additional shares
-
బ్యాంక్ షేర్లలో తాజా కొనుగోళ్లు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో భాగంగా ఫెడరల్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌సహా పలు బ్యాంకులలో అదనపు వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకు ఆర్బీఐ నుంచి తాజాగా అనుమతులు లభించినట్లు హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ వెల్లడించింది. వెరసి అనుమతి పొందిన బ్యాంకులలో వాటాను 9.5 శాతంవరకూ పెంచుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు తెలియజేసింది. బ్యాంకులలో అదనపు పెట్టుబడులను చేపట్టేందుకు పెట్టుకున్న దరఖాస్తుకు ఆర్బీఐ క్లియరెన్స్ ఇచి్చనట్లు వివరించింది. హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి పొందిన జాబితాలో డీసీబీ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్ సైతం ఉన్నాయి. మరోవైపు చెల్లించిన మూలధనం లేదా వోటింగ్ హక్కులలో 9.5 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు హెచ్డీఎఫ్సీ ఏఎంసీకి ఆర్బీఐ నుంచి అనుమతి లభించినట్లు విడిగా ఈక్విటాస్ ఎస్ఎఫ్బీ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా.. 2023 జూన్30కల్లా ఫెడరల్ బ్యాంక్‌లో 4.49 శాతం, ఈక్విటాస్ ఎస్ఎఫ్బీలో 4.68 శాతం చొప్పున హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ వాటాలు కలిగి ఉంది. అయితే తాజా కొనుగోళ్ల తదుపరి ఒక్కో బ్యాంకులో 9.5 శాతం వాటాను మించేందుకు అనుమతించరు. -
కారట్‌లేన్‌లో టైటన్ వాటా అప్
న్యూఢిల్లీ: ఆధునిక జ్యువెలరీ బ్రాండ్ కారట్‌లేన్‌లో 27.18 శాతం అదనపు వాటాను కొనుగోలు చేయనున్నట్లు జ్యువెలరీ దిగ్గజం టైటన్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 4,621 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. దీంతో అనుబంధ సంస్థ కారట్‌లేన్‌లో తమ వాటా 98.28 శాతానికి జంప్‌చేయనున్నట్లు టాటా గ్రూప్ కంపెనీ తెలియజేసింది. కారట్లేన్ వ్యవస్థాపకులు మిథున్ సాచేటి, శ్రీనివాసన్ గోపాలన్సహా వారి కుటుంబీకుల నుంచి పూర్తి వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించింది. 2023 అక్టోబర్‌కల్లా కొనుగోలు పూర్తికాగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి సంస్థలో తమ వాటా ప్రస్తుత 71.09 శాతం నుంచి 98.28 శాతానికి బలపడనున్నట్లు తెలియజేసింది. కంపెనీల ఆవిర్భావమిలా.. అన్‌లిస్టెడ్ సంస్థ కారట్లేన్ ట్రేడింగ్ గతేడాది(2022–23) రూ. 2,177 కోట్ల టర్నోవర్ అందుకుంది. జ్యువెలరీ తయారీ, విక్రయాలనూ నిర్వహిస్తోంది. 2008లో పూర్తి ఆన్లైన్ బ్రాండ్‌గా ప్రారంభమైన కంపెనీలో టైటన్ తొలిసారి 2016లో ఇన్వెస్ట్ చేసింది. గత 8ఏళ్లలో తనిష్క్ బ్రాండుతో భాగస్వామ్యం ద్వారా కారట్లేన్ భారీ వృద్ధిని సాధించింది. టాటా గ్రూప్, తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధి సంస్థ(టిడ్కో) భాగస్వామ్య కంపెనీగా టైటన్ ఏర్పాటైంది. 1987లో టైటన్ వాచెస్గా కార్యకలాపాలు ప్రారంభించి 1994కల్లా తన‹Ù్క బ్రాండుతో జ్యువెలరీలోకి ప్రవేశించింది. తదుపరి టైటన్ ఐప్లస్ బ్రాండుతో కళ్లజోళ్ల బిజినెస్‌నూ ప్రారంభించింది. ఈ బాటలో పరిమళాలు, దుస్తులు, మహిళల బ్యాగులు, తదితర విభిన్న అనుబంధ ఉత్పత్తుల విక్రయాలకూ తెరతీసింది. అయితే గతేడాది కంపెనీ టర్నోవర్‌లో 88 శాతం వాటాకు సమానమైన రూ. 31,897 కో ట్లను జ్యువెలరీ విభాగం నుంచే పొందడం విశేషం! -
మ్యాక్స్ ఫిన్‌తో కొత్త ఒప్పందం
న్యూఢిల్లీ: మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 7 శాతం అదనపు వాటా కొనుగోలుకి సవరించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. ఇందుకు మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో పద్ధతిలో తాజా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ మార్గదర్శకాల ప్రకారం ఒప్పందంలో సవరణలకు తెరతీసినట్లు పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్ అనుబంధ కంపెనీలు యాక్సిస్ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్ 2021లో మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తద్వారా మ్యాక్స్ ఫైనాన్షియల్ అనుబంధ సంస్థ మ్యాక్స్ లైఫ్‌లో 20 శాతం వాటా కొనుగోలుకి సంతకాలు చేశాయి. దీనిలో భాగంగా ఇప్పటికే 12.99 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి. మిగిలిన వాటా కొనుగోలుకి తాజాగా ఒప్పందంలో సవరణలు చేపట్టినట్లు యాక్సిస్ బ్యాంక్, అనుబంధ కంపెనీలు తెలియజేశాయి. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో పద్ధతిలో భవిష్యత్ క్యాష్ ఫ్లో ఆధారంగా ఒక కంపెనీలో చేయనున్న పెట్టుబడి విలువను నిర్ధారిస్తారు. దీనిని ఫెయిర్ వ్యాల్యూగా పేర్కొంటారు. -
పాత లెక్కలు తిరగదోడదాం!
-
పాత లెక్కలు తిరగదోడదాం!
కృష్ణా జలాల్లో అదనపు వాటా కోసం ప్రభుత్వ కసరత్తు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో గడిచిన రెండున్నరేళ్లుగా రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని పూడ్చు కునేందుకు వీలుగా.. ఏపీ చేసిన పాత వినియోగ లెక్కలన్నీ బయ టకు తీయాలని తెలంగాణ నిర్ణ యించింది. నీటి లోటును ఈ విధంగానైనా భర్తీ చేసుకోవచ్చనే అభిప్రాయంతో ఉంది. ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో 53 టీఎంసీల మేర నీటి లభ్యతే ఉండటం, అందులోనూ 18 టీఎంసీలకు మించి వాటా దక్కకపోవచ్చన్న అంచనా నేపథ్యంలో గతంలో ఏపీ చేసిన అధిక వినియోగ లెక్కలను తీసి వాటిని ఈ ఏడాది నీటిలో కొంతైనా సర్దుబాటు చేయిం చేలా కసరత్తు చేస్తోంది. దీనిపై గురువారం ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్ రావు, నీటి పారుదలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, సాగర్ సీఈ సునీల్ ఇతర అధికారులతో చర్చలు జరిపారు. 2014–15 వాటర్ ఇయర్ లో తన వాటాలకు మించి ఏపీ 45 టీఎంసీలు వినియోగించగా, పోతిరెడ్డిపాడు కింద 11.24 టీఎంసీలు, కృష్ణా డెల్టా వ్యవస్థ (కేడీఎస్) కింద మరో 23 టీఎంసీలు అధి కంగా వాడుకుందని తేల్చారు. ఈ ఏడాది కృష్ణాలో ఏపీ 238 టీఎంసీలు వినియోగిం చాల్సి ఉన్నా, 10 టీఎంసీలు అధికంగా వాడుకుందని, పట్టి సీమ నీటిని సైతం కలుపుకొంటే అదనంగా వాడుకున్న నీరు 40 టీఎంసీలకు చేరుతుం దని అధికారులు చెప్పారు. ఇక తెలంగాణకు 138 టీఎంసీల వాటా రావాల్సి ఉన్నా 128 టీఎంసీలే వినియోగించిందన్నారు. అధి కారులు చెబుతున్న అంశాలపై బోర్డుకు లేఖ రాయాలని అధికారులు నిర్ణయించారు.