యాక్సిస్ బ్యాంక్ వడ్డీరేట్లు కోత
యాక్సిస్ బ్యాంక్ వడ్డీరేట్లు కోత
Published Thu, May 18 2017 1:01 PM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM
దేశంలోనే మూడో అతిపెద్ద ప్రైవేట్ దిగ్గజ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకు వడ్డీరేట్లపై గుడ్ న్యూస్ చెప్పింది. గృహరుణాలపై వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అఫార్డబుల్ హౌజింగ్ ఫైనాన్స్ ను అందించే లక్ష్యంతో రేట్లను సమీక్షించినట్టు బ్యాంకు చెప్పింది. దీంతో 30 లక్షల వరకున్న శాలరీ సెగ్మెంట్లో గృహరుణాలపై వడ్డీరేటు 8.35 శాతానికి దిగొచ్చింది.
ఇండస్ట్రీలోనే ఇవే అత్యంత కనిష్టస్థాయి. 2017 మే 16 నుంచి ఈ సమీక్షించిన వడ్డీరేట్లు అందుబాటులోకి వస్తున్నాయని బ్యాంకు చెప్పింది. ఇప్పటివరకు 75 లక్షల వరకున్న గృహరుణాలపై 8.65 శాతం వడ్డీరేట్లున్నాయి. ప్రస్తుతం ఈ వడ్డీరేట్లను 8.35శాతానికి తగ్గించింది. ఈ బ్యాంకు ప్రత్యర్థులు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు కూడా గతవారంలోనే తమ వడ్డీరేట్లను తగ్గించాయి.
యాక్సిస్ బ్యాంకు రుణాలు సమీక్షించిన వడ్డీరేట్లు
సెగ్మెంట్ 30లక్షల వరకు 30-75 లక్షలు 75 లక్షలకు పైబడి
శాలరీ 8.35శాతం 8.65 శాతం 8.70శాతం
సెల్ఫ్ ఎంప్లాయిడ్ 8.40శాతం 8.70 శాతం 8.75శాతం
Advertisement
Advertisement