
సాక్షి,ముంబై: యాక్సిస్‌బ్యాంకు క్యూ3లో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. అయితే ఎనలిస్టుల అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైంది. సోమవారం ప్రకటించిన డిసెంబర్ తో ముగిసిన మూడవ త్రైమాసిక ఫలితాల్లో వృద్దిని నమోదు చేసింది. నికర లాభంలో 25శాతం పెరుగుదలను నమోదు చేసింది, అధిక వడ్డీ, ఫీజు ఆదాయాలు,బ్యాడ్ లోన్ల తగ్గుదల నేపథ్యంలో లాభాల్లో మెరుగుపడింది.
యాక్సిస్ బ్యాంక్ త్రైమాసిక నికరలాభం 25 శాతం పెరిగి రూ .726 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో రూ .580 కోట్ల నుంచి రూ .780 కోట్ల వరకు లాభాలు ఆర్జించింది.
మొత్తం రుణాల్లో బ్యాడ్ లోన్ల బెడద 5.28 శాతానికి దిగివచ్చింది. ఇది గత క్వార్టర్‌లో 5.90శాతం ఉండగా, గత ఏడాది 5.22శాతంగా ఉంది.