
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీల)పై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన వడ్డీ రేట్లు మార్చి10 నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఇప్పుడు మనం యాక్సిస్ బ్యాంక్ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఎంత పెంచిందో తెలుసుకుందాం.
యాక్సిస్ బ్యాంక్ అందిస్తున్న వడ్డీ రేట్ల ఇలా ఉన్నాయి
►7 రోజుల నుంచి 45 రోజుల టెన్యూర్ కాలానికి ఎఫ్‌డీ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 3.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
►46 రోజుల నుంచి 60 రోజుల టెన్యూర్ కాలానికి ఎఫ్‌డీ డిపాజిట్లపై 4.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది
►61 రోజుల నుంచి 3 నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్‌డీ డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది
►3 నెలల నుంచి 6 నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్‌డీ డిపాజిట్లపై 4.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
► 6 నెలల నుంచి 9 నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్‌డీ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
► 9 నెలల నుంచి ఏడాది నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్‌డీ డిపాజిట్లపై 6.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
► ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం 24 రోజుల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీ డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీ రేటును
అందిస్తుంది.
► ఒక సంవత్సరం 25 రోజుల నుంచి 13 నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్‌డీ డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీ రేటును
అందిస్తుంది.
►13 నెలల నుంచి 2 సంవత్సరాల నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్‌డీ డిపాజిట్లపై 7.15 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
► 2 నుంచి 30 నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్‌డీ డిపాజిట్లపై 7.26 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
►30 నెలల నుంచి 10 సంవత్సరాల టెన్యూర్ కాలానికి ఎఫ్‌డీ డిపాజిట్లపై 7.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment