9900 కిందకి నిఫ్టీ ఢమాల్
Published Thu, Aug 10 2017 9:47 AM | Last Updated on Mon, Sep 11 2017 11:46 PM
మార్కెట్లు వరుసగా నాలుగో రోజు తీవ్ర నష్టాలు పాలవుతున్నాయి. ఒకవైపు షెల్ కంపెనీలపై సెబీ తీసుకున్న నిర్ణయం, మరోవైపు గ్లోబల్ మార్కెట్ల ఎఫెక్ట్‌తో గురువారం ట్రేడింగ్‌లోనూ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.. సెన్సెక్స్ 126 పాయింట్ల నష్టంలో 31,671 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 43 పాయింట్ల లాస్‌లో 9900 మార్కు కిందకి పడిపోయింది. టాటా మోటార్స్ బుధవారం ప్రకటించిన ఫలితాలు అంచనాలు తప్పడంతో, కంపెనీ షేర్ 4 శాతం కంటే ఎక్కువగా కిందకి దిగజారింది. ఐషర్ మోటార్స్, ఓఎన్‌జీసీ, టాటా పవర్, ఎస్‌బీఐలు నష్టాలు పాలవుతున్నాయి. బ్యాంకు నిఫ్టీని ఇంకా నష్టాల ధోరణి వీడటం లేదు. దీంతో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 0.4 శాతం కిందకి పడిపోయింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ కూడా 0.7 శాతం కోల్పోయింది.
అరబిందో ఫార్మా 4 శాతం ర్యాలీ జరుపుతోంది. 331 ట్రేడింగ్ కంపెనీలను ట్రేడింగ్‌కు దూరంచేస్తూ సెబీ తీసుకున్న చర్యతో, స్టాక్ ఇండెక్స్‌లు నష్టాల బాట పట్టిన సంగతి తెలిసిందే. సెబీకి తోడు గ్లోబల్‌మార్కెట్ల నుంచి బలహీనమైన సంకేతాలు రావడం, మార్కెట్లను దెబ్బతీస్తోంది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా 39 పైసలు పడిపోయి 64.03 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా 477 రూపాయలు బలపడి 28,856 వద్ద ట్రేడవుతున్నాయి.
Advertisement