బ్యాంక్ స్టాక్స్ ర్యాలీ: లాభాల్లో మార్కెట్లు
Published Tue, Mar 28 2017 3:58 PM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కోలుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళనల నుంచి ఆసియన్ మార్కెట్లు తేరుకోవడంతో పాటు బ్యాంకు స్టాక్స్ ర్యాలీతో దేశీయ స్టాక్ సూచీల సెంటిమెంట్ మెరుగుపడి, లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 172.37 పాయింట్ల లాభంలో 29,409 వద్ద, 55.60 పాయింట్ల లాభంలో 9,100 వద్ద నిఫ్టీ క్లోజయ్యాయి. బ్యాంకు స్టాక్స్ ర్యాలీ జరుపడంతో మార్కెట్లు లాభాల్లో నడిచినట్టు విశ్లేషకులు చెప్పారు. యాక్సిస్ బ్యాంకు 3 శాతం, హెచ్డీఎఫ్సీ 2 శాతం లాభపడ్డాయి.
యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీలతో పాటు ఐషర్ మోటార్స్ నేటి ట్రేడింగ్ లో టాప్ గెయినర్గా చోటు దక్కించుకుంది. ఓఎన్జీసీ, లుపిన్, టెక్ మహింద్రా, కొటక్ మహింద్రా బ్యాంకు టాప్ లూజర్లుగా నష్టాలు గడించాయి. మైనార్టి స్టాక్ ను అమ్మడం ద్వారా ఫండ్స్ ను పెంచుకుంటుందనే వార్తల నేపథ్యంలో జెట్ ఎయిర్ వేస్ స్టాక్ చివరి గంట ట్రేడింగ్ లో 2 శాతం మేర పైకి ఎగిసింది. ఈ ఫండ్స్ ను రుణాలు తగ్గించుకోవడానికి కంపెనీ వాడనుందని తెలిసింది. 2016 డిసెంబర్ నాటిని జెట్ ఎయిర్ వేస్ నికర రుణం రూ.7,423 కోట్లగా ఉంది.
Advertisement
Advertisement