క్విప్ ద్వారా ఎస్‌బీఐ 15,000 కోట్ల సమీకరణ
ముంబై: క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్విప్) మార్గంలో రూ. 15,000 కోట్లు సమీకరించినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ వెల్లడించింది. క్విప్ కింద షేరు ఒక్కింటికి రూ. 287.25 చొప్పున మొత్తం 52.2 కోట్ల షేర్లను జారీ చేసినట్లు పేర్కొంది. జూన్ 5న ప్రకటించిన క్విప్ ఇష్యూని ముగిస్తున్నట్లు ఎస్‌బీఐ గురువారం స్టాక్ ఎక్సే్చంజీలకు తెలిపింది. ఈ నిధులను క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తిని మెరుగుపర్చుకోవడం, ఇతరత్రా అవసరాలకు వినియోగించుకోనున్నట్లు పేర్కొంది.