ఆదిత్య బిర్లా ఫ్యాషన్ చేతికి ఫరెవర్ 21
డీల్ విలువ రూ.176 కోట్లు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఎఫ్‌ఆర్‌ఎల్) కంపెనీ అంతర్జాతీయ క్లోథింగ్ బ్రాండ్ ఫరెవర్ 21ను(భారత మార్కెట్) కొనుగోలు చేయనున్నది. భారత్‌లో ఫరెవర్21 బ్రాండ్‌ను రూ.175.52 కోట్లకు (2.6 కోట్ల డాలర్లకు) కొనుగోలు చేయనున్నామని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ తెలిపింది. ఈ మేరకు డయానా రిటైల్, డీఎల్‌ఎఫ్ బ్రాండ్స్‌తో వ్యాపార బదిలీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని పేర్కొంది. ఫరెవర్ 21 బ్రాండ్‌కు డయానా రిటైల్ సంస్థ ఫ్రాంచైజీగా వ్యవహరిస్తోంది. ఫరెవర్ 21ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ హక్కులను చేజిక్కించుకోనున్నామని ఈ ఏడాది మేలోనే ఏబీఎఫ్‌ఆర్‌ఎల్ వెల్లడించింది. ఫరెవర్ 21 బ్రాండ్.. ప్రపంచవ్యాప్తంగా 700కు పైగా స్టోర్స్‌ను నిర్వహిస్తోంది.