మాంచి జోష్‌తో మార్కెట్లు ఎంట్రీ
Published Thu, Jun 29 2017 9:40 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM
ముంబై : జూన్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ గడువు నేటితో ముగుస్తుండగా, మార్కెట్లు మంచి జోష్‌తో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పైకి ఎగిసి, 31,034 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 66.35 పాయింట్ల లాభంలో 9,550కి పైన లాభాలు పండిస్తోంది. ప్రారంభ ట్రేడింగ్‌లో యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస, టాటా మోటార్స్ డీవీఆర్, టాటా స్టీల్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, ఐషర్ మోటార్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎల్ అండ్ టీలు ఎక్కువగా లాభాలు పండించాయి. బ్యాంకు నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా ఎగిసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా 100 పాయింట్లు పైకి జంప్ చేసింది.
గోవా కార్బన్, అమ్టెక్ ఆటో, మెటాలిస్ట్ ఫర్గింగ్స్, జేపీ ఇన్ఫ్రాటెక్, జయప్రకాశ్ అసోసియేట్స్, మైండ్ ట్రీ, హెక్సావేర్, జెట్ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్, శ్రీరేణుక, బజాజ్ హిందూస్తాన్, ఇండియా సిమెంట్స్ 1-5 శాతం ర్యాలీ జరిపాయి. ఇదే సమయంలో ఆర్సీఎఫ్ 5 శాతం మేర పడిపోయింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 64.44 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా 7 రూపాయల లాభంతో 28,560 వద్ద నడుస్తున్నాయి.
Advertisement