సిటీ గ్రూప్ ఇండియా రిటైల్ బిజినెస్‌లను యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసే ఒప్పందం తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. సిటీ బ్యాంక్ రిటైల్ బిజినెస్ వాల్యుయేషన్ 2.5 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఈ ఒప్పందం గురించి ఇరు సంస్థలు త్వరలోనే ప్రకటించనున్నాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ ఒప్పందాన్ని కూడా ఆమోదించనుంది.
సిటీ గ్రూప్ ఇండియా రిటైల్ బిజినెస్‌లో పనిచేస్తోన్న ఉద్యోగులకు యాక్సిస్ బ్యాంకు ఉద్యోగ భద్రతను కల్పించనుంది. ఈ విలీనం సుమారు ఆరు నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. అన్ని ఒప్పందాల మాదిరిగానే ఒప్పందం ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కాగా ఈ వ్యవహారంపై యాక్సిస్ బ్యాంక్, సిటీ గ్రూప్ ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.
భారత్ నుంచి ఎగ్జిట్..!
గ్లోబల్ స్ట్రాటజీలో భాగంగా దేశంలోని రిటైల్ బ్యాంకింగ్ నుంచి ఎగ్జిట్ అవుతామని గత ఏడాది ఏప్రిల్‌లో సిటీ గ్రూప్ ప్రకటించింది. రిటైల్ బిజినెస్‌లలో క్రెడిట్ కార్డులు, రిటైల్ బ్యాంకింగ్ సర్వీస్‌లు, హోమ్ లోన్స్, వెల్త్ మేనేజ్‌మెంట్ వంటి సెగ్మెంట్లు కలిసి ఉంటాయి. సిటీ బ్యాంక్‌కు దేశంలో 35 బ్రాంచులు ఉన్నాయి. మొత్తం 4 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. సిటీ బ్యాంక్ రిటైల్ బిజినెస్ వాల్యుయేషన్‌ను లెక్కించేటప్పుడు డిపాజిట్లు, కస్టమర్లు, అసెట్స్, లయబిలిటీస్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ డీల్ పూర్తయితే యాక్సిస్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ అమాంతం పెరుగుతుందని ఎనలిస్టులు పేర్కొన్నారు. కాగా, సిటీ గ్రూప్ 1902 లో ఇండియాలోకి ఎంటర్ అయ్యింది. 1985 లో రిటైల్ బ్యాంకింగ్ బిజినెస్‌ను స్టార్ట్ చేసింది. ఐతే రిటైల్ బిజినెస్‌ను అమ్మేసినా, ఇన్‌స్టిట్యూషనల్ బ్యాంకింగ్ బిజినెస్‌లో సిటీ గ్రూప్ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: గత ఏడాది భారత్‌కు గుడ్‌బై..! ఇప్పుడు మళ్లీ రిఎంట్రీ ఇవ్వనున్న అమెరికన్ దిగ్గజ కంపెనీ..!
Comments
Please login to add a commentAdd a comment