నష్టాలకు బ్రేక్.. ప్రారంభం అదుర్స్
Published Wed, Nov 16 2016 9:40 AM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM
న్యూఢ్లిల్లీ : తీవ్ర అమ్మకాల ఒత్తిడితో రెండు వరుస ట్రేడింగ్ సెషన్లో 1200 పాయింట్లకు పైగా కోల్పోయిన మార్కెట్లు, బుధవారం ట్రేడింగ్లో సూపర్ స్ట్రాంగ్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ప్రారంభంలో 300 పాయింట్లకు పైగా ర్యాలీ జరిపింది. నిఫ్టీ సైతం 8200 స్థాయిని పునరుద్ధరించుకుని ట్రేడ్ అయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 146.10 పాయింట్ల లాభంలో 26,450.73వద్ద, నిఫ్టీ 38.85 పాయింట్ల లాభంలో 8,147.30 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ప్రారంభంలో ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్లు సెన్సెక్స్లో భారీ లాభాలను గండించాయి. ఎస్ అండ్ పీ బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.1 శాతం, బీఎస్ఈ ఎస్ అండ్ పీ స్మాల్క్యాప్ ఇండెక్స్ 1.4 శాతం దూకుడుగా ఉన్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ కూడా స్వల్పంగా లాభపడింది. 67.74గా ముగిసిన రూపాయి, 67.68గా ప్రారంభమైంది. అటు గ్లోబల్ మార్కెట్లు ట్రంప్ ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ట్రంప్ విధానాలతో అక్కడ ద్రవ్యోల్బణం బలపడిందనే సంకేతాలతో డాలర్ 11 నెలల గరిష్టానికి నమోదవుతోంది. ఆయిల్ ధరలు పునరుద్ధరించుకున్నాయి.
Advertisement
Advertisement