లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
Published Thu, Oct 6 2016 9:55 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
ముంబై : లాభాల స్వీకరణతో నిన్నటి ట్రేడింగ్లో నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్లో లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 97.21 పాయింట్ల లాభంలో 28,318వద్ద, నిఫ్టీ 27.85 పాయింట్ల లాభంలో 8,771 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో బ్యాంకింగ్,ఐటీ, రియల్ ఎస్టేట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. దీంతో బ్యాంకు నిఫ్లీ 0.42 శాతం, ఎన్ఎస్ఈలో పీఎస్యూ బ్యాంకు ఇండెక్స్ 0.6 శాతం పడిపోయాయి. ఇదే సమయంలో ఆయిల్, గ్యాస్ షేర్లలో కొనుగోలు మద్దతు కొనసాగింది. బ్యాంకింగ్ కంపెనీల్లో యాక్సిస్ బ్యాంకు 2.6 శాతం నష్టపోతూ టాప్ లూజర్గా ట్రేడ్ అవుతోంది.
రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, అరబిందోలు టాప్ గెయినర్లుగా లాభాలు పండిస్తుండగా.. యాక్సిస్ బ్యాంకు, సిప్లా, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సెన్సెక్స్ సూచీలో నష్టాలు గడిస్తున్నాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ కొంత బలహీనంగా ప్రారంభమైంది. బుధవారం ముగింపుకు ఆరు పైసల నష్టంతో 66.56గా ఓపెన్ అయింది. డిసెంబర్లో ఫెడ్ రేట్ పెంపు అంచనాలు పెరగడంతో ఇతర కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ బలపడుతూ వస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు డాలర్ బలపడుతుండటంతో బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 124 రూపాయల నష్టంతో రూ.29,923గా నమోదవుతోంది.
Advertisement
Advertisement