న్యూఢిల్లీ: ఆర్థిక సర్వీసులు అందించే దిశగా టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్, ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ జట్టు కట్టాయి. ఎయిర్‌టెల్ యూజర్ల కోసం కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించాయి. ఈ ఒప్పందం కింద యూజర్లు .. ప్రీ–అప్రూవ్డ్ ఇన్‌స్టంట్ రుణాలు, ‘బై నౌ పే లేటర్’ ఆఫర్లు, ఇతర సర్వీసులు పొందవచ్చు. అలాగే క్యాష్‌బ్యాక్‌లు, ప్రత్యేక డిస్కౌంట్లు కూడా లభిస్తాయి.
అర్హత కలిగిన ఎయిర్‌టెల్ కస్టమర్లు .. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా క్రెడిట్ కార్డును పొందవచ్చు. ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్లలోకి విస్తరించేందుకు యాక్సిస్ బ్యాంకుకి ఈ ఒప్పందం తోడ్పడనుంది. అటు యాక్సిస్ బ్యాంక్ ప్రపంచ స్థాయి ఆర్థిక సేవలను ఎయిర్‌టెల్ కస్టమర్లు పొదండానికి ఇది దోహదపడుతుందని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment