ప్రతికూల పవనాలు: నష్టాల్లో మార్కెట్లు
Published Mon, Dec 19 2016 9:42 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM
జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు వీస్తుండటంతో సోమవారం ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 87.04 పాయింట్ల నష్టంలో 26402 వద్ద, నిఫ్టీ 28.40 పాయింట్లు పడిపోయి 8111 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, హెల్త్కేర్, ఎఫ్‌ఎమ్సీజీ స్టాక్స్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయని విశ్లేషకులు చెప్పారు. హెచ్డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఏషియన్ పేయింట్స్, సన్ ఫార్మా షేర్లు 0.4 నుంచి 1 శాతం పడిపోయాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోల్ ఇండియా, భారతీలు లాభాల్లో నడుస్తున్నాయి. అటు శుక్రవారం ముగింపుకు 5 పైసల నష్టంతో రూపాయి విలువ 67.81గా ప్రారంభమైంది. నిరంతరాయంగా ఎఫ్ఐఐ తరలిపోవడం, బలమైన డాలర్ ఇండెక్స్ వల్ల రూపాయిపై ఒత్తిడి నెలకొంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.132 బలపడి రూ.27,120గా నమోదవుతోంది. మరోవైపు ఆసియన్ స్టాక్స్ మిశ్రమంగా ట్రేడ్ అవుతోంది.
Advertisement
Advertisement