింది. ► ఢిల్లీ, తెలంగాణాల్లో ఏడు జిల్లాల్లో అమలు. ► ఆయా జిల్లాల్లోని వర్తకులు హాల్‌మార్కింగ్‌తో 14, 18, 22 క్యారెట్ల పసిడి ఆభరణాలనే విక్రయిస్తున్నారు. ► విజ్ఞప్తులు, విస్తృత స్థాయి సంప్రతింపుల నేపథ్యంలో కొన్ని వర్గాలను మాత్రం హాల్ మార్కింగ్ నుంచి కేంద్రం మినహాయించింది. ఉదాహరణకు రూ.40 లక్షలలోపు టర్నోవర్ ఉన్న వర్తకులు ఈ పరిధిలోకి రారు. ప్రభుత్వ వాణిజ్య విధానం ప్రకారం ఆభరణాల ప్రదర్శనలకు సంబంధించి ఎగుమతి, ఎగుమతులకూ ఈ నిబంధన వర్తించదు. ► నిజానికి 2000 ఏప్రిల్ నుంచీ పసిడి ఆభరణాలకు హాల్ మార్కింగ్ స్కీమ్‌ను బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియాన్ స్టాండెర్డ్స్) అమలు చేస్తోంది. పసిడి ఆభరాల్లో దాదాపు 40 శాతానికి మాత్రమే ప్రస్తుతం హాల్‌మార్కింగ్ అమలు జరుగుతోంది. ► భారత్‌లో మొత్తం నాలుగు లక్షల మంది ఆభరణాల వర్తకులు ఉన ఉన్నారు. వీరిలో కేవలం 35,879కి మాత్రమే బీఐఎస్ సర్టిఫై చేసినవారు. ► భారత్ దేశంలోకి సగటున 700 నుంచి 800 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది. ► అయితే కరోనా సవాళ్ల నేపథ్యంలో మార్చితో ముగిసిన 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి పసిడి దిగుమతులు పరిమాణంలో 2019–20తో పోల్చితే 12 శాతం పడిపోయి 633 టన్నులుగా నమోదయ్యింది. అయితే విలు వ రూపంలో చూస్తే, డిమాండ్ భారీగా 22.58 శాతం పెరిగింది. అంటే 2019–20తో పోల్చి 2020–21 విలువలో పసిడి దిగుమతుల విలువ 28.23 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు) నుంచి 34.6 బిలియన్ డాలర్ల (దాదాపు 2.54 లక్షల కోట్లు)కు చేరాయి. ► ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో బంగారం దిగుమతులు భారీగా పెరిగి 6.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దేశీయ కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.51,439 కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో బంగారం దిగుమతులు భారీగా క్షీణించి 79.14 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. విలువలో ఇది కేవలం 599 కోట్లు. ► పసిడి దిగుమతులు భారీగా పెరగడం దేశ ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం– వాణిజ్యలోటు పెరగడానికి దారితీయడం గమనార్హం. ఏప్రిల్, మేలలో ఈ వాణిజ్యలోటు 9.91 బిలియన్ డాలర్ల (2020 ఇదే నెలలతో పోల్చి) నుంచి 21.31 బిలియన్ డాలర్లకు చేరింది. -
జూన్ నుంచి గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలు, కళాఖండాలపై 2021 జూన్ 1 నుంచీ హాల్‌మార్కింగ్ తప్పనిసరి అని కేంద్రం మంగళవారం స్పష్టం చేసింది. విలువైన మెటల్‌కు సంబంధించి ప్యూరిటీ సర్టిఫికేషన్ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉందని వెర్చువల్‌గా జరిగిన ఒక విలేకరుల సమావేశంలో వినియోగ వ్యవహారాల కార్యదర్శి లీనా నందన్ పేర్కొన్నారు. 2019 నవంబర్‌లో కేంద్రం చేసిన ప్రకటన ప్రకారం, పసిడి ఆభరణాలు, కళాఖండాలపై 2021 జనవరి 15 నుంచీ హాల్‌మార్కింగ్ తప్పనిసరి. హాల్‌మార్కింగ్ విధానంలోకి మారడానికి, ఇందుకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండెర్డ్స్ (బీఐఎస్)తో తమకుతాము రిజిస్ట్రర్ కావడానికి ఆభరణాల వర్తకులకు ఏడాదికి పైగా సమయం ఇచ్చింది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో హాల్‌మార్కింగ్ విధానం అమలుకు వర్తకులు చేసిన విజ్ఞప్తి చేశారు. -
అన్ని ఆభరణాలకూ హాల్‌మార్క్ అమలయ్యేనా?
సాక్షి, న్యూఢిల్లీ: వినియోగదారులు కొనుగోలు చేసే బంగారు ఆభరణాలకు ‘స్వచ్ఛత’ భరోసాను ‘హాల్‌మార్క్’ రూపంలో అందించాలన్న సంకల్పంతో.. అన్ని ఆభరణాలను హాల్‌మార్క్‌తోనే విక్రయించాలన్న ఆదేశాలను కేంద్రం తీసుకురాగా.. వర్తకులు ఈ విషయంలో అంత సముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే కేంద్రం ఈ గడువును పెంచినప్పటికీ.. 3లక్షలకు పైగా ఉన్న జ్యుయలర్స్‌లో హాల్‌మార్క్‌ను తప్పనిసరిగా ఆచరణలో పెట్టిన వారు 10 శాతాన్ని మించలేదు. 2021 జనవరి 15గా ఉన్న గడువును కరోనా కారణంగా కేంద్రం ఈ ఏడాది జూన్ 1 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రానున్న పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా కేవలం హాల్‌మార్క్ ఆభరణాలనే కొనుగోలు చేసుకునే వెసులుబాటు దేశ ప్రజల్లో అందరికీ లభించకపోవచ్చు. ఎందుకంటే ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వివాహాలకు ఎక్కువ సుముహూర్తాలున్నాయి. ఒక్క మే నెలలోనే 15 రోజులు వివాహాలకు అనుకూలంగా ఉంది. కరోనా కారణంగా గతేడాది వివాహాలను వాయిదా వేసుకున్న వారు కూడా ఈ ఏడాది మంచి ముహూర్తాల్లో ఇంటి వారయ్యేందుకు సుముఖంగా ఉన్నారు. దీంతో ఆభరణాల కొనుగోళ్లు రానున్న సీజన్లో భారీగా నమోదు కావచ్చని పరిశ్రమ వర్గాల అంచనాగా ఉంది. వర్తకులు చెప్పే కారణాలు.. ‘‘కరోనా మహమ్మారి కారణంగా 2020లో విక్రయాలు పెద్దగా నమోదు కాలేదు. ఆభరణాల నిల్వలు చాలా వరకు అట్టే ఉన్నాయి. ఈ స్థితిలో తప్పనిసరి హాల్‌మార్క్ విధానంలోకి అడుగుపెడితే మా వద్దనున్న ఆభరణాలన్నింటినీ కరిగించి.. తిరిగి నిబంధనల మేరకు ఆభరణాలను రూపొందించి స్వచ్ఛత, హాల్‌మార్క్ ధ్రువీకరణ కోసం పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో తయారీ చార్జీలను నష్టపోవాల్సి వస్తుంది’’ అన్నది ఆభరణాల వర్తకుల అభిప్రాయం. ‘‘ఇతర ఉత్పత్తుల మాదిరిగా ఆభరణాలు వేగంగా విక్రయమయ్యేవి కావు. ఎందుకంటే వీటి ధరలు ఖరీదుగా ఉంటాయి. అందుకనే కొందరి వర్తకుల వద్ద నాలుగు, ఐదేళ్ల క్రితం నాటి స్టాక్స్ (నిల్వలు) కూడా ఉన్నాయి. వీరు కనుక హాల్‌మార్క్ కిందకు రావాల్సి వస్తే వారివద్దనున్న ఆభరణాలను కరిగించాల్సి వస్తుంది. దీనివల్ల తయారీ చార్జీలను నష్టపోవాల్సి వస్తుంది. జ్యుయలర్స్ తమ వద్దనున్న నిల్వలను విక్రయించుకుని, హాల్‌మార్క్‌ను ఎంచుకునేందుకు గాను ఈ ఏడాది వరకు గడువు కావాలి. అదే విధంగా హాల్ మార్కింగ్, స్వచ్ఛత ధ్రువీకరణ కేంద్రాలు దేశవ్యాప్తంగా అందుబాటులో లేవు. దీంతో హాల్‌మార్క్ కోసం వర్తకులు కొంత దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది’’ అని అఖిల భారత జెమ్స్ అండ్ జ్యుయలరీ దేశీయ మండలి చైర్మన్ ఆశిష్ పెతే చెప్పారు. గడువు మళ్లీ పొడిగించక తప్పదేమో.. కేంద్రం తీసుకొచి్చన నిబంధనల కింద.. వచ్చే జూన్ 1 నుంచి హాల్‌మార్క్ లేని 14, 18, 22 క్యారెట్ల బంగారం ఆభరణాలను నిబంధనల ప్రకారం వర్తకులు విక్రయించడం కుదరదు. ఇది చిన్న వర్తకులపై భారం మోపుతుందని, రిటైల్ చైన్స్‌ను నిర్వహించే పెద్ద సంస్థలకు లాభం చేకూరుస్తుందన్న అభిప్రాయం పరిశ్రమ నుంచి వినిపిస్తోంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఆభరణాల వర్తకులు జూన్ నాటికి నిబంధనల పరిధిలోకి రావడం కష్టమేనంటున్నారు. వీటికి హాల్ మార్కింగ్.. 14 క్యారట్లు, 18 క్యారట్లు, 22 క్యారట్ల ఆభరణాలకు హాల్‌మార్క్ తప్పనిసరిగా ఉండాలన్నది కేంద్రం విధానం. మహారాష్ట్రలో అయితే వధువులకు 23, 24 క్యారట్ల స్వచ్ఛత కలిగిన ఆభరణాలను ఇస్తుంటారు. దీంతో అక్కడ ఇప్పటి మాదిరే హాల్‌మార్క్ లేని నగలనే కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. 23, 24 క్యారట్ల ఆభరణాలనూ హాల్‌మార్క్ పరిధిలోకి తీసుకురావాలని తాము కేంద్రాన్ని కోరినట్టు పెతే చెప్పారు. అలా చేయడం వల్ల ఆభరణాలను కొనుగోలు విషయంలో వినియోగదారులు మోసపోకుండా చూడొచ్చని పేర్కొన్నారు. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) వెబ్సైట్ ప్రకారం.. హాల్‌మార్క్ కోసం ప్రతీ ఆరి్టకల్‌కు రూ.35ను చెల్లించాల్సి ఉంటుంది. ‘‘దేశంలో ఏటా వినియోగమవుతున్న 1,000 టన్నుల బంగారంలో 400 కిలోల బంగారమే హాల్‌మార్క్‌తో ఉంటోంది. కనుక ప్రభుత్వం వినియోగదారులతోపాటు, జ్యుయలర్స్లోనూ తప్పనిసరి హాల్‌మార్క్‌పై అవగాహన కలి్పంచాలి’’ అని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ హాల్‌మార్కింగ్ సెంటర్స్ మాజీ ప్రెసిడెంట్ హర్షద్ అజ్మీరా పేర్కొన్నారు. అవగాహన కల్పించాలి! బీఐఎస్ హాల్‌మార్కింగ్ ఒక్కసారి తప్పనిసరిగా అమల్లోకి వస్తే కస్టమర్లు హాల్‌మార్క్ లేని వినియోగించిన ఆభరణాలను విక్రయించడం కష్టమవుతుంది. కనుక ప్రభుత్వం, జ్యుయలరీ వాణిజ్య సంఘాలు, ఇతర భాగస్వాములు ఈ విషయంలో కలసికట్టుగా ముందుకు వచి్చ, హాల్‌మార్క్ ఆభరణాలనే కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. భారత్‌తోపాటు, విదేశాల్లో విక్రయించే ఆభరణాలకు సంబంధించి హాల్‌మార్కింగ్ కోసం మేము ఏటా రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నాం. –అహ్మద్ ఎంపీ, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ -
బంగారు నగలకు... హాల్‌మార్కింగ్ తప్పనిసరి!!
ముంబై: బంగారు ఆభరణాల నాణ్యతను ధృవీకరించే హాల్‌మార్కింగ్ నిబంధనలను సత్వరం అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) రూపొందించిన మార్గదర్శకాలకు కేంద్ర న్యాయ శాఖ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఇది వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్దకు ఈ ప్రతిపాదన చేరింది. బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేస్తామంటూ వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు సత్వరం ఆమోదం లభిస్తుందని, త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముసాయిదా నిబంధనల ప్రకారం మొత్తం మూడు రకాల బంగారు ఆభరణాల (22, 18, 14 క్యారట్)కు హాల్‌మార్కింగ్ తప్పనిసరి కానుంది. సమగ్ర పసిడి విధానంలో భాగంగా ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయాలంటూ గత నెల కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించిన నివేదికలో నీతి ఆయోగ్ కమిటీ సిఫార్సు చేసింది. సులభతరంగా వ్యాపారాల నిర్వహణకు సమస్యలు తలెత్తకుండా దీన్ని అమలు చేసే మార్గాన్ని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపాదిత పసిడి విధానంలో మిగతా అంశాల సంగతి ఎలా ఉన్నా ముందుగా హాల్‌మార్కింగ్ అంశాన్ని అమల్లోకి తేవడంపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గా లు తెలిపాయి. నోటిఫికేషన్ అమల్లోకి వచ్చాక.. హాల్‌మార్కింగ్ లేని ఆభరణాలను విక్రయించుకుని, క్లియర్ చేసుకునేందుకు జ్యుయలర్స్‌కి సుమారు 6 నెలల వ్యవధి దొరకవచ్చని పేర్కొన్నాయి. ఆన్లైన్లో అనుమతులపై దృష్టి.. హాల్‌మార్కింగ్‌ను సత్వరం అమల్లోకి తెచ్చే దిశగా .. దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను కూడా వేగవంతం చేయడంపై బీఐఎస్ దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ఆన్లైన్లోనే జ్యుయలర్స్‌కి లైసెన్సు జారీ చేసే ప్రక్రియను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ప్రతిపాదన ప్రకారం ముందుగా.. 22 ప్రధాన నగరాల్లో తప్పనిసరి హాల్‌మార్కింగ్ నిబంధనను అమల్లోకి తేనున్నారు. ఆ తర్వాత రాష్ట్రాల రాజధానులు, తర్వాత జిల్లాల హెడ్‌క్వార్టర్స్‌లోనూ అమలు చేస్తారు. 566 హాల్‌మార్క్ సెంటర్స్..: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 566 హాల్‌మార్కింగ్ సెంటర్స్ ఉన్నట్లు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ హాల్‌మార్కింగ్ సెంటర్స్ ప్రెసిడెంట్ హర్షద్ అజ్మీరా తెలిపారు. ఇవన్నీ ప్రస్తుతం సగటున ఇరవై శాతం సామర్ధ్యంతో పనిచేస్తున్నాయన్నారు. ఒకవేళ హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసిన పక్షంలో పెరిగే పనిభారాన్ని తట్టుకోవడం కష్టమేమీ కాబోదన్నారు. హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసే యోచన నేపథ్యంలో కొత్త హాల్‌మార్క్ సెంటర్స్ ఏర్పాటుకు సంబంధించి మరో 100 పైచిలుకు దరఖాస్తులు బీఐఎస్ పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం జ్యుయలర్స్ బీఐఎస్ నుంచి తప్పనిసరిగా లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, మొత్తం ఆభరణాల విక్రేతల్లో పది శాతం కన్నా తక్కువ .. సుమారు 25,000 జ్యుయలర్స్ మాత్రమే లైసెన్సు తీసుకున్నట్లు సమాచారం. దాదాపు 3,00,000 పైచిలుకు జ్యుయలర్స్ ఉన్నారని అంచనా. మరోవైపు పది బులియన్ రిఫైనరీలు కూడా లైసెన్సు తీసుకున్నాయి. -
బంగారం హాల్‌మార్క్: సియాట్ కీలక సూచన
-
బంగారం హాల్‌మార్క్: సియాట్ కీలక సూచన
సాక్షి, ముంబై: బంగారం ఆభరణాలపై హాల్‌మార్కింగ్ మాండేటరీ అంశంపై కాన్ఫెడరేషన్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటి) కీలక సూచన చేసింది. బంగారం నాణ్యత ప్రమాణా సూచిక హాల్‌మార్క్‌పై నుంచి 20 కారట్ల బంగారం ఆభరణాల మినహాయింపును తొలగించాలని కోరుతోంది. ఈ మేరకు కేంద్ర మంత్రిని రాం విలాస్పాశ్వాన్కు సియాట్ ఒక లేఖ రాసింది. హాల్ మార్క్ ప్రమాణాల కేటగిరీలో 20 కారట్ల బంగారు ఆభరణాలను కూడా చేర్చాలని కోరుతూ వినియోగదారుల వ్యవహారాల మంత్రికి సిఎఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్ వాల్ లేఖ రాశారు. తద్వారా వినియోగదారులకు సరసమైన ధరల్లో బంగారు ఆభరణాలను అందించే అవకాశం వర్తకులకు లభిస్తుందని పేర్కొన్నారు. 14, 18 , 22 కారెట్ల నాణ్యతా ప్రమాణాలకు కేంద్రం అంగీకరించింది. ఈనేపథ్యంలో 83.3 శాతం స్వచ్ఛత కలిగిన 20 కారెట్ల ఆభరణాలప్రమాణాన్ని కూడా చేర్చాలని ఆయన కోరారు. కాగా బంగారు ఆభరణాల కొనుగోలపై నాణ్యతా మాత్రం గుర్తించేందుకు వీలుగా విక్రయదారులు బంగారు ఆభరణాలపై హాల్ మార్క్‌ను తప్పనిసరిగా ముద్రించేలా కేంద్రం యోచిస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇటీవల రాంవిలాస్ పాశ్వాన్ వెల్లడించారు. కొత్త నిబంధనల ప్రకారం బంగారం ఆభరణాలకు 14, 18, 22 కారట్లలో హాల్‌మార్కింగ్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
జనవరి తర్వాత గోల్డ్ కొనాలంటే...
సాక్షి,న్యూఢిల్లీ: బంగారంలో నాణ్యతా ప్రమాణాలు కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం నూతన నిబంధనలతో ముందుకొచ్చింది. బంగారం విక్రయించేముందు దాని నాణ్యతను ధృవీకరించే హాల్‌మార్కింగ్, కారట్ కౌంట్‌ను అనివార్యం చేయనుంది. జనవరి తర్వాత కేవలం హాల్‌మార్కింగ్ బంగారాన్నే విక్రయించాలనే నిబంధన తీసుకురానున్నట్టు ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాం విలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు తాము కొంటున్న బంగారు ఆభరణాల నాణ్యత గురించి వారికి తెలియడం లేదని, జనవరి కల్లా బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేసేలా నిర్ణయం తీసుకోనున్నామని పాశ్వాన్ తెలిపారు. కొన్ని ఆభరణాలపై బీఐఎస్ మార్క్ ఉంటున్నా అది ఆభరణాల నాణ్యతను వినియోగదారులకు స్పష్టంగా వెల్లడించేలా లేదన్నారు. నూతన నిబంధనల ప్రకారం ఆభరణాల్లో ఉపయోగిస్తున్న బంగారం కారట్ల గురించి కూడా హాల్‌మార్క్‌లో పొందుపరుస్తారు. ఆభరణాలకు 14, 18, 22 కారట్ల మూడు కేటగిరీల్లో హాల్‌మార్కింగ్ ఇస్తారని మంత్రి తెలిపారు. -
బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్‌కు చట్టబద్ధత!
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల నాణ్యతను ధృవీకరించే హాల్మార్కింగ్కి చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బీఐఎస్) చట్టానికి సవరణలు చేయాలని భావిస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. అయితే, హాల్‌మార్కింగ్ ప్రక్రియ స్వచ్ఛందంగా పాటించేలా ఉంచాలా లేక తప్పనిసరి చేయాలా అన్న అంశంపై నిర్ణయమేదీ తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. బీఐఎస్ చట్ట సవరణల్లో మార్పుల విషయంలో సంబంధిత వర్గాలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఆభరణాలు విక్రయించే సంస్థలు వివిధ క్యారట్ల బంగారం, వాటి రేట్ల గురించి కొనుగోలుదారులకు అసలు తెలియజేస్తున్నారా లేదా అన్న అంశం గురించి ఆయన ఆరా తీశారు. ‘నేను 18-24 క్యారట్ల స్వచ్ఛత బంగారం గురించే విన్నాను. 9 క్యారట్ల బంగారం కూడా ఉంటుందన్నది నాకు తెలియదు’ అని పాశ్వాన్ వ్యాఖ్యానించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని బీఐఎస్‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి కొనుగోలుదారుల ప్రయోజనాల పరిరక్షణపై మరింతగా దృష్టి పెట్టాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ అధికారులకు సూచించారు. 18-24 క్యారట్స్ ఆభరణాలు మాత్రమే బీఐఎస్ సర్టిఫై చేయాలంటూ తమ శాఖకు సూచనలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో దీనిపై బీఐఎస్ నివేదిక ఇచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. బంగారు ఆభరణాల స్వచ్ఛత గురించి ధృవీకరించేలా 2000 ఏప్రిల్ నుంచి బీఐఎస్ హాల్‌మార్కింగ్ ప్రక్రియను ప్రవేశపెట్టింది. దీని కింద జ్యుయెలర్లు తమ ఆభరణాలను హాల్‌మార్కింగ్ చేసేందుకు బీఐఎస్ నుంచి లెసైన్సు పొందాల్సి ఉంటుంది.