కారట్‌లేన్‌లో టైటన్‌ వాటా అప్‌ | Titan Company announces purchase of 27. 18percent additional stake in Caratlane for Rs 4,621 crore | Sakshi
Sakshi News home page

కారట్‌లేన్‌లో టైటన్‌ వాటా అప్‌

Published Tue, Aug 22 2023 3:59 AM | Last Updated on Tue, Aug 22 2023 3:59 AM

Titan Company announces purchase of 27. 18percent additional stake in Caratlane for Rs 4,621 crore - Sakshi

న్యూఢిల్లీ: ఆధునిక జ్యువెలరీ బ్రాండ్‌ కారట్‌లేన్‌లో 27.18 శాతం అదనపు వాటాను కొనుగోలు చేయనున్నట్లు జ్యువెలరీ దిగ్గజం టైటన్‌ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 4,621 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. దీంతో అనుబంధ సంస్థ కారట్‌లేన్‌లో తమ వాటా 98.28 శాతానికి జంప్‌చేయనున్నట్లు టాటా గ్రూప్‌ కంపెనీ తెలియజేసింది.

కారట్‌లేన్‌ వ్యవస్థాపకులు మిథున్‌ సాచేటి, శ్రీనివాసన్‌ గోపాలన్‌సహా వారి కుటుంబీకుల నుంచి పూర్తి వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించింది. 2023 అక్టోబర్‌కల్లా కొనుగోలు పూర్తికాగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి సంస్థలో తమ వాటా ప్రస్తుత 71.09 శాతం నుంచి 98.28 శాతానికి బలపడనున్నట్లు తెలియజేసింది.  

కంపెనీల ఆవిర్భావమిలా..
అన్‌లిస్టెడ్‌ సంస్థ కారట్‌లేన్‌ ట్రేడింగ్‌ గతేడాది(2022–23) రూ. 2,177 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. జ్యువెలరీ తయారీ, విక్రయాలనూ నిర్వహిస్తోంది. 2008లో పూర్తి ఆన్‌లైన్‌ బ్రాండ్‌గా ప్రారంభమైన కంపెనీలో టైటన్‌ తొలిసారి 2016లో ఇన్వెస్ట్‌ చేసింది. గత 8ఏళ్లలో తనిష్క్‌ బ్రాండుతో భాగస్వామ్యం ద్వారా కారట్‌లేన్‌ భారీ వృద్ధిని సాధించింది. టాటా గ్రూప్, తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధి సంస్థ(టిడ్కో) భాగస్వామ్య కంపెనీగా టైటన్‌ ఏర్పాటైంది.

1987లో టైటన్‌ వాచెస్‌గా కార్యకలాపాలు ప్రారంభించి 1994కల్లా తన‹Ù్క బ్రాండుతో జ్యువెలరీలోకి ప్రవేశించింది. తదుపరి టైటన్‌ ఐప్లస్‌ బ్రాండుతో కళ్లజోళ్ల బిజినెస్‌నూ ప్రారంభించింది. ఈ బాటలో పరిమళాలు, దుస్తులు, మహిళల బ్యాగులు, తదితర విభిన్న అనుబంధ ఉత్పత్తుల విక్రయాలకూ తెరతీసింది. అయితే గతేడాది కంపెనీ టర్నోవర్‌లో 88 శాతం వాటాకు సమానమైన రూ. 31,897 కో ట్లను జ్యువెలరీ విభాగం నుంచే పొందడం విశేషం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement