సాక్షి,ముంబై: కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రెండు దిగ్గజ బ్యాంకులకు భారీ షాక్ ఇచ్చింది. చట్టపరమైన నిబంధనలను పాటించని కారణంగా ప్రయివేటు బ్యాంకు దిగ్గజం యాక్సిస్ బ్యాంకుతోపాటు, ముఖ‍్య ప్రభుత్వ రంగు బ్యాంకులలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకునకు (ఐవోబీ) భారీ జరిమానా విధించింది.
కెవైసీ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఐవోబీకి 2కోట్ల రూపాయలు పెనాల్టీ విధించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అంతర్గత తనిఖీ నివేదిక సహా పత్రాల పరిశీలన అనంతరం ఆర్‌బీఐ జారీచేసిన ఉత్తర్వులను ఉల్లఘించినట్టు తేలిందని ఆర్బిఐ పేర్కొంది. అలాగే ఎన్‌పీఏల అంచనాలకు సంబంధించిన యాక్సిస్ బ్యాంకు ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లఘించిందని ఆర్‌బీఐ ప్రకటించింది. ఇందుకు గాను యాక్సిస్ బ్యాంకునకు రూ. 3కోట్ల జరిమానా విధించినట్టు ఒక ప్రకటనలోతెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment