Aditya Birla Fashion
-
రూ.4,789 కోట్లు నిధుల సమీకరణ
ప్రయివేట్ రంగ కంపెనీ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్(ABFRL) నిధుల సమీకరణ చేపట్టనుంది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(QIP), ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా మొత్తం రూ.4,789 కోట్లు అందుకునే యోచనలో ఉంది. వృద్ధి వ్యూహాలకు పెట్టుబడులను సమకూర్చుకునే ప్రణాళికలో భాగంగా బోర్డు ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు కంపెనీ పేర్కొంది. దీనిలో భాగంగా ప్రమోటర్ సంస్థ పిలానీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్‌కు రూ. 1,298 కోట్లు, ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రూ. 1,081 కోట్లు విలువైన ప్రిఫరెన్షియల్ షేర్ల జారీకి బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా క్విప్ ద్వారా మరో రూ. 2,500 కోట్ల సమీకరణ(funds)కు సైతం బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2024 సెపె్టంబర్ 19న నిర్వహించిన సాధారణ వార్షిక సమావేశంలో వాటాదారులు అనుమతించిన నిధుల సమీకరణ ప్రతిపాదనకు తాజాగా బోర్డు మరోసారి ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది చివరిలోగా కంపెనీ మదురా ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ బిజినెస్‌ను కొత్తగా ఏర్పాటు చేసిన ఆదిత్య బిర్లా లైఫ్‌స్టైల్ బ్రాండ్స్కింద విడదీయనుంది.ఇదీ చదవండి: త్రైమాసిక ఫలితాలు డీలా.. కంపెనీ షేర్ల నేలచూపులుయాక్సిస్ బ్యాంక్ లాభం ప్లస్ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్(Axis Bank) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 6,304 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 6,071 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 33,516 కోట్ల నుంచి రూ. 36,926 కోట్లకు ఎగసింది. వడ్డీ ఆదాయం రూ. 27,961 కోట్ల నుంచి రూ. 30,954 కోట్లకు బలపడింది. నికర వడ్డీ ఆదాయం 9 శాతం వృద్ధితో రూ. 13,483 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 0.08 శాతం తగ్గి 3.93 శాతానికి చేరాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 1,028 కోట్ల నుంచి రూ. 2,156 కోట్లకు ఎగశాయి. స్థూల స్లిప్పేజీలు రూ. 4,923 కోట్ల నుంచి రూ. 5,432 కోట్లకు పెరిగాయి. దీంతో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.44 శాతం నుంచి 1.46 శాతానికి స్వల్పంగా పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి 17.01 శాతంగా నమోదైంది. కాగా.. క్యూ3లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 6,491 కోట్ల నుంచి రూ. 6,742 కోట్లకు పుంజుకుంది. -
ఫ్లిప్‌కార్ట్, ఆదిత్యా బిర్లా డీల్
సాక్షి, ముంబై: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్) మరో బిగ్ డీల్ కుదుర్చుకుంది. ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమసంస్థలో వాటాలను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా గ్రూప్‌నకు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లో 7.8 వాటాను 1,500 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయనుంది. ఈమేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా రూ .205 (షేరుకు) ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేయనుంది. ఫ్లిప్‌కార్ట్-ఏబీఎఫ్ఆర్ఎల్ ఒప్పందం ఇప్పటివరకు ఆఫ్‌లైన్ వినియోగదారుల స్థలంలో 2020 యొక్క రెండవ పెద్ద ఒప్పందం అవుతుంది. ఈ ఏడాది ఆగస్టులో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) యూనిట్ రిటైల్ వెంచర్స్ రిటైల్ మరియు హోల్‌సేల్ వ్యాపారంతో పాటు కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ నుండి లాజిస్టిక్స్ మరియు గిడ్డంగుల వ్యాపారాన్ని 24,713 కోట్ల రూపాయల స్థూల మొత్తానికి ఆందోళనకు గురిచేసింది.వాటా విక్రయం ఎబిఎఫ్ఆర్ఎల్ ప్రమోటర్ , ప్రమోటర్ గ్రూప్ కంపెనీలు వాటాలు 55.13 శాతానికి చేరనున్నట్లు వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా దేశీ దుస్తుల మార్కెట్లో కంపెనీ మరింత విస్తరించే వీలున్నట్లు ఏబీ ఫ్యాషన్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. రానున్న ఐదేళ్లలో దేశీయ వస్త్ర పరిశ్రమ 100 బిలియన్ డాలర్లను తాకనుందని తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌కు వాటా విక్రయం ద్వారా లభించే నిధులను బ్యాలన్స్‌షీట్ పటిష్టతకు, వృద్ధి అవకాశాలకూ వినియోగించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ వార్తల తరువాత, ఏబిఎఫ్ఆర్ఎల్ షేర్లు శుక్రవారం 3.5 శాతం ఎగిసాయి. 2020 లో ఏబీఎఫ్ఆర్ఎల్ చేసుకున్న రెండవ అతిపెద్ద డీల్ గా నిలిచింది. ఈ ఏడాది ఆగస్టులో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) యూనిట్ రిటైల్ వెంచర్స్ కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ లాజిస్టిక్స్ గిడ్డంగుల వ్యాపారాన్ని 24,713 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సుమారు 3,000 దుకాణాల నెట్వర్క్ ఆదిత్యా బిర్లా ష్యాషన్ సొంతం. 23,700 మల్టీ-బ్రాండ్ అవుట్లెట్లలో ఉంది. పాంటలూన్స్ రిటైల్ ఫార్మాట్‌తో పాటు పీటర్ ఇంగ్లాండ్, అలెన్ సోలీ, వాన్ హ్యూసెన్, లూయిస్ ఫిలిప్ వంటి బ్రాండ్లను నిర్వహిస్తుంది.ఈ సముపార్జనతో, వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ తన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన మింత్రా తోపాటు, ఏబీఎఫ్ఆర్ఎల్ అంతర్జాతీయ, జాతీయ ప్రీమియం బ్రాండ్లను కూడా విక్రయించనుంది. -
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ చేతికి ఫరెవర్ 21
డీల్ విలువ రూ.176 కోట్లు న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్) కంపెనీ అంతర్జాతీయ క్లోథింగ్ బ్రాండ్ ఫరెవర్ 21ను(భారత మార్కెట్) కొనుగోలు చేయనున్నది. భారత్‌లో ఫరెవర్21 బ్రాండ్‌ను రూ.175.52 కోట్లకు (2.6 కోట్ల డాలర్లకు) కొనుగోలు చేయనున్నామని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ తెలిపింది. ఈ మేరకు డయానా రిటైల్, డీఎల్ఎఫ్ బ్రాండ్స్‌తో వ్యాపార బదిలీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని పేర్కొంది. ఫరెవర్ 21 బ్రాండ్‌కు డయానా రిటైల్ సంస్థ ఫ్రాంచైజీగా వ్యవహరిస్తోంది. ఫరెవర్ 21ఆన్లైన్, ఆఫ్‌లైన్ హక్కులను చేజిక్కించుకోనున్నామని ఈ ఏడాది మేలోనే ఏబీఎఫ్ఆర్ఎల్ వెల్లడించింది. ఫరెవర్ 21 బ్రాండ్.. ప్రపంచవ్యాప్తంగా 700కు పైగా స్టోర్స్‌ను నిర్వహిస్తోంది.