Record Closing High
-
వరుస రికార్డులు, ఇన్వెస్టర్లకు సుమారు 2 లక్షల కోట్ల లాభాలు
సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు బుల్ రన్‌ను కొనసాగించాయి. ద్వారా మరోసారి రికార్డ్ క్లోజింగ్‌ను నమోదు చేశాయి. సెన్సెక్స్ 486 పాయింట్లు లేదా 0.75 శాతం లాభపడి 65,205 వద్ద స్థిరపడింది, నిఫ్టీ 133.50 పాయింట్లు లేదా 0.70 శాతం పెరిగి 19,322.55 వద్ద ముగిసాయి. ఇంట్రాడే ట్రేడ్‌లో సెన్సెక్స్ తాజా రికార్డు గరిష్ట స్థాయి 65,300ని తాకగా, నిఫ్టీ 19,345 వద్ద గరిష్ట స్థాయిని నమోదు చేసింది. బీఎస్సీ లిస్టెడ్ సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్లో 296.5 లక్షల కోట్ల నుంచి రూ.298.2 లక్షల కోట్లకు పెరిగింది. ఫలితంగా పెట్టుబడిదారులు ఒక్క సెషన్లో రూ.1.7 లక్షల కోట్ల మేర లాభపడ్డారు. జూన్ నెల జీఎస్టి వసూళ్లు పటిష్టంగా ఉండటంతో మార్కెట్ రికార్డు-బ్రేకింగ్‌కి స్థాయికి చేరిందని మార్కెట్ పండితులు భావిస్తున్నారు. అలాగే గత కొన్ని రోజులుగా దేశంలోని చాలా ప్రాంతాలను రుతుపవనాలపై అందిన శుభవార్త కూడా పెట్టుబడిదారులకు ఉత్సాహం వచ్చింది. దీనికి తోడు బలమైన విదేశీ నిధుల ప్రవాహంతో ర్యాలీ కొనసాగుతోందని అంచనా. నిఫ్టీ పీఎస్‌యు బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 4 శాతం , నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ ఒక్కొక్కటి 2 శాతానికి పైగా లాభపడింది. అలాగే మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎమ్‌సిజి సూచీలు ఒక్కొక్కటి ఒక్కో శాతం ఎగిసాయి. ఇక ఫార్మా ,హెల్త్‌కేర్ ఐటీ, ఆటో ,కన్స్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్‌లు వెనుకబడ్డాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ , ఐటీసీ ఒక్కొక్కటి 3 శాతానికి పైగా పెరిగింది. ఇంకా బీపీసీఎల్ బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కొక్కటి 2 శాతానికి పైగా లాభపడ్డాయి. హెచ్‌డిఎఫ్‌సి, అల్ట్రాటెక్ సిమెంట్ , ఒఎన్‌జిసి టాప్ విన్నర్స్ లిస్ట్‌లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా 2 శాతం చొప్పున క్షీణించగా, సిప్లా, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఒక్కో శాతం చొప్పున నష్టపోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా , ఎల్ అండ్‌టీ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. -
రికార్డు క్లోజింగ్, 18400ఎగువకు నిఫ్టీ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభ నష్టాలనుంచి పుంజుకున్న సూచీలు రికార్డు స్థాయిల వద్ద ముగిసాయి. ఒక దశలో సెన్సెక్స్ 62వేల మార్క్‌ను తాకింది. సెన్సెక్స్ 108 పాయింట్ల లాభంతో 61980వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 18409 పద్ద పటిష్టంగా ముగిసాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్లు కనిపించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్ల లాభాలు మార్కట్లకు ఊతమిచ్చాయి. అటు మెటల్ రంగ షేర్లు నష్టపోయాయి. కోటక్ మహీంద్ర, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, హెచ్‌యూఎల్ భారీగా లాభపడ్డాయి. మరోవైపు అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 81.30 వద్ద ముగిసింది. -
ఆరో రోజు హవా : రికార్డు ముగింపు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ వారం ఆరంభంలో కూడా తమ లాభాల హవాను కొనసాగించాయి. వరుసగా ఆరోరోజూ భారీగా లాభపడిన ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు సోమవారం కొత్త గరిష్టాలవద్ద ముగిసాయి. బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రణాళికను అమలుపరిచేందుకు ఆర్బీఐతో కలిసి పనిచేస్తామన్న కేంద్ర ఆర్థిమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల సంకేతాలతో ఆరంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ భారీగా లాభపడ్డాయి. రోజంతా తన జోష్‌ను కొనసాగించిన మార్కెట్ ఒకదశలో 700 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరకు సెన్సెక్స్ 617 పాయింట్ల లాభంతో 51349 వద్ద, నిఫ్టీ 192 పాయింట్ల లాభంతో 15116 వద్ద స్థిరపడ్డాయి. దీంతో తొలిసారిగా సెన్సెక్స్ 51వేల ఎగువన, నిఫ్టీ 15వేల ఎగువన ముగియడం విశేషం. ఐటీ, మెటల్, ఆటో షేర్లు 3 శాతం లాభంతో ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, మీడియా, ప్రైవేట్ బ్యాంక్, రియాల్టీ, బ్యాంక్ సూచీలు 1-2.5 శాతం మధ్య పెరిగాయి. ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, హిందాల్కో, శ్రీ సిమెంట్స్ , బజాజ్ ఫిన్సర్వ్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు బ్రిటానియా,హెచ్‌యూఎల్, కోటక్ మహీంద్రా, దివీస్, బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. -
కొనసాగిన రికార్డుల జోరు
సాక్షి,ముంబై: స్టాక్ మార్కెట్లో రికార్డ్ జోరుకొనసాగింది. కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీలు గురువారం ఇంట్రాడేలో సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. జీవితకాల గరిష్ట స్థాయి 41,163.79 ని తాకింది. అయితే మిడ్ సెషన్‌నుంచి కొంత ఊగిసలాడినా చివరకు సెన్సెక్స్ 110 పాయింట్ల లాభంతో 41,130, నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 12151 వద్ద ముగిసాయి. ఇది రికార్డు ముగింపు కావడం విశేషం. అటు బ్యాంక్ నిఫ్టీ కూడా తొలిసారిగా 32 వేల మార్కును అధిగమించింది. భారతి ఎయిర్టెల్ యూపీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. జీ ఎంటర్టైన్మెంట్ , టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, శాతం, హీరోమోటోకార్ప్, ఒఎన్జీసీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు హెవీ వెయిట్ రిలయన్స్ 10లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను అధిగమించింది. ఈ విషయంలో తొలి భారతీయ కంపెనీగా అవతరించింది. -
మార్కెట్ల దూకుడు : రికార్డు ముగింపు
సాక్షి, ముంబై : రోజంతా దూకుడు మీదున్న దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలను నమోదు చేసాయి. మిడ్‌సెషన్ సమయానికి ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో మార్కెట్లు మరోసారి సరికొత్త రికార్డులను చేరుకున్నాయి. సెన్సెక్స్ 550 పాయింట్లు. నిఫ్టీ 170 పాయింట్లు దూసుకెళ్లాయి. తద్వారా 40,309 వద్ద సెన్సెక్స్, 12,103 పాయింట్ల వద్ద నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలను నెలకొల్పాయి. చివర్లో కొనుగోళ్లు మరింత ఊపందుకోవడంతో ముగింపులోనూ ఇండెక్సులు సరికొత్త రికార్డులను లిఖించాయి. మార్కెట్ చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 40,000, నిఫ్టీ 12,000 పాయింట్ల మైలురాళ్లకు ఎగువన ముగియడం విశేషం. చివరకు సెన్సెక్స్ 553 పాయింట్లు జంప్‌చేసి 40,268 వద్ద, నిఫ్టీ 166 పాయింట్లు ఎగసి 12,089 వద్ద ముగిసింది. మరోసారి కీలక వడ్డీరేటు కోత ఉంటుందన్నఅంచనాలు ఇన్వెస్టర్లు సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. మీడియా మినహా అన్ని సెక్టార్లు లాభాలనార్జించాయి. ముఖ్యంగా ఆటో, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా, రియల్టీ, బ్యాంక్స్ లాభపడ్డాయి. హీరో మోటో, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్, ఐబీ హౌసింగ్, హెచ్‌యూఎల్, టైటన్, కోల్ ఇండియా, ఆర్ఐఎల్, యస్ బ్యాంక్ టాప్ విన్సర్న్‌గా నిలిచాయి. గెయిల్ టెక్ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్టీపీసీ భారతి ఇన్ఫ్రాటెల్ స్వల్పంగా నష్టపోయాయి. -
మరో మైలురాయికి సెన్సెక్స్
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ఉత్సాహంగా ముగిసాయి. అంతేకాదు వరుసగా రెండో రోజు సెన్సెక్స్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. మార్కెట్ చరిత్రలో తొలిసారి 39వేల పాయింట్ల మైలు రాయికి ఎగువన ముగిసింది. అటు నిఫ్టీ కూడా 11700కు పైన ముగియడం విశేషం. సెన్సెక్స్ 185 పాయింట్లు ఎగసి 39,057 వద్ద, నిఫ్టీ సైతం 44 పాయింట్లు జమ చేసుకుని 11,713 వద్ద ముగిసింది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజే సోమవారం రికార్డుల బోణీ కొట్టిన కీలక సూచీలు ఈ రోజు ట్రేడింగ్ ఆరంభంలో కొంత బలహీనంగా ఉన్నా చివరికి లాభాలతో ముగిశాయి. దాదాపు అన్ని రంగాలూ లాభాల నార్జించాయి. ముఖ్యంగా రియల్టీ 2.3 శాతం పుంజుకోగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆటో, ఐటీ ఒక శాతం చొప్పున ఎగశాయి. అయితే మీడియా, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మెటల్ 0.9-0.4 శాతం మధ్య క్షీణించాయి. టాటా మోటార్స్ దాదాపు 9 శాతం జంప్‌చేయగా, ఎయిర్టెల్, ఐషర్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, పవర్‌గ్రిడ్, యస్ బ్యాంక్, గెయిల్, హెచ్డీఎఫ్సీ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. మరోవైపు జీ, బీపీసీఎల్, బజాజ్ ఆటో, బ్రిటానియా, సన్ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్, అల్ట్రాటెక్, యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్ 3-0.8 శాతం మధ్య నష్టపోయాయి. -
స్టాక్‌మార్కెట్లు మరోసారి రికార్డ్ ముగింపు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మరోసారి రికార్డ్ స్థాయిలో ముగిశాయి. ముఖ్యంగా కీలక సూచీ సెన్సెక్స్ 34వేలకు ఎగువన పటిష్టంగా ముగిసింది. ఇదే బాటలో నిఫ్టీ 44 పాయింట్లు ఎగిసి 10,500కి ఎగువన 10, 536వద్ద క్లోజ్ అయింది. దాదాపు అన్ని సెక్టార్లలో లాభాల పంటపడింది. మెటల్ సెక్టార్ టాప్ విన్నర్‌గా నిలిచింది. సిప్లా, బాష్, వేదాంత, ఆర్ఐఎల్, భారతి ఎయిర్టెల్, భారీగా లాభ పడగా, ముఖ్యంగా డీఎల్ఎఫ్, సెయిల్, జెట్ ఎయిర్వేస్ 52వారాల గరిష్ఠాన్ని నమోదు చేశాయి. మరోవైపు ఎస్డీఆర్ ప్రకటనతో ఆర్ కాం 40శాతానికిపై లాభపడడం విశేషం. జస్ట్ డయల్, జేపీ అసోసియేట్ లాభాలను ఆర్జించాయి. ఇక కోల్ ఇండియా, ఎస్బీఐ, ఐవోసీ, ఎన్టీపీసీ, హెచ్‌యూఎల్, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. -
మార్కెట్ల దూకుడు..మళ్లీ రికార్డ్ ముగింపు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మరోసారి రికార్డు స్థాయిలవద్ద ముగిశాయి. ఆరంభం నుంచి దూకుడుమీద ఉన్న మార్కెట్లు ముగింపువరకు అదే ధోరణిని కొనసాగించాయి. ప్రధానంగా బ్యాంకింగ్, టెలికాం, ఎఫ్ఎంసీజీ రంగాల భారీ లాభాలతో దలాల్ స్ట్రీట్‌లో బుల్ ర్యాలీ కొనసాగింది. ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాలను అందుకున్న సెన్సెక్స్, నిఫ్టీ పటిష్ట స్థాయిలవద్ద ముగిశాయి. సెన్సెక్స్ 391పాయింట్లు ఎగిసి 33, 603 వద్ద, నిప్టీ106 పాయింట్ల లాభంతో 10, 440 వద్ద పటిష్టంగా ముగిశాయి. మంగళవారం మార్కెట్ ముగిసిన తరువాత ఫలితాలను ప్రకటించిన భారతి ఎయిర్ టెల్ టాప్ గెయినర్‌గా నిలిచింది. దాదాపు అన్ని బ్యాంకుల షేర్లు లాభాల్లో ముగియగా ఐటీ, ఫార్మ షేర్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఐడియా, స్టేట్‌బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, వేదాంతా, హెచ్‌యూఎల్, హిందాల్కో, ఐటీసీ లాభాలను ఆర్జించగా, ఐషర్, భారతి ఇన్ఫ్రాటెల్ అశోక్ లేలాండ్, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్, జీ, టీసీఎస్, ఇన్ఫ్రాటెల్, పవర్‌గ్రిడ్, సన్ ఫార్మా, హెచ్‌పీసీఎల్ నష్టపోయాయి. -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ఈక్విటీ బెంచ్మార్కులు శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాల్లో ముగిశాయి. గత మూడు నెలల కాలంలో అతిపెద్ద వారాంత లాభాలుగా మార్కెట్లు రికార్డు కెక్కాయి. సెన్సెక్స్ 52.90 పాయింట్ల లాభంలో 26,747.18వద్ద, నిఫ్టీ 14.90 పాయింట్ల లాభంలో 8,261.75 పాయింట్ల లాభంలో ముగిశాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంకు, ఐటీసీ లాభాలు పండించగా.. బజాజ్ ఆటో, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, మహింద్రా అండ్ మహింద్రా, సిప్లా సెన్సెక్స్‌లో నష్టాలు గడించాయి. ప్రారంభ లాభాలను మార్కెట్లు నిలబెట్టుకున్నట్టు విశ్లేషకులు చెప్పారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రేట్లను యథాతథం కొనసాగిస్తున్నట్టు ప్రకటించి మార్కెట్లను నిరాశపరిచిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ఉద్దీపన ప్యాకేజీని కొనసాగిస్తుందనే అంచనాలు మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు. సెప్టెంబర్ 2 నుంచి మంచి వారాంత లాభాలను రెండు ఇండెక్స్‌లు నమోదుచేశాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.09 పైసలు బలహీనపడి 67.45గా ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర కూడా 50 రూపాయల నష్టంతో రూ.27,727గా నమోదైంది. -
మార్కెట్లకు చమురు జోష్
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు క్షీణించడంతో దేశీ మార్కెట్లకు జోష్ వచ్చింది. బ్రెంట్ చమురు బ్యారల్ ధర 100 డాలర్ల సమీపానికి చేరగా, నెమైక్స్ ధర 93 డాలర్లకు దిగింది. దీంతో ఆయిల్ షేర్లకు డిమాండ్ పుట్టింది. హెచ్‌పీసీఎల్, క్యాస్ట్రాల్, ఐవోసీ, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా 4.5-2.5% మధ్య జంప్ చేయగా, ఆర్ఐఎల్ 1% లాభపడింది. ఫలితంగా ఆయిల్ ఇండెక్స్ 1.8% పుంజుకోగా, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్ రంగాలు సైతం 1.2% చొప్పున లాభపడ్డాయి. చమురు ధరలు క్షీణించడం ద్వారా దిగ్గుమతుల భారం తగ్గుతుందని, దీంతో ద్రవ్య లోటులకు కళ్లెం పడుతుందని విశ్లేషకులు పేర్కొన్నారు. అంతిమంగా ఇది ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదం చేస్తుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో అన్ని రంగాల్లోనూ కొనుగోళ్లు చేపట్టారని చెప్పారు. వెరసి సెన్సెక్స్ 293 పాయింట్లు జంప్‌చేసి 27,320 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 87 పాయింట్లు ఎగసి 8,174 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 27,355కు చేరగా, నిఫ్టీ 8,180ను అధిగమించింది. ఇవన్నీ కొత్త రికార్డులే. నాలుగు మాత్రమే... సెన్సెక్స్ దిగ్గజాలలో 4 మాత్రమే నీరసించాయి. ఎన్టీపీసీ 1.6%, ఎంఅండ్ఎం 0.7% చొప్పున నష్టపోగా, హిందాల్కో 3.5% ఎగసింది. మరోవైపు ఎఫ్ఐఐల అండ కొనసాగుతోంది. మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ. 1.25 లక్షల కోట్లు పెరిగింది. రబ్బర్ ధరలు పతనంకావడంతో టైర్ కంపెనీల షేర్లు అపోలో, సియట్, డన్లప్, ఫాల్కన్, గుడ్ఇయర్, జేకే, ఎంఆర్ఎఫ్, టీవీఎస్ శ్రీచక్ర 5-20% మధ్య దూసుకెళ్లాయి.