సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు బుల్ రన్‌ను కొనసాగించాయి. ద్వారా మరోసారి రికార్డ్ క్లోజింగ్‌ను నమోదు చేశాయి. సెన్సెక్స్ 486 పాయింట్లు లేదా 0.75 శాతం లాభపడి 65,205 వద్ద స్థిరపడింది, నిఫ్టీ 133.50 పాయింట్లు లేదా 0.70 శాతం పెరిగి 19,322.55 వద్ద ముగిసాయి. ఇంట్రాడే ట్రేడ్‌లో సెన్సెక్స్ తాజా రికార్డు గరిష్ట స్థాయి 65,300ని తాకగా, నిఫ్టీ 19,345 వద్ద గరిష్ట స్థాయిని నమోదు చేసింది.
బీఎస్‌సీ లిస్టెడ్ సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్‌లో 296.5 లక్షల కోట్ల నుంచి రూ.298.2 లక్షల కోట్లకు పెరిగింది. ఫలితంగా పెట్టుబడిదారులు ఒక్క సెషన్‌లో రూ.1.7 లక్షల కోట్ల మేర లాభపడ్డారు.
జూన్ నెల జీఎస్‌టి వసూళ్లు పటిష్టంగా ఉండటంతో మార్కెట్ రికార్డు-బ్రేకింగ్‌కి స్థాయికి చేరిందని మార్కెట్ పండితులు భావిస్తున్నారు. అలాగే గత కొన్ని రోజులుగా దేశంలోని చాలా ప్రాంతాలను రుతుపవనాలపై అందిన శుభవార్త కూడా పెట్టుబడిదారులకు ఉత్సాహం వచ్చింది. దీనికి తోడు బలమైన విదేశీ నిధుల ప్రవాహంతో ర్యాలీ కొనసాగుతోందని అంచనా.
నిఫ్టీ పీఎస్‌యు బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 4 శాతం , నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ ఒక్కొక్కటి 2 శాతానికి పైగా లాభపడింది. అలాగే మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎమ్‌సిజి సూచీలు ఒక్కొక్కటి ఒక్కో శాతం ఎగిసాయి. ఇక ఫార్మా ,హెల్త్‌కేర్ ఐటీ, ఆటో ,కన్స్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్‌లు వెనుకబడ్డాయి.
గ్రాసిమ్ ఇండస్ట్రీస్ , ఐటీసీ ఒక్కొక్కటి 3 శాతానికి పైగా పెరిగింది. ఇంకా బీపీసీఎల్ బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కొక్కటి 2 శాతానికి పైగా లాభపడ్డాయి. హెచ్‌డిఎఫ్‌సి, అల్ట్రాటెక్ సిమెంట్ , ఒఎన్‌జిసి టాప్ విన్నర్స్ లిస్ట్‌లో ఉన్నాయి.
పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా 2 శాతం చొప్పున క్షీణించగా, సిప్లా, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఒక్కో శాతం చొప్పున నష్టపోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా , ఎల్ అండ్‌టీ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment