బంగారంకంటే వజ్రాలపైనే ఆసక్తి
సాక్షి, హైదరాబాద్ : భారతీయ వినియోగదారులు బంగారు ఆభరణాలకంటే వజ్రాభరణాలపై ఆసక్తి చూపుతున్నారని ప్రముఖ వజ్రాభరణాల తయారీ సంస్థ ఫరెవర్‌మార్క్ సీఈఓ స్టీఫెన్ లూసియార్ తెలిపారు. గురువారంనాడిక్కడ ఫరెవర్‌మార్క్ వజ్ర ప్రదర్శనను నిర్వహించారు. ఈసందర్భంగా స్టీఫెన్‌మాట్లాడుతూ ఫరెవర్ సరికొత్త వజ్రాభరణాలను అత్యాధునిక నమూనాలతో వినియోగదారులకు అందిస్తుందన్నారు. ఫరెవర్‌మార్క్ 170 ఔట్‌లెట్‌లతో వ్యాపారాన్ని కొనసాగిస్తుందన్నారు.
రానున్న పండుగలు, పెళ్ళిళ్లను ఉద్దేశించి ఈ ప్రదర్శన నిర్వహించామన్నారు. ప్రదర్శనలో భారతదేశపు ప్రముఖ ఆభరణాల సంస్థలు పాల్గొని స్టాళ్ళలో డైమండ్స్‌ను ప్రదర్శించాయి. ఈ కార్యక్రమంలో పరెవర్ మార్క్ ఇండియా ప్రెసిడెంట్ సచిన్‌జైన్, ప్రముఖ వ్యాపార వేత్తలు జీవీకె వైస్ చైర్మన్ సంజయ్‌రెడ్డి, ఫిన్‌స్మార్ట్ ఫౌండర్ మహేశ్‌మూర్తి తదితరులు పాల్గొన్నారు.