క్విప్ ఇష్యూతో ఎస్‌బీఐకి లాభమే
మూడీస్ అంచనా
న్యూఢిల్లీ: ఎస్‌బీఐ ఇటీవల అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు (క్విప్) ద్వారా రూ.15,000 కోట్లను సమీకరించడం బ్యాంకు పరపతికి సానుకూలమని అమెరికాకు చెందిన బ్రోకరేజీ సంస్థ మూడీస్ తెలిపింది. రుణాల వృద్ధికి ఈ నిధులు తోడ్పడతాయని వివరించింది. అంతేకాదు, ప్రభుత్వంపై ఆధారపడడాన్ని కూడా ఇది తగ్గిస్తుందని పేర్కొంది.
ప్రభుత్వం నుంచి కూడా నిధుల సాయం అందితే బ్యాంకు మూలధనం మరింత బలోపేతం అవుతుందని నివేదికలో వెల్లడించింది. బాసెల్–3 నిబంధనల మేరకు మూలధన అవసరాలు 2018 మార్చి నాటికి 7.8 శాతం, 2019 మార్చి నాటికి 8.6 శాతం అవసరం కాగా, తాజా నిధుల సమీకరణ అందుకు సాయపడుతుందని నోమురా పేర్కొంది.