మైక్రో ఫైనాన్స్ కంపెనీలు(సూక్ష్మ రుణ సంస్థలు) ఒక వ్యక్తికి రూ.2 లక్షలకు మించి అప్పు ఇవ్వకూడదని ఎంఫిన్ (మైక్రో-ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్‌వర్క్) ఆదేశించింది. అదికూడా గరిష్ఠంగా నాలుగు సంస్థలు మాత్రమే ఈ మొత్తాన్ని సమకూర్చాలని స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇష్టానుసారంగా రుణాలివ్వడంతో సాధారణ ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నట్లు ఎంఫిన్ పేర్కొంది.
సూక్ష్మ రుణ సంస్థలు ఇష్టారాజ్యంగా రుణాలు జారీ చేయడం వల్ల, ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దాంతో మైక్రో ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ వద్ద మొండి బకాయిలు పెరుకుపోతున్నాయి. మార్కెట్‌లోని బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాలు రానివారు, కొన్ని కారణాల వల్ల బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం కుదరని వారు సూక్ష్మ రుణ సంస్థలను సంప్రదిస్తున్నారు. దాంతో అధికవడ్డీకి ఆశపడి ఆయా సంస్థలు ప్రజలకు రుణాలిస్తున్నాయి. కానీ వాటిని తిరిగి చెల్లించే క్రమంలో సమస్యలు ఎదురవుతున్నాయి. దానివల్ల ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దానికితోడు సంస్థలు ఇచ్చిన అప్పు రికవరీ శాతం తగ్గిపోతుంది. ఈ వ్యవహారాన్ని గుర్తించిన ఎంఫిన్ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది.
సూక్ష్మ రుణ సంస్థలకు నియంత్రణ వ్యవస్థగా ఎంఫిన్ వ్యవహరిస్తోంది. ఎంఫిన్ తెలిపిన వివరాల ప్రకారం..మైక్రో ఫైనాన్స్ కంపెనీలు ఒక వ్యక్తికి గరిష్ఠంగా రూ.2 లక్షలు మాత్రమే అప్పుగా ఇవ్వాలి. ఈ మొత్తాన్ని నాలుగు సంస్థల వరకు మాత్రమే సమకూర్చాలని తెలిపింది.
ఇదీ చదవండి: గిఫ్ట్‌సిటీలో యూరోపియన్ బ్యాంక్ ప్రారంభం
సూక్ష్మ రుణ సంస్థల వినియోగదార్లుగా దాదాపు రూ.3 లక్షల వార్షికాదాయం గల కుటుంబాలే అధికంగా ఉన్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో ఈ రంగం ఎంతగానో విస్తరించింది. ప్రస్తుతం సూక్ష్మ రుణాల పరిశ్రమకు 7.8 కోట్ల మంది వినియోగదార్లు ఉన్నారు. వీరికి జారీ చేసిన రుణాల మొత్తం రూ.4.33 లక్షల కోట్లకు పైగా ఉందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment