సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. సరికొత్త గరిష్టాలను రికార్డ్ చేస్తూ ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తున్నాయి. సెన్సెక్స్ 519 పాయింట్లు ఎగిసి 65,239 వద్ద, నిఫ్టీ 138 పాయింట్ల లాభంతో 19,327 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లాభాలు మార్కెట్‌కు మద్దతిస్తున్నాయి.
ఇదీ చదవండి: కొనుగోలుదారులకు టాటా మోటార్స్ షాక్
అటు ఆటో రంగ షేర్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ లాభాల్లో కొనసాగుతోంది. ఐటీ, ఫార్మా నష్టపోతున్నాయి. గ్రాసిం, బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, ఎస్బీఐ, హిందాల్కొ, విప్రో, టాటా స్టీల్, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఎల్ టి, అపోలో హాస్పిటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్ టాప్ గెయినర్లుగా కొనసాగుతుండగా, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, యూపీఎల్ బ్రిటానియా, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, ఎస్బీఐ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, మారుతీ, నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment