మైక్రో ఫైనాన్స్ సంస్థలకు ‘రుణ పూచీకత్తు’ మార్గదర్శకాలను కఠినతరం చేసినట్లు స్వీయ నియంత్రణ సంస్థ–మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్‌వర్క్ (ఎంఫిన్) ప్రకటించింది. మైక్రో ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పు తీసుకునేవారికి భారం పెరిగిపోతోందని, దీనితో తీసుకున్న రుణాలను వారు తిరిగి చెల్లించలేకపోతున్నారన్న ఆందోళనల నేపథ్యంలో ఎంఫిన్ తాజా నిర్ణయం తీసుకుంది.
రుణాల్లో నెలకొన్న ప్రస్తుత సవాళ్ల పరిష్కారానికి తాజా చర్య దోహదపడుతుందని ఎంఫిన్ తెలిపింది. బుల్లెట్ రీపేమెంట్ (రుణ వ్యవధిలో అప్పటికి చెల్లింపులు జరిపింది పోగా మిగిలిన మొత్తాన్ని ఒకేసారి చెల్లిచడం), చెల్లించని ఈఎంఐల గురించి ప్రస్తుతం మైక్రో ఫైనాన్స్ సంస్థల వద్ద తగిన సమాచారం అందడంలేదని ఎంఫిన్ తెలిపింది. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రస్తుత మార్గదర్శకాలు దోహపదడతాయని ప్రకటన వివరించింది. అయితే మార్గదర్శకాలు ఏమిటన్నది నిర్ధిష్టంగా తెలియరాలేదు.
ఇదీ చదవండి: తగ్గిద్దామా? వద్దా?
ఇక ఒకే రుణగ్రహీత ఐదేసి రుణాలను తీసుకున్న పలు సందర్భాలూ వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వ్యవహారాలు ఆందోళనను సృష్టిస్తున్నాయి. ఒక రుణ గ్రహీత నెలవారీ సంపాదన ఎంత? చెల్లింపుల సామర్థ్యం ఏమిటి? అనే అంశాలపైనా మైక్రో ఫైనాన్స్ సంస్థలకు తగిన సమాచారం లేకపోవడం సమస్యకు మరో కారణం. ఆయా అంశాలు మైక్రో ఫైనాన్స్ సంస్థల రుణ నాణ్యతపై ప్రభావం చూపుతున్నాయి. సంబంధిత వర్గాల నుంచి ఆరు నెలలకు పైగా అందిన సమాచారం మేరకు 12 కోట్ల రుణ రికార్డులను విశ్లేషించిన తర్వాత కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే మార్గదర్శకాలపై త్వరలో పూర్తి సమాచారం వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment