Micro finance companies
-
రుణ మార్గదర్శకాలు కఠినతరం
మైక్రో ఫైనాన్స్ సంస్థలకు ‘రుణ పూచీకత్తు’ మార్గదర్శకాలను కఠినతరం చేసినట్లు స్వీయ నియంత్రణ సంస్థ–మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ (ఎంఫిన్) ప్రకటించింది. మైక్రో ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పు తీసుకునేవారికి భారం పెరిగిపోతోందని, దీనితో తీసుకున్న రుణాలను వారు తిరిగి చెల్లించలేకపోతున్నారన్న ఆందోళనల నేపథ్యంలో ఎంఫిన్ తాజా నిర్ణయం తీసుకుంది. రుణాల్లో నెలకొన్న ప్రస్తుత సవాళ్ల పరిష్కారానికి తాజా చర్య దోహదపడుతుందని ఎంఫిన్ తెలిపింది. బుల్లెట్ రీపేమెంట్ (రుణ వ్యవధిలో అప్పటికి చెల్లింపులు జరిపింది పోగా మిగిలిన మొత్తాన్ని ఒకేసారి చెల్లిచడం), చెల్లించని ఈఎంఐల గురించి ప్రస్తుతం మైక్రో ఫైనాన్స్ సంస్థల వద్ద తగిన సమాచారం అందడంలేదని ఎంఫిన్ తెలిపింది. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రస్తుత మార్గదర్శకాలు దోహపదడతాయని ప్రకటన వివరించింది. అయితే మార్గదర్శకాలు ఏమిటన్నది నిర్ధిష్టంగా తెలియరాలేదు.ఇదీ చదవండి: తగ్గిద్దామా? వద్దా?ఇక ఒకే రుణగ్రహీత ఐదేసి రుణాలను తీసుకున్న పలు సందర్భాలూ వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వ్యవహారాలు ఆందోళనను సృష్టిస్తున్నాయి. ఒక రుణ గ్రహీత నెలవారీ సంపాదన ఎంత? చెల్లింపుల సామర్థ్యం ఏమిటి? అనే అంశాలపైనా మైక్రో ఫైనాన్స్ సంస్థలకు తగిన సమాచారం లేకపోవడం సమస్యకు మరో కారణం. ఆయా అంశాలు మైక్రో ఫైనాన్స్ సంస్థల రుణ నాణ్యతపై ప్రభావం చూపుతున్నాయి. సంబంధిత వర్గాల నుంచి ఆరు నెలలకు పైగా అందిన సమాచారం మేరకు 12 కోట్ల రుణ రికార్డులను విశ్లేషించిన తర్వాత కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే మార్గదర్శకాలపై త్వరలో పూర్తి సమాచారం వెలువడనుంది. -
ఒక వ్యక్తికి రూ.2 లక్షలే అప్పు ఇవ్వాలి: ఎంఫిన్
మైక్రో ఫైనాన్స్ కంపెనీలు(సూక్ష్మ రుణ సంస్థలు) ఒక వ్యక్తికి రూ.2 లక్షలకు మించి అప్పు ఇవ్వకూడదని ఎంఫిన్ (మైక్రో-ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్) ఆదేశించింది. అదికూడా గరిష్ఠంగా నాలుగు సంస్థలు మాత్రమే ఈ మొత్తాన్ని సమకూర్చాలని స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇష్టానుసారంగా రుణాలివ్వడంతో సాధారణ ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నట్లు ఎంఫిన్ పేర్కొంది.సూక్ష్మ రుణ సంస్థలు ఇష్టారాజ్యంగా రుణాలు జారీ చేయడం వల్ల, ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దాంతో మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వద్ద మొండి బకాయిలు పెరుకుపోతున్నాయి. మార్కెట్లోని బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాలు రానివారు, కొన్ని కారణాల వల్ల బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం కుదరని వారు సూక్ష్మ రుణ సంస్థలను సంప్రదిస్తున్నారు. దాంతో అధికవడ్డీకి ఆశపడి ఆయా సంస్థలు ప్రజలకు రుణాలిస్తున్నాయి. కానీ వాటిని తిరిగి చెల్లించే క్రమంలో సమస్యలు ఎదురవుతున్నాయి. దానివల్ల ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దానికితోడు సంస్థలు ఇచ్చిన అప్పు రికవరీ శాతం తగ్గిపోతుంది. ఈ వ్యవహారాన్ని గుర్తించిన ఎంఫిన్ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది.సూక్ష్మ రుణ సంస్థలకు నియంత్రణ వ్యవస్థగా ఎంఫిన్ వ్యవహరిస్తోంది. ఎంఫిన్ తెలిపిన వివరాల ప్రకారం..మైక్రో ఫైనాన్స్ కంపెనీలు ఒక వ్యక్తికి గరిష్ఠంగా రూ.2 లక్షలు మాత్రమే అప్పుగా ఇవ్వాలి. ఈ మొత్తాన్ని నాలుగు సంస్థల వరకు మాత్రమే సమకూర్చాలని తెలిపింది.ఇదీ చదవండి: గిఫ్ట్సిటీలో యూరోపియన్ బ్యాంక్ ప్రారంభంసూక్ష్మ రుణ సంస్థల వినియోగదార్లుగా దాదాపు రూ.3 లక్షల వార్షికాదాయం గల కుటుంబాలే అధికంగా ఉన్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో ఈ రంగం ఎంతగానో విస్తరించింది. ప్రస్తుతం సూక్ష్మ రుణాల పరిశ్రమకు 7.8 కోట్ల మంది వినియోగదార్లు ఉన్నారు. వీరికి జారీ చేసిన రుణాల మొత్తం రూ.4.33 లక్షల కోట్లకు పైగా ఉందని సమాచారం. -
11 శాతం పెరిగిన సూక్ష్మ రుణాలు
న్యూఢిల్లీ: సూక్ష్మ రుణ పరిశ్రమ (మైక్రోఫైనాన్స్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో 11 శాతం అధికంగా రూ.71,916 కోట్ల రుణాలను పంపిణీ చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రుణాల పంపిణీ రూ.64,899 కోట్లుగా ఉంది. మొత్తం రుణాల సంఖ్య 1.81 కోట్లుగా కాగా, క్రితం ఏడాది ఇదే కాలంలో మొత్తం పంపిణీ చేసిన రుణాల సంఖ్య 1.85 కోట్లుగా ఉంది. ద్వితీయ త్రైమాసికానికి సంబంధించి గణంకాలను మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ నెట్వర్క్ (ఎంఫిన్) విడుదల చేసింది. పరిశ్రమ మొత్తం రుణ పోర్ట్‌ఫోలియో విలువ రూ.3 లక్షల కోట్లకు చేరింది. మొత్తం 12 కోట్ల రుణ ఖాతాలకు సేవలు అందిస్తోంది. ‘‘మైక్రోఫైనాన్స్ పరిశ్రమ స్థూల రుణ పోర్ట్‌ఫోలియో (జీఎల్పీ) రూ.3,00,974 కోట్లకు చేరింది. 2021 సెప్టెంబర్ చివరికి ఉన్న రూ.2,43,737 కోట్లతో పోలిస్తే 23.5 శాతం వృద్ధి చెందింది’’ అని ఈ నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో పంపిణీ చేసిన ఒక్కో రుణం సగటున రూ.40,571గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12 శాతం పెరిగింది. ఒక వంతు వాటా పీఎస్‌బీలదే ఈ మొత్తం రుణాల్లో 13 ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) సంయుక్తంగా 37.7 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐ) 36.7 శాతం వాటా (రూ.1,10,418 కోట్లు) కలిగి ఉన్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సూక్ష్మ రుణాల్లో 16.6 శాతం వాటా (రూ.50,029) ఆక్రమించాయి. ఇక ఎన్బీఎఫ్సీలు 7.9 శాతం, ఇతర సూక్ష్మ రుణ సంస్థలు 1.1 శాతం మేర రుణాలను పంపిణీ చేసి ఉన్నాయి. మైక్రోఫైనాన్స్ యాక్టివ్ (సకాలంలో చెల్లింపులు చేసే) రుణ ఖాతాలు గత 12 నెలల్లో (సెప్టెంబర్‌తో అంతమైన చివరి) 14.2 శాతం పెరిగి 12 కోట్లకు చేరాయి. తూర్పు, ఈశాన్యం, దక్షిణాది ప్రాంతాలు మొత్తం సూక్ష్మ రుణాల్లో 63.9 శాతం వాటా కలిగి ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడు ఎక్కువ వాటా ఆక్రమిస్తోంది. -
మైక్రోఫైనాన్స్‌లో భారీ వడ్డీ ఉండొద్దు.. ఆర్బీఐ కీలక ప్రకటన
ముంబై: సూక్ష్మ రుణ సంస్థలకు వడ్డీ రేట్ల పరంగా స్వేచ్ఛనిస్తూ ఆర్బీఐ ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సూక్ష్మ రుణాలపై వడ్డీ రేట్లను త్రైమాసికం వారీగా ఆర్బీఐ నిర్ణయిస్తూ వచ్చింది. ఇక నుంచి వడ్డీ రేట్లను మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఎంఎఫ్ఐలు) నిర్ణయించుకునేందుకు ఆర్బీఐ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం బోర్డు ఆమోదంతో ఒక విధానాన్ని రూపొందించుకోవాలని కోరింది. ఇందులో హెచ్చు వడ్డీలు అమలు చేయకుండా రైడర్‌కు చోటు ఇవ్వాలని నిర్ధేశించింది. వార్షిక ఆదాయం రూ.3 లక్షల వరకు ఉన్న వారికి హామీ లేకుండా ఇచ్చే రుణాలను సూక్ష్మ రుణాలుగా ఆర్బీఐ నిర్వచనాన్ని సవరించింది. ‘‘సూక్ష్మ రుణాలపై వడ్డీ రేట్లు, ఇతర చార్జీలు/ఫీజులు అన్నవి భారీగా (అన్యాయంగా) ఉండకూడదు. ఇవన్నీ కూడా ఆర్బీఐ సూక్ష్మ పరిశీలనకు లోబడి ఉంటాయి’’ అని తన ఆదేశాల్లో ఆర్బీఐ పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి నూతన ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. నూతన నిబంధనలు.. - ప్రతి సూక్ష్మ రుణ సంస్థ (రెగ్యులేటెడ్ ఎంటెటీ/ఆర్ఈ) చార్జీలకు సంబంధించి సమాచారాన్ని రుణ గ్రహీతలకు ప్రామాణిక విధానంలో, సులభంగా అర్థమయ్యేట్టు తెలియజేయాలి. - రుణగ్రహీత నుంచి వసూలు చేసే ఏ చార్జీ అయినా ఫాక్ట్‌షీట్ లో తెలియజేయాలి - సూక్ష్మ రుణాలను నిర్ణీత కాలవ్యవధికి ముందే తీర్చి వేస్తే ఎటువంటి చార్జీ వసూలు చేయకూడదు - చెల్లింపులు ఆలస్యం చేస్తే, ఆ మొత్తంపైనే పెనాల్టీ విధించాలి కానీ, రుణం మొత్తంపై అమలు చేయకూడదు - రుణ గ్రహీత అర్థం చేసుకోతగిన భాషలో రుణ ఒప్పందం పత్రం ఉండాలి చదవండి:ఎయిర్టెల్ క్రెడిట్ కార్డులు.. ఫైనాన్స్ ఇప్పుడెంతో ఈజీ -
ఎయిర్టెల్ కూడా మొదలెట్టింది.. ఇక మరింత సులువుగా లోన్లు
న్యూఢిల్లీ: ఆర్థిక సర్వీసులు అందించే దిశగా టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్, ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ జట్టు కట్టాయి. ఎయిర్టెల్ యూజర్ల కోసం కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించాయి. ఈ ఒప్పందం కింద యూజర్లు .. ప్రీ–అప్రూవ్డ్ ఇన్స్టంట్ రుణాలు, ‘బై నౌ పే లేటర్’ ఆఫర్లు, ఇతర సర్వీసులు పొందవచ్చు. అలాగే క్యాష్‌బ్యాక్‌లు, ప్రత్యేక డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. అర్హత కలిగిన ఎయిర్టెల్ కస్టమర్లు .. ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా క్రెడిట్ కార్డును పొందవచ్చు. ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్లలోకి విస్తరించేందుకు యాక్సిస్ బ్యాంకుకి ఈ ఒప్పందం తోడ్పడనుంది. అటు యాక్సిస్ బ్యాంక్ ప్రపంచ స్థాయి ఆర్థిక సేవలను ఎయిర్టెల్ కస్టమర్లు పొదండానికి ఇది దోహదపడుతుందని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. -
తక్కువ వడ్డీ పేరిట అదితి గోల్డ్ లోన్ సంస్థ ఘరానా మోసం! కిలోల బంగారంతో పరార్..
విజయవాడ: అదితి గోల్డ్ లోన్ సంస్థ నిర్వాహకులు తక్కువ వడ్డీకే రుణం అంటూ ప్రచారం గుప్పించారు. ఆపై తమ వద్ద ప్రజలు కుదువ పెట్టిన బంగారంతో పరారయ్యారు. తమ సంస్థలో వ్యాపార భాగస్వామ్యం ఇస్తామంటూ కూడా పలువురిని మోసగించారు. ఈ కంపెనీ నిర్వాహకుల మోసాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బెంగళూరుకు చెందిన హర్షిత్ మహర్షి విజయవాడ భవానీపురంలోని స్వాతి సెంటర్లోని ఓ కాంప్లెక్స్‌ను అద్దెకు తీసుకుని ఈ ఏడాది జూన్‌లో అదితి గోల్డ్ లోన్ సంస్థను ఏర్పాటు చేశారు. 75 పైసల వడ్డీకే బంగారంపై రుణం ఇస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు. కొద్ది రోజుల్లోనే వందలాది మంది ఈ సంస్థను ఆశ్రయించారు. వేరే ఇతర ఫైనాన్స్ సంస్థల్లో, బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టిన వారు సైతం ఈ సంస్థకు బంగారాన్ని మార్చారు. వడ్డీ తక్కువ కావడంతో ఎక్కువ మొత్తంలో బంగారం తాకట్టు పెట్టిన వారు అధికంగా ఉన్నారు. వ్యాపార అవసరాల నిమిత్తం భవానీపురానికి చెందిన ఓ గృహిణి ఈ ఏడాది సెప్టెంబర్‌లో అదితి గోల్డ్ లోన్ సంస్థలో అరకిలో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి ఆగస్టులో 200 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టారు. సెప్టెంబర్ చివరి వారంలో సంస్థ బోర్డ్ తిప్పేయడంతో బాధితులు అప్పట్లోనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేయడం మినహా బాధితులకు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో సోమవారం పలువురు బాధితులు విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు. ఈ సంస్థ ద్వారా మోసం పోయిన బాధితులు వందల్లో ఉంటారని సమాచారం. వ్యాపార భాగస్వామ్యం పేరుతో.. వ్యాపార భాగస్వామ్యం ఇస్తామని ఇదే సంస్థ నిర్వాహకులు జిల్లాలో పలువురిని మోసం చేశారు. విజయవాడ గవర్నర్‌పేటలో గోల్డ్ వర్క్‌షాప్ నిర్వాహకుడి నుంచి రూ.5 లక్షలు, మరో గోల్డ్ టెస్టింగ్ షాపు యజమాని నుంచి రూ.5 లక్షలు తీసుకుని ఉడాయించారు. నకిలీ ఐఎస్ఓ, జీఎస్టీ, మైక్రో ఫైనాన్స్ సర్టిఫికెట్లను చూపించి అదితి గోల్డ్ నిర్వాహకులు తమను మోసం చేశారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై భవానీపురం సీఐ మురళీకృష్ణను వివరణ కోరగా గోల్డ్ లోన్ సంస్థపై ఫిర్యాదులు అందాయని, కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. చదవండి: ఆటో డ్రైవర్ సెల్‌ఫోన్ నిర్వాకం 9 మంది ప్రాణాలకు ఎసరెట్టింది! -
ఇది చరిత్రాత్మక నిర్ణయం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: రిటైల్, హోల్ సేల్ వ్యాపారాలనూ ఎంఎస్ఎంఈ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు నిన్న కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కీలక నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ నేడు స్పందించారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) జాబితాలో రిటైల్, హోల్ సేల్ వ్యాపారాలను చేర్చి తమ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మోదీ అన్నారు. దీని వల్ల కోట్లాది మంది వర్తకులకు లబ్ధి చేకూరుతుందని మోదీ చెప్పారు. వేగంగా ఆర్థిక సాయం అందడంతో పాటు వారి వ్యాపారాలు వృద్ధి చెందుతాయన్నారు. వ్యాపారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్లో ఆయన ట్వీట్ చేశారు. ఇక నూతన మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు. కొత్త నిబంధనలతో దాదాపు 2.5 కోట్ల మంది రిటైల్, హోల్ సేల్ వర్తకులు లబ్ధి పొందుతారని చెప్పారు. దీంతో ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రాధాన్య రంగాలకు రుణాల్లో చిరు వర్తకులకు లాభం కలుగుతుంది. అంతేగాకుండా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ లో వారు నమోదు చేసుకోవచ్చు. Our government has taken a landmark step of including retail and wholesale trade as MSME. This will help crores of our traders get easier finance, various other benefits and also help boost their business. We are committed to empowering our traders. https://t.co/FTdmFpaOaU — Narendra Modi (@narendramodi) July 3, 2021 అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇకపై ఎంఎస్ఎంఈలకు వర్తించే ప్రభుత్వ స్కీములు, ప్రయోజనాలు తమకు కూడా లభించగలవని సీఏఐటీ జాతీయ ప్రెసిడెంట్ బీసీ భార్తియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో ఆయా వర్గాలకు రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం ప్రాధాన్యతా రంగం కింద రుణాలు పొందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. చిన్న సంస్థలను పటిష్టం చేసేందుకు, ఆర్థిక వృద్ధికి వాటిని చోదకాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గడ్కరీ నిన్న ట్వీట్ చేశారు. తాజా మార్గదర్శకాలతో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద 250 కోట్లపైగా టర్నోవర్ ఉన్న హోల్‌సేల్ వ్యాపారులు, చిన్నస్థాయి రిటైలర్లు త్వరగతిన ఫైనాన్స్ పొందే అవకాశం ఉంటుందని వెల్లడించారు. వారు ఉద్యమ్ పోర్టల్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. -
కిస్తీ కట్టకపోతే ఫోన్ లాక్ అయిపోతుంది మరి!
‘మీరు ఈ నెల వాయిదా చెల్లించని కారణంగా మీరు మొబైల్ ఫోన్ వినియోగించలేరు. వెంటనే ఫైన్ సహా వాయిదా చెల్లించండి’ అంటూ కరీంనగర్‌కు చెందిన ఓ యువకుడి ఫోన్‌కి సందేశం వచ్చింది. వెంటనే ఫోన్ పనిచేయడం ఆగిపోయింది. సిద్దిపేట సమీపంలో ఉండే మరో యువకుడి ఫోన్ అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయింది. ఇన్కమింగ్ ఫోన్ నంబర్లు మినహా మరే ఆప్షన్ పనిచేయట్లేదు. వెంటనే ఈనెల కిస్తీ చెల్లించాలన్న సందేశం మాత్రం ఫోన్ స్క్రీన్‌పై కనబడుతోంది. సాక్షి, హైదరాబాద్: తమ వద్ద అప్పు తీసుకున్న వారిని మైక్రోఫైనాన్స్ కంపెనీలు రకరకాలుగా ముప్పు తిప్పలు పెడుతుంటాయి. తాజాగా నెల వాయిదా చెల్లించకపోతే ఫోన్లను కూడా లాక్ చేస్తూ చుక్కలు చూపుతున్నాయి. అంటే ఆ సంస్థల వద్ద అప్పు తీసుకుని మొబైల్ ఫోన్ కొనుక్కుంటే ఫోన్ పేరుకే మనం వాడుతాం. కానీ ఎప్పుడంటే అప్పుడు దాన్ని పనిచేయకుండా చేయగలవు ఆ కంపెనీలు. తమ వద్ద రుణం తీసుకుని ఫోన్ కొన్న వారెవరైనా నెల వాయిదా చెల్లించకుంటే ఫోన్ పనిచేయకుండా చేస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందో వినియోగదారులకు అర్థం కావట్లేదు. తమ ఫోన్ హ్యాక్‌కు గురైందా లేదా ఏదైనా సాఫ్ట్వేర్ సమస్య వచ్చిందా? వైరస్ దాడి చేసిందా అన్న విషయం తెలియక తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలు, గ్రామాలపైనే టార్గెట్.. వాస్తవానికి మైక్రో సంస్థలు సెల్ఫోన్లు కొనుక్కునేందుకు రుణాలు ఇవ్వడం కొత్తేం కాదు. హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రజలంతా క్రెడిట్ కార్డులు వాడుతుంటారు. అందుకే, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు జిల్లాల్లో తమ మార్కెట్‌ను విస్తరించుకుంటున్నాయి. ఇందులో భాగంగా సెమీ అర్బన్, రూరల్‌లోని జిల్లా కేంద్రాలు, చిన్న పట్టణాలు, టౌన్లలోని మొబైల్ షాపుల్లో వీరి ఏజెంట్లు ఉంటారు. ఏజెంట్లు షాపు నిర్వాహకులకు మధ్య ముందే వ్యాపార అవగాహన ఉంటుంది. అందుకే ఫోన్లు కొనేందుకు వచ్చినవారికి వారి బడ్జెట్ కంటే అధిక ధర ఉన్న ఫోన్లను చూపిస్తారు. అప్పుడే ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ సీన్లోకి వస్తాడు. సార్.. తక్కువ వడ్డీతో మంచి ఫోన్ తీసుకోండి అంటూ ఆఫర్లతో ఊరిస్తాడు. వినియోగదారుడు సరే అనగానే.. అతడితో కొన్ని సంతకాలు తీసుకుంటారు. ఆ పత్రాల్లో ఎక్కడో చిన్నగా నెల వాయిదా చెల్లించకపోతే హ్యాండ్సెట్ లాక్ అవుతుందని నిబంధన ఉంటుంది. ఆ నిబంధనలు ఇంగ్లిష్‌లో ఉండటం, గ్రామీణులకు ఇంగ్లిష్ రాకపోవడం, షాపింగ్ ముగించుకునే తొందరలో ఉండటంతో చాలామంది ఈ షరతులను చదవడం లేదు. అన్యాయం అంటున్న వినియోగదారులు.. ‘నేను వృత్తిరీత్యా పలు ఊర్లు తిరుగుతాను. వాస్తవానికి నెల వాయిదా కట్టడం మర్చిపోయాను. ఎలాంటి అలర్ట్, వార్నింగ్ సందేశాలు లేకుండా.. పనిలో ఉండగా ఉన్నట్లుండి నా ఫోన్ లాక్ అయింది. నేను వెంటనే చెల్లించాను. కానీ, మూడు రోజుల పాటు నా ఫోన్‌ను తిరిగి అన్‌లాక్ చేయలేదు. ఈ మూడు రోజులు నేను తీవ్రంగా ఇబ్బంది పడ్డాను. ‘ఫోన్ పే, గూగుల్‌పేతో పాటు ఆన్లైన్ బ్యాంకింగ్ మొత్తం స్తంభించిపోయింది. దీంతో నేను చాలా ఇబ్బందులు పడ్డాను’అని వాపోయాడు. ఎక్కడో ఉండి తమ ఫోన్‌ను ఆపరేట్ చేస్తున్నారంటే.. ఇది చట్ట విరుద్ధమే కదా అని ఆవేదన వ్యక్తం చేశాడు. లాక్డౌన్ కారణంగా రెండు, మూడు నెలలుగా ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న వేళ ఫోన్లు లాక్ చేయడం అన్యాయమని వినియోగదారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ విషయంపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను సంప్రదించగా.. ఫోన్లు లాక్ అయ్యాయన్న ఫిర్యాదులు తమ వద్దకు రాలేదని సమాధానమిచ్చారు. ఈ చర్య ముమ్మాటికీ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని, తీవ్రమైన విషయంగా పరిగణించాలని ప్రముఖ సైబర్ అనలిస్ట్ అనిల్ రాచమల్ల అన్నారు. చదవండి: రేషన్ కార్డుకు రేటు! -
మైక్రో ఫైనాన్స్ యాప్స్ గుట్టురట్టు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పోలీసులు.. మైక్రో ఫైనాన్స్ యాప్స్ గుట్టురట్టు చేశారు. దేశవ్యాప్తంగా మూడు చోట్ల హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఢిల్లీలోని గుర్గావ్ కేంద్రంగా మైక్రో ఫైనాన్స్ యాప్స్ నడుస్తున్నాయి. ఢిల్లీతో పాటు హైదరాబాద్‌లో రెండు చోట్ల తనిఖీలు చేస్తున్నారు. మూడు చోట్ల మైక్రో ఫైనాన్స్ యాప్స్ కాల్ సెంటర్లను గుర్తించారు. (చదవండి: ఆ యాప్‌ల ద్వారా రుణాలొద్దు: డీజీపీ) ఢిల్లీలో 400, హైదరాబాద్‌లో 700 మంది కాల్ సెంటర్ల ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ యాప్స్ వెనకాల చైనా కంపెనీలు ఉన్నట్లు తెలిసింది. బేగంపేటలోని మైక్రో ఫైనాన్స్ కంపెనీలో సోదాలు కొనసాగుతున్నాయి. పంజాగుట్టలోని మరో కాల్సెంటర్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గుర్గావ్ కేంద్రంగా మైక్రో ఫైనాన్స్ వేధింపులు సాగుతున్నాయి. (చదవండి: సిటీలో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లు..) -
వొడాఫోన్ ఐడియా- క్రెడిట్‌యాక్సెస్ జోరు
టెక్ దిగ్గజాలలో అమ్మకాలు వెల్లువెత్తడంతో గురువారం యూఎస్ స్టాక్ మార్కెట్లు పతనంకాగా.. దేశీ స్టాక్ మార్కెట్లు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. ప్రధాన రంగాలన్నిటా అమ్మకాలు తలెత్తడంతో ప్రస్తుతం సెన్సెక్స్ 450 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్లు చొప్పున జారాయి. ఈ నేపథ్యంలోనూ నిధుల సమీకరణ ప్రతిపాదనల కారణంగా మొబైల్ సేవల కంపెనీ వొడాఫోన్ ఐడియా, మైక్రోఫైనాన్స్ కంపెనీ క్రెడిట్‌యాక్సెస్ గ్రామీణ్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. వొడాఫోన్ ఐడియా సుమారు రూ. 50,000 కోట్లమేర ఏజీఆర్ బకాయిలను చెల్లించవలసి ఉన్న మొబైల్ సేవల దిగ్గజం వొడాఫోన్ ఐడియా నిధుల సమీకరణ ప్రణాళికలను ప్రతిపాదించింది. ఈ అంశంపై చర్చించేందుకు బోర్డు నేడు(4న) సమావేశంకానున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. మరోపక్క కంపెనీలో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, యూఎస్ వైర్లెస్ దిగ్గజం వెరిజాన్ కమ్యూనికేషన్స్ 400 కోట్ల డాలర్లు(రూ.29,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు తొలుత ఎన్ఎస్ఈలో 7 శాతం జంప్‌చేసింది. రూ. 13.5ను తాకింది. ఇది 15 నెలల గరిష్టంకాగా.. ప్రస్తుతం 1.2 శాతం లాభంతో రూ, 12.70 వద్ద ట్రేడవుతోంది. సెప్టెంబర్ 1న నమోదైన ఇంట్రాడే కనిష్టం రూ. 7.69 నుంచి చూస్తే.. మూడు రోజుల్లోనే ఈ షేరు 75 శాతం ర్యాలీ చేయడం విశేషం! క్రెడిట్‌యాక్సెస్ గ్రామీణ్ ప్రయివేట్ ప్లేస్మెంట్ లేదా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ తదితర మార్గాలలో రూ. 1,000 కోట్లవరకూ సమీకరించేందుకు గురువారం సమావేశమైన బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు క్రెడిట్‌యాక్సెస్ గ్రామీణ్ తాజాగా వెల్లడించింది. దీంతో ఈ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 9 శాతం దూసుకెళ్లి రూ. 749ను తాకింది. ప్రస్తుతం కాస్త మందగించి 6 శాతం లాభంతో రూ. 727 వద్ద ట్రేడవుతోంది. -
మళ్లీ మైక్రో పడగ
మైక్రో ఫైనాన్స కంపెనీలు మళ్లీ గ్రామాల్లోకి అడుగుపెడుతున్నాయి. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కొన్నాళ్లపాటు వెనక్కితగ్గిన పలు సంస్థలు అధిక వడ్డీల వసూళ్ల పర్వానికి మరోమారు తెరలేపాయి. గతంలో పేదలను పీల్చిపిప్పిచేసిన మైక్రో సంస్థల నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు.. కంపెనీల చర్యలను ఏమాత్రం అడ్డుకోలేకపోతున్నాయి. రుణమాఫీ విషయంలో నెలకొన్న సందిగ్ధాన్ని ఆసరా చేసుకుంటున్న మైక్రో సంస్థలు.. గతంలో తీసుకున్న అప్పును వడ్డీతోసహా చెల్లిస్తే అంతకు రెట్టింపు రుణమిస్తామని ఊరిస్తున్నాయి. దీంతో రైతులు, మహిళలు మళ్లీ మైక్రో సంస్థలవైపు చూస్తున్నారు. ఇక అప్పులు చెల్లించే స్థోమతలేదని, ఇప్పుడు బకాయి చెల్లించలేమని చెబుతున్న వారికి ఏకంగా నోటీసులు జారీ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నాయి. ⇒ వేధింపులు ప్రారంభించిన ఫైనాన్స కంపెనీలు ⇒ బకాయిదారులకు లీగల్ నోటీసులు ⇒ చెల్లించండి.. లేదంటే కోర్టుకేనంటూ బెదిరింపులు ⇒ ఇష్టారాజ్యంగా వడ్డీల వసూళ్లు ఫలితమివ్వని ప్రభుత్వ కమిటీలు ⇒ ఒక్క పరిగి నియోజకవర్గం పరిధిలోనే రూ.20 కోట్ల మైక్రో రుణాలు పరిగి: జిల్లాలో మైక్రో కంపెనీలు తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నాయి. మహిళలకు అప్పులిచ్చి అధిక వడ్డీలను వసూలు చేస్తున్న పలు కంపెనీల వేధింపులు అధికం కావడంతో గతంలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం గ్రామాల్లో కొన్ని కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కొన్నాళ్లపాటు వెనక్కితగ్గినట్టు ఉన్న కంపెనీలు ఇప్పుడు మళ్లీ గ్రామాల్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం రుణమాఫీ విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న సంస్థలు పాత అప్పులు చెల్లిస్తే అంతకంటే ఎక్కువ రుణాలిస్తామని నమ్మబలుకుతున్నాయి. ఇచ్చిన వారి నుంచి డబ్బులు తీసుకోవడం, ఇవ్వనివారికి లీగల్ నోటీసులు జారీ చేయడం వంటి చర్యలు ప్రారంభించాయి. ఇందులో భాగంగానే ఇటీవల పరిగి మండలం సోండేపూర్ తండాకు చెందిన కొందరికి నోటీసులు ఇవ్వడంతోపాటు ఓ వ్యక్తిపై కేసు కూడా నమోదు చేశారు. తాజాగా పరిగి మండల పరిధిలోని పలువురికి కోర్టు నోటీసులు పంపించారు. కోర్టుకీడుస్తామంటూ బెదిరింపులు.. తీసుకున్న డబ్బులను వడ్డీలతోసహా వెంటనే చెల్లించాలని ైరె తులు, మహిళలకు మైక్రో సంస్థలు కోర్టు నోటీసులు పంపుతున్నాయి. డబ్బులు చెల్లించకుంటే కోర్టుకు హాజరుకావాల్సి వస్తుందని ఆయా కంపెనీల సిబ్బంది బెదిరిస్తున్నారు. మైక్రో సంస్థలు వసూలు చేస్తున్న వడ్డీల ప్రకారం.. ఇచ్చిన అసలు రెండేళ్లలోనే డబుల్ అవుతోందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిగి మండలంలోని నస్కల్ గ్రామానికి చెందిన బేగరి అంజయ్య మూడేళ్ల క్రితం ఓ మైక్రో ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.10 వేలు అప్పుతీసుకున్నాడు. ఆ వెంటనే రూ. రెండు వేలు చెల్లించాడు. మిగిలిన రూ.8 వేలకు వడ్డీతో ఇప్పుడది రెట్టింపు అయిందని, వెంటనే చె ల్లించాలని నోటీసులు పంపారు. అదే గ్రామానికి చెందిన బేగరి నారాయణ, బైండ్ల నర్సింహులు తదితరులకు సైతం ఇలాగే నోటీసులు అందాయి. ఒక్క నియోజకవర్గంలోనే రూ.20 కోట్ల రుణాలు.. పరిగి నియోజకవర్గ పరిధిలోని పూడూరు, పరిగి, దోమ, కుల్కచర్ల, గండేడ్ మండలాల్లో ఎల్అండ్టీ, ఎస్కేఎస్, స్పందన తదితర సంస్థలు సుమారు రూ.20 కోట్ల మేర రుణాలిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా మైక్రో సంస్థలు 24 శాతం వడ్డీ అని చెబుతూ 45 నుంచి 55 శాతం వడ్డీ వసూలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఆదుకోని ఆర్థిక చేకూర్పు.. మహిళల అవసరాలు పూర్తిస్థాయిలో తీర్చి ఇతర ప్రైవేటు అప్పుల నుంచి విముక్తి కలిగించడంలో భాగంగా గతంలో ప్రభుత్వం ఐకేపీ ద్వారా ప్రారంభించిన సంపూర్ణ ఆర్థిక చేకూర్పు పథకం మహిళలన్ని ఆదుకోవడంలో విఫలమైంది. 10 నుంచి 15 మంది ఉన్న ఒక్కో సంఘానికి, విడివిడిగా ఒక్కో మహిళాకు ఏఏ అవసరాలున్నాయన్న దానిపై అధ్యయనం చేసి అవసరమైన మేరకు రుణాలివ్వాలని సంపూర్ణ ఆర్థిక చేకూర్పు పథకాన్ని తీసుకువచ్చారు. ఇందులో భాగంగా ఐకేపీ సిబ్బందితో ప్రణాళిక తయారు చేసింది. కానీ ఆ ప్రణాళికను ఇప్పటివరకు సమర్థవంతంగా అమలు చేయకపోవడంతో మహిళా సంఘాలు మైక్రో సంస్థల్ని ఆశ్రయించక తప్పడం లేదు.